“బీజేపీతో పొత్తు పెట్టుకున్నవారికి ఓటేయకండి. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నవారిని ఎన్నికల్లో చిత్తుగా ఓడించండి”  అని సీఎం చంద్రబాబు ప్రజలను కోరారు. 


(దీనికి ప్రజల నుండి వినబడ్డ సమాధానం మీరు నిన్నటి వరకు బిజెపి తోనే పెట్టుకున్నారు కదా! మేంచేసినది తప్పా! అని కలకలం వినిపించింది ప్రజల్లో)


విజయ నగరం జిల్లా లక్కవరపుకోట మండలం, జమ్మాదేవిపేటలో సోమవారం నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొని రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీకి వ్యతిరేకంగా మహాకుట్ర జరుగుతోందని, ప్రజలంతా తనకు  రక్షణ కవచంలా ఉండాలని వేడుకున్నారు.


(ప్రజలంతా టిడిపి వాళ్ళా? ప్రజలెందుకు టిడిపికి మాత్రమే రక్షణ కవచంగా ఎందుకు ఉండాలి? మీరు బిజెపికి వ్యతిరేఖంగా కుట్ర చేయట్లెదా? వాళ్లు కూడా రక్షణ అడిగితే?)

Image result for people have to shield TDP chandrababu

అనంతరం ఎస్‌.కోటలో నిర్వహించిన నవ నిర్మాణ దీక్ష సభకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తనను పొగిడిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తనపై విమర్శలు చేస్తూ రాష్ట్రాన్ని బలహీన పరుస్తున్నారని అన్నారు. అసలు పవన్‌ తననెందుకు తిడుతున్నాడో? అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.



(పవన్ కళ్యాణ్ - మిమ్మల్ని తిడితే - రాష్ట్రాన్ని, మమ్మల్ని తిట్టినట్లు, ఏలా ఔతుంది? ఇలా ప్రతి రాజకీయ నాయకుడు రక్షణ అడిగితే - ఆ బోడిలింగం గాళ్లకు రక్షణ ఇచ్చే అవసరం మాకేమిటి?  అంటున్నారు జనం. మీతో స్నెహం చేసిన వాళ్ళకు మీరు హాండిస్తే మీరు స్నెహం చెసిన వారు మీకు హాండివ్వడా? మీకో రూలు ఇతరులకో రూలా?) 


Image result for people have to shield TDP chandrababu

‘నా చేతికి వాచీ, ఉంగరం లేదు, జేబులో డబ్బులు లేవు, నేనెప్పుడూ అమ్మాయిలతో తిరగలేదు, మందుకొట్టలేదు, సిగరెట్‌ కాల్చలేదు, చెడు స్నేహాలు కూడా చేయలేదు. అలాంటి నన్ను తిడుతుంటే మీ కోసం భరిస్తున్నాను’ అని సీఎం అన్నారు.


(ఇవన్నీ బోకు మాటలు కదా! అయినా ఇవన్నీ నాయకునికి ఉండవలసిన లక్షణాలని రాజ్యాంగం కూడా చెప్పలేదు. అయినా  ఎందుకంటే భారత్ లోనే అత్యంత సుసంపన్నవంతుడైన ముఖ్యమంత్రికి, ప్రఖ్యాత హెరిటేజ్ అధినేత భువనేశ్వరీదేవి గారి భర్తకు, స్టాన్-ఫోర్ట్ విద్యావేత్త, బహుముఖ ప్రఙ్జాశాలి, బ్రహ్మిణి లోకేష్ గారి మామగారు ఇంత దీనంగా డబ్బులేదనటం ఎంత దయనీయం? దీనికంటే బిచ్చమెత్తుకోవటం కదా!  అయినా మీ దగ్గర డబ్బులు లేవంటే ఎంత నిజమో? మిగిలినవన్నీ అంతే నిజం అదే---వాచీలేదు, అమ్మాయిలతో  తిరగలేదు, చెడు స్నెహాలులేవు  అనటం మోడీలాంటి దుర్మార్గునితో నాలుగేళ్లు ఆయనపై ఈగ వాలకుండా కాపలా గాసి స్నేహం చేసి ఇప్పుడు చెడు స్నేహాలు చేయ లేదనటం మహా తప్పు గదా? ఇవెంత సొల్లు కబుర్లో తెలివైన ఏపి ప్రజలకు తెలియదా?  అందుకే మీరు మా కోసం ఇంత వేదనను భరించక్కర లేదు స్వామీ! ) 


Image result for people have to shield TDP chandrababu
ప్రధాని మోదీ తిరుపతి వెంకన్న సాక్షిగా అమరావతిని ఢిల్లీ కంటే మిన్నగా అభివృద్ధి చేస్తామని, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ప్రజలకు, ఏడుకొండల వాడికి ద్రోహం చేశారన్నారు. 



(ప్రజల పాయింటే మంటే మోదీ! ఎంత ద్రోహం చేశాడో, మీరంత కన్నా ఎక్కువే అంటే 600పైగా వాగ్ధానాలు ఆంధ్రప్రదేశ్ వాసులకు చేసి మాట తప్పినా  ఏడుకొండల  వాడు  ఏమీ చేయలేదని, అలాంటి మీ లాంటి నమ్మక ద్రోహి, హైందవధర్మానికి టిటిడిలో తూట్లు పొడిచి సర్వనాశనం చేస్తున్నందున ఆ శాపాన్ని ఆయన నిజం చేయ దలచు కోలేదటని నమ్ముతున్నారట. అసలు మోడీ! ఏపి కి ఏమీ చేయడని 2016 లో 'ప్రత్యేకపాకేజీ' అన్నప్పుడె అందరికి  తెలిసింది. మీరే కొంత కాలమైనా పదవులు ఉంటాయని స్వప్రయోజనాలు, నెరవేర్చుకోవచ్చని అనుభవించొచ్చని, ఆయన అదే చెడు మిత్రునితో అంటకాగారట మీరు మీ సుజాన, అశోక్ గారు? మీరెంత బుద్దిమంతులో ప్రజలు అక్కడికక్కడే మీటింగ్ లోనే అంటున్నారు. అయినా మీ స్వంత మీడియా మీకు చెప్పే ఉంటుంది లెండి! )



కర్ణాటకలో బీజేపీకి బలం లేకపోయినా ఎమ్మెల్యేలను కొనడానికి బరితెగించి కోర్టు ఆదేశాలతో చతికిలపడిందని ఎద్దేవా చేశారు.
(మీరు అవసరం లేకపోయినా విపక్ష ఎమెల్యేలను కొనలేదా?)


ప్రజల్లో బాబు పై అసలు నమ్మకమే పోయిందని తన పాలనలో ట్రాన్స్పెరెన్సీ లేదని సింగపూర్ ప్రభుత్వంతో అవరావతి నిర్మాణంలోని నిగూఢరహస్య మేమిటని అంటున్నారు. స్విస్ చాలెంజ్ అనే విషయం ఒక అగమ్యగోచరం బ్రహ్మ పదార్ధం అన్నారు ఒక విధ్యార్ధి. 


అసలు ఎవరి కోసం పదేళ్ల పాటు నిర్విరామంగా ఉపయోగించుకోవాలని చట్టం నిర్దేశిస్తే ఎవరికోసం హైదరాబాద్ ను వదిలేశారు. ధారుణంగా ఉద్యోగుల్ని వంచించారని దానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇప్పటివరకు వివరణలేదని అర్ధాంతరంగా హైదరాబాద్ వదిలేసి వచ్చిన ఒక ఉద్యోగి వేదన.


విభజన ప్రయోజనం సమైఖ్య రాజధాని వదిలేసినప్పుడు ఎవరైనా ఇలాంటి వ్యక్తి నాయకత్వం ఆద్వర్యానికి ప్రత్యేక హోదా / ప్రత్యేక పాకేజీ ఎలా ఇస్తారు? అని నిగ్గదీశారు ఒక డాక్టర్.  


ఎస్‌.కోటలో చంద్రబాబు నిర్వహించిన నవ నిర్మాణదీక్ష సభలో గాలివాన బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో భారీ గాలివాన రావడంతో టెంట్లు కూలిపోయి బారికేడ్లు తిరగబడ్డాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో సభకు అంతరాయం ఏర్పడింది. తర్వాత విద్యుత్‌ను పునరుద్ధరించడంతో చంద్రబాబు సభను ఉద్దేశించి ప్రసంగించారు. జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల నుంచి తరలించిన మహిళలు, వృద్ధులు, యువకులు మండుతున్న ఎండలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నానా ఇబ్బందులు పడ్డారు. 



అనంతరం భారీ వర్షంలో తడిసి ముద్దవడంతో సీఎం ప్రసంగిస్తుండగానే వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో మంత్రు లు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, సుజయ కృష్ణ రంగారావు, ఎంపీ అశోక్‌గజపతిరాజు, జెడ్పీ చైర్‌పర్సన్‌ శోభా స్వాతిరాణి, ఎమ్మెల్యే లలితకుమారి, ఈపీడీసీఎల్‌ డైరెక్టర్‌ శోభా హైమావతి, జిల్లా కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ సహా పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. 


Image result for people have to shield TDP chandrababu

విశాఖ విమానాశ్రయంలో సోమవారం రాత్రి గోపాలపట్నం, ములగాడ, మహారాణిపేట తహసీల్దార్‌ కార్యాలయాలను రిమోట్‌ ద్వారా సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులందర్నీ కలుపుకుని పోతున్నారని అన్నారు. 


కాగా, కళింగ వైశ్యులకు ఓబీసీ రిజర్వేషన్‌ ప్రభుత్వం ఇచ్చినా విశాఖ జిల్లా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఆ సామాజికవర్గానికి చెందిన నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. కళింగ వైశ్యుల సంఘం జిల్లా అధ్యక్షుడు పూనా ఉమా మహేశ్వరరావు ఈ మేరకు విశాఖలో సీఎంను కలిసి విజ్ఞప్తి చేశారు. 


(మీ రాజకీయాలు కళింగవైశ్యులకు తెలియదేమో? మీకు నోటితో “యెస్” చెప్పి అధికార యంత్రాంగానికి నోసలతో “నో” అని పని చేయకుండా చేయగల కుటిల రాజకీయవాదని చెప్పగల సమర్ధులని!)


Image result for people have to shield TDP chandrababu


ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ కొత్తపల్లి సుబ్బారాయుడు, జేసీ, సృజన, పోలీస్‌ కమిషనర్‌ యోగానంద్, జాయింట్‌ సీపీ రవికుమార్‌ జీవీఎంసీ కమిషనర్‌ హరినారాయణన్, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ మూర్తి, విష్ణుకుమార్‌రాజు, గణబాబు, పల్లా శ్రీనివాస్, వాసుపల్లి గణేష్‌కుమార్, జెడ్పీ చైర్‌ పర్సన్‌ లాలం భవానీ పాల్గొన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: