ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చిన పవన్ జనసేనను జనంలోకి తీసుకెళ్లడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ క్రమంలోనే పోరాటయాత్ర పేరుతో యాత్రను కొనసాగిస్తున్నాడు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం నుండి తన యాత్రను మొదలుపెట్టిన ఆయన ప్రస్తుతం విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నాడు. విశాఖ మన్యంలో పర్యటిస్తూ అక్కడి గిరిజన ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నాడు. 


ఈ క్రమంలోనే మన్యం గిరిజనుల సంక్షేమాన్ని పట్టించుకోవడమే మానేసిన అంధ్రప్రదేశ్ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. చంద్రబాబు గిరిజనుల బాగోగులే పట్టించుకోవడం మానేశాడని తెలిపాడు. హెరిటేజ్ లో సిమెంట్ రోడ్లు వేయించుకున్న బాబు మన్యం ప్రాంతాలలో అసలు రోడ్లు వేయడమే మర్చిపోయారని ఎద్దేవా చేశాడు. పాడేరు నుంచి, ఇతర గ్రామాల నుంచి రాష్ట్ర ఖజానాకు రూ.9 కోట్లు రావాల్సిన ఆదాయం ఎక్కడికెళ్లిందని ఆరోపించారు.


కాగా పవన్ చేసిన వాఖ్యలపై పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మండిపడ్డారు. నేడు పాడేరులో విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ- చేస్తున్న  సినిమాలు హిట్ అవడం లేదు కాబట్టే  పవన్ కల్యాణ్ పర్యటనలు చేస్తున్నాడని తెలిపింది. పవన్‌ కల్యాణ్‌కు సినీరంగంలో అనుభవం ఉండవచ్చని, కానీ రాజకీయ రంగంలో పరిపక్వత లేదని ఆమె ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. పవన్, చంద్రబాబుపై విమర్శలు చేయడం తగదని, అసలు మన్యం ప్రాంతాన్నంతటిని అభివృద్ధి చేసిన ఘనత తమ పార్టీ నాయకుడిదేనని ఆమె తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: