విభజన తర్వాత ఏపి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు పదవీ బాధ్యతలు స్వీకరించారు.  తాజాగా చిత్తూరు జిల్లా పలసపల్లెలో నవనిర్మాణ దీక్షలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ..గడిచిన నాలుగేళ్ల కాలంలో చేసిన అభివృద్ధిని చూసి గర్వపడుతున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే, ప్రతిపక్షాలు మాత్రం మంచిని చెడుగా చూపే ప్రయత్నం చేస్తున్నాయని, వారి ఆటలు సాగబోవన్నారు.
Image result for chandrababu naidu chittoor
ప్రజలకు ఏది మంచో, ఏది చెడో తెలుసని వ్యాఖ్యానించారు. కొందరు నాయకులు అధికారంలోకి వస్తే వాళ్లు జైలుకు వెళ్లడంతో పాటు ప్రజలను జైలుకు పంపిస్తారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తప్పుడు పనులు చేసి కోర్టుల చుట్టూ తిరుగుతోన్న వారు రాష్ట్రానికి ఏం చేస్తారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా రాష్ట్రాభివృద్ధి ఆగదని, పని చేస్తోన్న పార్టీకి ఓట్లు వేయాలని కోరుతున్నానని అన్నారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. కేసుల మాఫీ కోసమే వైసీపీ ప్రయత్నిస్తోందని, బీజేపీతో కలిసి లాలూచీ రాజకీయాలు చేస్తోందని పేర్కొన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలు అందరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చూశామని, దాంతో అన్ని వర్గాల ప్రజల్లో ఆనందం నెలకొందని చెప్పారు.

2019 ఎన్నికల్లో జాతీయ స్థాయిలో పొత్తులకు అవకాశం లేదన్నారు. రాష్ట్ర స్థాయిలో పొత్తులే కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు. గ్రామాల్లో సిమెంటు రోడ్లు, ఎల్ఈడీ వీధి దీపాలు, కాలువల నిర్మాణం తదితర అభివృద్ధి పనులపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: