భారత దేశంలో రైళ్లలో ప్రయాణించే వారు రోజు రోజుకీ పెరిగిపోతున్నారు.  దేశ వ్యాప్తంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం చేయగల వసతి రైళ్లలో మాత్రమే ఉంటుంది కనుక దీనికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు సామాన్య ప్రజలు.  తాజాగా అధిక లగేజీతో రైలెక్కే ప్రయాణికులకు జరిమానా విధించాలని రైల్వే నిర్ణయించిన సంగతి విదితమే. దీనిపై సామాన్య ప్రజలు భగ్గుమన్నారు..ఇప్పటికే రైల్ ప్రయాణాల్లో నిలువు దోపిడి జరుగుతుందని..ఇప్పుడు మరో దోపిడికి యత్నిస్తే సహించేది లేదని..  సోషల్ మీడియా వేదికగా రైల్వే నిర్ణయంపై దుమ్మెత్తిపోశారు. 
Image result for indian railway
ఇక ప్రయాణికుల నుంచి వస్తున్న విమర్శలతో భారతీయ రైల్వే వెనక్కి తగ్గింది. అధిక లగేజీ తీసుకెళ్లే ప్రయాణికులపై జరిమానా విధించాలన్న నిబంధనను ఉపసంహరించుకుంది. మరోవైపు ప్రతిపక్షాల నుంచి కూడా తీవ్ర విమర్శలు రావడంతో వెనక్కి తగ్గిన రైల్వే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపింది.
Image result for indian railway luggage
కాగా, రైల్వే స్టేషన్లలో తప్పిపోయిన, విడిచిపెట్టిన, పారిపోయి వచ్చిన, అక్రమ రవాణాకు గురవుతున్న చిన్నారులను గుర్తించేందుకు 174 రైల్వే స్టేషన్లలో చైల్డ్ హెల్ప్ లైన్ డెస్క్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: