టీడీపీ అధినేత చంద్ర‌బాబు వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించా రు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న నియోజక‌వ‌ర్గంలో పార్టీ ప‌రిస్థితి.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి త‌న‌కు ల‌భించే మెజారిటీ.. కార్య‌క ర్త‌ల ప‌నితీరును స‌మీక్షించారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న వివిధ ప‌థ‌కాలు త‌న నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌కు ఏ విధంగా అమ‌ల‌వుతున్నాయో కూడా తెలుసుకున్నారు. అయితే, ఈ సంద‌ర్భంలో బాల‌య్య మాట్లాడుతూ.. తెలుగు దేశం పార్టీ ఏర్పాటు చేయ‌డం గురించి చెప్పారు. వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఎన్టీఆర్‌.. పేరు నిల‌బెట్టేలా కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు శ్ర‌మించాల‌ని, ఒక‌రితో ఒక‌రు కొట్టుకోకుండా, వ‌ర్గ పోరాటానికి దారితీయ‌కుండా చూసుకోవాల‌ని సూచించారు. 

Image result for sr ntr

ఇక‌, ఈ స‌మ‌యంలోనే బాల‌య్య సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. `తెలుగువారికి టీడీపీ ఓ వ‌రం`- అని కామెంట్ చేశారు. టీడీపీ లేక‌పోతే.. తెలుగు ప్ర‌జ‌ల‌కు మ‌రిన్ని ఇబ్బందులు త‌ప్పేవికావ‌ని చెప్పారు. కేంద్రంలోని కాంగ్రెస్‌, బీజేపీలు తెలు గువారి శ్ర‌మ‌ను దోచుకుంటున్న స‌మ‌యంలో టీడీపీ ఆవిర్భ‌వించి అభ‌యం ఇచ్చింద‌ని, తెలుగు ప్ర‌జ‌ల అభ్యు న్న‌తే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్న పార్టీని తిరిగి గెలిపించుకోవాల్సిన బాధ్య‌త తెలుగు ప్ర‌జ‌ల‌పై ఉంద‌ని ఆయ‌న ఉద్ఘాటిం చారు. 

Image result for ysrcp

ఈ క్ర‌మంలోనే విప‌క్షం వైసీపీ నేత‌ల నుంచి కొన్ని చుర‌క‌త్తుల్లాంటి వ్యాఖ్య‌లు వెలుగు చూశాయి. తెలుగు ప్ర‌జ‌ల‌కు టీడీపీ వ‌రం అయితే.. ఆ టీడీపీ నాయ‌కులు చేస్తున్నఅవినీతి కూడా వ‌ర‌మేనా? అని వారు ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యేల్లో స‌గానికిపైగా మంది అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. మంత్రులు కూడా న‌లుగురు పూర్తిగా అవినీతి ఊబిలో కూరుకుపోయారు. ``నేను క‌న్నెర్ర చేస్తే.. మీ చ‌రిత్ర విప్పుతా``- అంటూ ఇటీవ‌ల చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లే దీనికి నిద‌ర్శ‌నం. కొంద‌రు కాల్‌మ‌నీ బాగోతాల్లో నిండా కూరుకుంటే.. మ‌రికొంద‌రు అసాంఘిక చ‌ర్య‌ల‌తో కాల‌క్షేపం చేస్తున్నారు. పేకాట‌కు ఏకంగా కేంద్రాల‌నే క‌ట్టించిన ఎంపీలు ఉన్నారు. 

Image result for tdp

భూక‌బ్జా రాయ‌ళ్ల‌కు తిరుగు లేకుండా పోయింది. చేతులు త‌డ‌పందే ఏ ప‌నీ కాని ప‌రిస్థితి సాక్షాత్తూ.. నిజాయితీ ప‌రులైన ఎమ్మెల్యేలే చెబుతున్నారు. మ‌రి ఇవ‌న్నీ కూడా టీడీపీ ప్ర‌స్తుత పాల‌న‌లోనే జ‌రుగుతున్నాయి. మ‌రి ఇవ‌న్నీ కూడా టీడీపీ వ‌రాలేన‌ని ప్ర‌జ‌లు భావించాలా? అన్న‌ది విప‌క్ష నేత‌ల మాట‌. మ‌రి దీనికి కూడా బాల‌య్య మార్కు.,. స‌మాధానం చెబితే బాగుంటుంద‌ని అంటున్నారు. మ‌రి ఏం సెల‌విస్తారో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: