మనం భారతీయులం మనమంతా ఒక్కటే. ప్రపంచంలో ఇంత భిన్నత్వం ఉన్నదేశం భారత్ ఒక్కటే. అయినా ఇంతగా ఏకత్వం సాధించటం అనేది మరొక దేశానికి అసాధ్యం. దీనికి కారణం మన హిందూ ధర్మం సహస్రాబ్ధాలుగా జాతిలో నేలకొల్పిన్న జాతీయత, దేశభక్తి, సహనం, సౌహార్ధ్రం. ఆ జిఙ్జాసే తనను ఇక్కడికి నడిపించిందని అన్నారు భారత జాతి గౌరవ ప్రతీక మాజీ రాష్ట్రపతి ప్రణబ్ దా! నిజంగా ఆయన 'దా' నే అని మరో సారి జాతి హృదయాల్లో మోగిపోయిందా క్షణాన. 


మాజీ రాష్ట్రప‌తి, సీనియ‌ర్ నాయ‌కుడు ప్ర‌ణబ్ ముఖ‌ర్జీ వైపే అందరూ చూస్తున్న సమయమది ఎందుకంటే, కాంగ్రెస్ పార్టీలో ఉండ‌గా ఆర్‌.ఎస్‌.ఎస్‌ ను తీవ్రంగా వ్య‌తిరేకించిన ప్ర‌ణ‌బ్ దా ఇప్పుడు అదే సంస్థ నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి అతిథిగా నాగపూర్ వెళ్లారు. హెఘ్డేవార్ ఇంటికి వెళ్లారు, ఆయ‌న జ‌న్మ‌స్థ‌లం సంద‌ర్శించారు. అంతేకాదు, ఆయ‌న స‌మాధి ద‌గ్గ‌ర‌కి వెళ్లి "గ్రేట్ స‌న్ ఆఫ్ మ‌ద‌ర్ లాండ్" అంటూ అక్క‌డి సందర్శకుల పుస్తకంలో రాశారు. 


ఇక‌, ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ణ‌బ్ ముఖర్జీ ఉపన్యాసం చాలా బాలన్స్డ్ గా సాగింది. అనవసరంగా ఒక మాట ఎక్కువ-ఒకమాట తక్కువ- కాకుండా పొల్లుమాటలు లేకుండా ఆర్‌.ఎస్‌.ఎస్‌.ను పొగడ్తలతో ముంచెయ్యాలన్న ధోరణి ఎక్క‌డా క‌నిపించ‌లేదు. అసలు ప‌రోక్షం సంకేతాలు కూడా లేవనే చెప్పాలి. ఈ సమయాన ప్రజలకు జాతీయవాదం, దేశ‌భ‌క్తి అవశ్యకత గుఱించి గురించి మాత్ర‌మే తాను మాట్లాడ‌తానంటూ, అలాగే అసహనం ఆందోళనలతో సాధించగలిగేదేమీ లేదంటూ ప్ర‌ణ‌బ్ ముఖర్జీ ప్ర‌సంగం ప్రారంభించారు. 
Image result for pranab daa at RSS meeting in nagpur
తనకు రాజకీయ జన్మ నిచ్చిన సొంత పార్టీ నుంచి ఎన్ని ఒత్తిళ్లు వస్తున్నా, ఎవరెంతగా విమర్శలు చేస్తున్నా. ఆఖరికి కన్న కూతురు శర్మిష్ఠ ముఖర్జీ వేలెత్తి చూపినా ఆయన జాతి ప్రథమ పౌరునిగా ఇంకా ప్రజా హృదయాల్లో హిమోన్నతమయ్యారు. అసలు ఈ మాటలు ఈ విమర్శలు ఆయనకు 'పూచిక పుల్ల' తో సమానం చేసి తన నాయకత్వ పఠిమ చూపారు. 
Image result for pranab daa at RSS meeting in nagpur
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినే మోహన్ భగవత్ ఆహ్వానం మేరకు, తను అనుకున్నట్లుగానే నాగపూర్‌ పర్యటనకు వచ్చారు. మొదట 'సంఘ్ వ్యవస్థాపకుడైన హెడ్గేవార్‌' కు నివాళులర్పించిన ఆయన, తర్వాత ఆరెసెస్స్ ప్రధాన కార్యాలయంలో జరిగిన 'తృతీయ వర్ష్ వర్గ్' కార్యక్రమానికి ముఖ్య అతిథి గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయత, దేశభక్తి అన్న భావనలపై తన అభిప్రాయాన్ని వెల్లడించేందుకే ఇక్కడికి వచ్చానని స్పష్టంచేశారు. ఇది చూడటానికి మన కుటుమంబంలో ఎన్ని విభేదాలున్నా, మన సోదరుని ఇంట్లో కళ్యాణం జరుగుతుంటే వారిని ఆశీర్వదించటానికి వెళ్ళిన గృహ ప్రథమునిలా కనిపించారు ప్రణబ్ దా!   
Image result for bala gangadhara tilak & vallab bhai patel
భారతదేశం ఒక భాష, ఒక మతం అని ఎప్పటికీ ఊహించలేమని, భారతీయత అనే మహా భావన మహా జన పదాలతో ఏర్పడిందని ప్రణబ్ ముఖర్జీ అన్నారు. అసహనం, ఆందోళన అన్నవి మన జాతి ఏకత్వ భావనను దెబ్బతీస్తాయన్నారు. జాతి, జాతీయత అనే భావనలు యూరప్ దేశాలకంటే కంటే ముందే మన దేశంలో ఏర్పడ్డాయ న్నారు. అనేక మంది మార్కోపోలో, హ్యూయంత్సాగ్ లాంటి విదేశీ యాత్రికులు భారత సందర్శనతోనే భారతీయత గురించి స్పష్టమైన అవగాహన పొందారని, తక్షశిల, నలంద, విక్రమశిల వంటి విశ్వవిద్యాలయాలు భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, హైందవత్వంలోని జీవన విధానం, భారతీయ విద్యావ్యాప్తికి నిదర్శనమని ఆయన కొనియా డారు. బహుళత్వాన్ని ఆస్వాదించే గుణం మన జీవన విధానంలోనే ఉందని ఆయన అన్నారు. 
Image result for pranab daa at RSS meeting in nagpur

అశోక చక్రవర్తి సమయంలో దేశమంతా భౌగోళికంగా ఏకఛత్రాధిపత్యం కిందకు వచ్చిందని, దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చిన ఘనత ఖచ్చితంగా మౌర్యులకే చెందుతుంద న్నారు. మన దేశానికి వచ్చిన అనేక జాతులు, సంస్కృతులు మన జీవనవిధానంలో విలీనమయ్యాయని, "సర్వమతాల ఏకత్వం" లోనే భారతీయ భావన నిక్షిప్తమై ఉందని స్పష్టంచేశారు. 
Image result for bala gangadhara tilak & vallab bhai patel
"స్వరాజ్యమే నాజన్మ హక్కు" అని నినదించిన ధీరుడు లోకమాన్య బాల గంగాధర తిలక్ అని, స్వాతంత్రం ఎవరో ఇచ్చిన బహుమానం కాదని, పోరాడితెచ్చు కున్న దన్నారు. సంస్థానాల విలీనంతో భారతదేశానికి ఒకరూపు తెచ్చిన మహనీయుడు సర్దార్ వల్లబ్ భాయి పటేల్ అని కొనియాడారు. దేశం కోసం దేశ ప్రజలే ఏర్పాటు చేసుకున్న గొప్ప రాజ్యాంగం మనది అని అన్నారు. దేశ ప్రజలంతా వసుదైక కుటుంబం, 'సర్వేజనా సుఖినోభవంతు' అన్న భావన కలిగి ఉండాలని పిలుపు నిచ్చారు. దేశం లోని ప్రతీ పౌరుడు సాంస్కృతిక వైవిధ్యాన్ని, భిన్నత్వాన్ని ఆస్వాధించి గౌరవించాలని ప్రణబ్ ముఖర్జీ సూచించారు.
Image result for bala gangadhara tilak & vallab bhai patel
ఇదీ వ్యక్తి గతంగా తనకు గాని, తాను పుట్టి పెరిగిన పార్టీకి గాని, తనను అథిది గా ఆహ్వానించిన తన సోదర సంస్థకు గాని చివర కు తన దేశ ఔన్నత్యానికి గాని ఎలాంటి చెఱుపు చేయని ఆయన వ్యవహరించిన తీరు ఆదర్శనీయం. ఆచరణీయం. సదా స్మృతిపథం లో ఉంచుకోవలసిన అమూల్య భారత దర్శనమది. స్పూర్తిమంతం. ఏవరూ ఇంతగా జాతి హృదయాల్లో ప్రస్తుత పరిస్థితుల్లోఅ ఈ స్థాయి ముద్ర వేయలేరు. చివరకు ప్రణబ్ దా కడుపున పుట్టిన శర్మిష్ఠ కూడా! దటీజ్ ప్రణబ్ దా! మహిమా న్విత మహనీయత.  

Image result for pranab daa at RSS meeting in nagpur

మరింత సమాచారం తెలుసుకోండి: