రాజ‌ధాని రైతులు చంద్ర‌బాబునాయుడుకు షాక్ ఇచ్చారు. సింగ‌పూర్ మంత్రి ఈశ్వ‌ర‌న్ తో అమ‌రావ‌తి స‌చివాల‌యంలో చంద్ర‌బాబు స‌మావేశ‌మైన స‌మ‌యంలోనే రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేయ‌టం గ‌మ‌నార్హం. రాజ‌ధాని నిర్మాణంలో సింగపూర్ కంపెనీల‌తో చంద్ర‌బాబు కుదుర్చుకున్న ఒప్పందాలను ర‌ద్దు చేయాలంటూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళ‌న చేశారు.  రాజ‌ధాని నిర్మాణం పేరుతో నాలుగేళ్ళ క్రిత‌మే రైతుల నుండి చంద్ర‌బాబు 35 వేల ఎక‌రాల‌ను సేక‌రించిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. రైతుల నుండి భూములు తీసుకున్న చంద్ర‌బాబు ఇంత వ‌ర‌కూ ఒక్క నిర్మాణం కూడా మొద‌లుపెట్ట‌లేదు. చేసిన ప‌నుల‌కే శంకుస్ధాప‌న‌లు త‌ప్ప ఇంకేమీ జ‌ర‌గ‌లేదు. 

అమ‌రావ‌తిలో రైతుల ఆందోళ‌న‌


ఇటువంటి నేప‌ధ్యంలోనే రైతుల భూముల‌పై సింగ‌పూర్ కంపెనీల‌కు చంద్ర‌బాబు ప‌వ‌ర్ ఆఫ్ అటార్నీ రాసిచ్చేసిన‌ట్లు  కొన్ని డాక్యుమెంట్లు వెలుగు చూశాయి. దాంతో రైతుల్లో ఆందోళ‌న మొద‌లైంది. అందులోని డాక్యుమెంట్ల  ప్ర‌కారం రాజ‌ధాని నిర్మాణానికి చంద్ర‌బాబు ఏర్పాటు చేసిన బోర్డులో సింగ‌పూర్ సంస్ద‌ల‌కే అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇచ్చారు. ఇటువంటి అనేక లొసుగులు క‌న‌బ‌డుతుండ‌టంతో అంద‌రిలోనూ అనేక అనుమానాలు మొద‌ల‌య్యాయి. అదే స‌మ‌యంలో సింగ‌పూర్ మంత్రితో ఈరోజు చంద్ర‌బాబు భేటీ విష‌యం రైతుల‌కు తెలిసింది. దాంతో రాజ‌ధాని ప్రాంతానికి చెందిన ప‌లువురు రైతులు అమ‌రావ‌తికి చేరుకున్నారు. సింగ‌పూర్-చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మ‌ధ్య జ‌రిగిన ఒప్పందాల‌ను వెంట‌నే ర‌ద్దు చేసుకోవాలంటూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళ‌న మొద‌లుపెట్టారు.

భాగ‌స్వామ్యంపై చ‌ర్చ‌లు

Image result for chandrababu and eswaran

చంద్రబాబు-సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్ మ‌ధ్య జ‌రిగిన భేటీలో ఇరు ప్రాంతాల మ‌ధ్య  స్నేహపూరిత సంబంధాలు, భాగస్వామ్యాలు, ఒప్పందాలపై ప్రధానంగా చర్చలు జరిగిన‌ట్లు స‌మాచారం. ఈ సమావేశంలో సింగపూర్‌లో రైతుల పర్యటనకు సంబంధించిన లఘుచిత్రాన్ని సింగపూర్‌ ప్రతినిధులు ప్రదర్శించారు. ఏపీలో పర్యాటక ఆకర్షణీయమైన చారిత్రక కట్టడాలు, సహజ సిద్ధమైన ప్రకతి వనరులు ఎన్నో ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. పర్యాటక రంగంలో ఏపీకి సహకరించేందుకు ముందుకు రావాలని కోరారు. ఒప్పందాల ర‌ద్దుపై రైతుల ఆందోళ‌న‌ను చంద్ర‌బాబు ఏమాత్రం ఖాత‌రు చేయ‌క‌పోవ‌టం గ‌మనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: