ఈ మద్య భారత దేశంలతో మహిళలపై అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.  ఎక్కడ చూసినీ చిన్నారులపై, వృద్దులపై కూడా కామాంధులు రెచ్చిపోతున్నారు.  ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలో ఎక్కడో అక్కడ ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.  అయితే ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా ఈ కామాంధులు దుశ్చర్యలు మాత్రం అరికట్టలేక పోతున్నారు. 
Image result for sweet pan
తాజాగా ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగినిని పాన్ హౌస్ యజమాని పెండ్లి పేరుతో మోసం చేశాడు.  ఈ ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది.  ఉపేందర్ వర్మ అనే వ్యక్తి ఓ పాన్ షాప్ ని నడుపుతున్నారు. దానితో పాటు అతనికి వివిధ చోట్ల పాన్ హౌజ్ లు ఉన్నాయి. అయితే ఉపేందర్ ఫేస్ బుక్ రిక్వెస్టులు పంపిస్తూ, అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నాడు. ఉపేందర్ సదరు సాఫ్ట్ వేర్ ఉద్యోగినికి స్వీట్ పాన్ లో మత్తు పదార్థాలు ఇచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

  అంతే కాదు అత్యాచారం చేసి సమయంలో వీడియో తీసి అది యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తానని సదరు యువతిని బెదిరిస్తున్నాడు. దాంతో అతడి అరాచకంపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు నిందితుడు ఉపేంద్ర వర్మపై రేప్ కేసు తోపాటు పలు కేసులు నమోదుచేశారు. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: