కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ను స్థాపిస్తానని ప్రాంతీయ పార్టీలు చక్రం తిప్పుతాయని బిజెపి మరియు కాంగ్రెస్ కు గడ్డు కాలం తప్పదని చాలా మాట్లాడినాడు కేసీఆర్. అయితే దానికి అనుగుణంగానే కేసీఆర్ అన్ని రాష్టాల ప్రతినిధులతో భేటీ అయినాడు కూడా అయితే వారి నుంచి ఎటువంటి స్పందన రాలేదు . ఎవరు కూడా అంత సుముఖంగా లేరని  చెప్పాలి. దీనితో కేసీఆర్ కూడా చేసేదేమి లేక సైలెంట్ అయ్యాడని చెప్పవచ్చు. 

Image result for kcr

అయితే తాజాగా సీపీఐ నాయకుడు సురవరం సుధాకరరెడ్డి మాటలను గమనిస్తే.. కేసీఆర్ ప్రచారం చేస్తున్న ఫెడరల్ ఫ్రంట్ కు క్రెడిబిలిటీ లేదేమో అని అనిపిస్తుంది. ఇంతకూ విషయం ఏంటంటే.. కేసీఆర్ ప్రకటిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ అనేది.. భారతీయ జనతా పార్టీ స్పాన్సర్ షిప్ తో నడుస్తున్న ప్లాన్ బీ మాత్రమే అని సురవరం సుధాకర రెడ్డి ఆరోపిస్తున్నారు. ఒకకోణంలోంచి చూసినప్పుడు ఆయన ఆరోపణలను పూర్తిగా కొట్టిపారేయలేం.

Image result for kcr

ఎందుకంటే.. నరేంద్ర మోడీని తిడుతూ.. భాజపా సర్కారును గద్దె దించాలనే మాట అనే వరకు కేసీఆర్ ఏనాడూ మోడీకి వ్యతిరేకంగా గళం విప్పిందిలేదు. పైగా కేసీఆర్ సహా ఆయన కుటుంబం మొత్తం, తెరాస నేతలు మొత్తం మోడీ సర్కారు భజనలోనే కాలం గడుపుతూ వచ్చారు. తెరాస కూడా ఎన్డీయేలో అప్రకటిత భాగస్వామి అని అందరూ భావించే రీతిలో వారి భజన పర్వం సాగుతూ వచ్చింది. కాబట్టి ఈవిధంగా కేసీఆర్ మీద నమ్మకం లేకనే ఈ ఫెడరల్ ఫ్రంట్ కు ఎవరు కూడా ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: