“భారత ప్రధాని నరెంద్ర ప్రాణానికి ముప్పు ఉందని వస్తున్న రిపోర్టులు పూర్తిగా అబద్దమని చెప్పలేము” అని కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు సంజయ్‌ నిరుపమ్‌ పేర్కొన్నారు. అందుకే ఈ వార్తను పైకి కాదన్నా కాంగ్రెస్ నాయకుల  అంతరాంతరాల్లో వారి నేతల ప్రాణాలు తీసిన ఉగ్రవాదం గుర్తొచ్చే ఉంటుంది. రాజకీయాల కోసం వారు ప్రస్తుతానికి కాదంటున్నారని విశ్లేషకుల అభిప్రాయం.  ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని హ‌త్య చేసేందుకు మావోయిస్టులు ప‌న్నిన‌ కుట్రను పుణె పోలీసులు బయట పెట్టడం పెను సంచ‌ల‌న‌మైంది.
Image result for rona jacob wilson
భీమా కోరేగావ్ ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఐదుగురిని అరెస్టు చేసిన సంద‌ర్భంలో రోనా జాకబ్‌ విల్సన్‌ ఇంట్లో సోదాలు చేస్తుండ‌గా ఈ లేఖ దొరికి నట్టు చెబుతున్నారు. రాజీవ్ గాంధీని ఎల్‌.టి.టి.ఇ. హ‌త్య చేసిన త‌ర‌హాలోనే నరెంద్ర మోడీని అంతమొందించాలనే ప్ర‌ణాళిక ప్రస్థావన ఆ "లేఖ‌" లో ఉంద‌ని పోలీసులు అంటున్నారు. ఈ ప్లాన్ అమ‌లు చేయ‌డం కోసం M 4 రైఫిల్స్ కొన‌డానికి రూ. ₹8 కోట్లు అవ‌స‌రం అవుతాయ‌ని కూడా లేఖ‌లో పేర్కొన్నార‌ని పోలీసులు చెబుతున్నారు. ఇది ప్రధాని నరెంద్ర మోడీ కోసం చేస్తున్న కుట్ర‌ గానే నిఘావ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డు తున్నాయి. మ‌రో సంచ‌ల‌నం ఏంటంటే, ఈ లేఖ‌లో వ‌ర‌వ‌ర‌రావు పేరు ఉండ‌టం!  మొత్తానికి, ఇప్పుడీ లేఖ సంచ‌ల‌నం అవుతోంది.

Image result for rona jacob wilson

ఇది కేవ‌లం జిమ్మిక్కు మాత్ర‌మే అని కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ లేఖ‌పై స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌గాల‌ని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈ లేఖ‌ని ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు కూడా సీరియ‌స్ గానే తీసుకున్నాయి. జాక‌బ్ విల్స‌న్ ను మ‌రోసారి విచారించే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఈ లేఖ‌లో, మోడీ రోడ్ షోల‌ను ల‌క్ష్యంగా చేసు కుని దాడి చెయ్యాల‌నీ, దీని కోసం నాలుగు ల‌క్ష‌ల రౌండ్లు బుల్లెట్స్ అవసరం ఉంటాయని హైక‌మాండ్ కు లేఖ రాసిన‌ట్టు పోలీసులు అంటున్నారు. 


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్యకు కుట్రజరిపారన్న వార్తలు ఆదివాసీల కోసం పోరాటం చేస్తున్న వారిని టార్గెట్‌ చేయడానికేనని విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు వ్యాఖ్యానించారు. ప్రధాని నరెంద్ర మోడీ హత్యకు కుట్ర లేఖలో తన పేరు ఉండటంపై వరవరరావు స్పందిస్తూ, ప్రధాని హత్యకు మావోయిస్టు లు కుట్ర పన్నారని తాను అనుకోవడం లేదన్నారు. ప్రధానిని హత్యచేసే శక్తి మావోయిస్టులకు ఉందా? అనేది కూడా అనుమానమేనని అన్నారు.
Image result for plotting for assassination of narendra modi
ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్రాఫ్ తగ్గుతుందని, ఆయన ప్రతిష్ఠ ను పెంచే చర్యగా తాను ఈ కుట్రను భావిస్తున్నానని ఆయన అన్నారు. రోనా జాకబ్‌ విల్సన్‌ భీమ కోరేగావ్‌ ఘటనలో దొరకలేదని, ఢిల్లీ, పుణెలో దాడులు చేసి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారని వరవరరావు పేర్కొన్నారు. తనపై ఆరోపణలు వచ్చినంత మాత్రాన రోనా జాకబ్‌ విల్సన్‌తో సంబంధం లేదని చెప్పనని, ఇదంతా తనను టార్గెట్‌ చేయడమే అనిపిస్తుందన్నారు.
Image result for rona jacob wilson

వరవరరావు వ్యాఖ్యలు

ఇప్పటి వరకు ఈ కేసు గుఱించి అయితే, పోలీసులు ఎవరూ తనను సంప్రదించలేదని, తనను కూడా అరెస్టు చేస్తారని, అంతకు మించి ఏమీ జరగదని విప్లవ రచయితల సంఘం (విరసం) సభ్యులు వరవరరావు వ్యాఖ్యలు చేశారు. ప్రజా సంఘాలు, విప్లవ రచయితలను అణచివేసే కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. కాగా, ఈ ఏడాది జనవరిలో మహారాష్ట్రలోని భీమా కోరేగావ్‌ లో జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించి కేసులో సుధీర్‌ దావలే, సురేంద్ర గాట్లింగ్‌, సోమా సేన్‌, మహేష్‌ రౌత్‌, రోనా జాకబ్‌ విల్సన్‌ అనే ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే జాకబ్‌ విల్సన్‌ ను అరెస్ట్‌ చేసిన ఇంటినుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న లేఖ తాజాగా కలకలం రేపుతోంది. అరెస్ట్‌ అయిన విల్సన్ ‘ల్యాప్ టాప్’లో ప్రధాని హత్యకు కుట్ర పన్నారంటూ పూణె పోలీసులు ఓ లేఖను కోర్టుకు సమర్పించారు. మోదీని ఎలా హత్య చేయాలో మావోయిస్టులు లేఖల ద్వారా చర్చించుకోవడం లేఖలో స్పష్టంగా ఉన్నట్లు తెలిసింది.
Image result for varavara rao
మోదీని కూడా రాజీవ్ హత్య తరహా ప్రణాళిక రూపొందించాలని, ఇందుకు నాలుగు లక్షల రౌండ్ల బుల్లెట్లు, ఎనిమిది కోట్ల రూపాయలు అవసరం పడతాయని లేఖలో పేర్కొంటూ, ఈ కుట్రలో వరవరరావు సహకారంతో డబ్బు సర్దుబాటు చేయాలని ప్రస్తావించారు. దీంతో పూణే పోలీసులు వరవరరావును కూడా ప్రశ్నించే అవకాశం ఉంది.
ఈ ప్లాన్ అమ‌లు చేసేందుకు అవ‌స‌ర‌మైన సొమ్మును ఆయ‌నే స‌మ‌కూర్చుతార‌ని స‌ద‌రు లేఖ‌లో పేర్కొన్నారట. దీంతో నిందితుడు వ‌ర‌వ‌ర‌రావును కూడా పోలీసులు విచారించే అవ‌కాశం ఉంద‌ని అధికార వ‌ర్గాలు అంటున్నాయి. పుణె పోలీసులు హైద‌రాబాద్ వ‌స్తున్న‌ట్టు స‌మాచారం. అయితే, త‌న‌కూ ఈ లేఖ‌ల‌కూ ఎలాంటి సంబంధం లేద‌ని వ‌ర‌వ‌ర‌రావు అంటున్నారు. నిజానికి, హింసా విధానాలు మావోయిస్టులు ప్ర‌వృతి కాద‌ని ఆయ‌న అంటున్నారు. ఇలా హ‌త్య‌లు చేయ‌డం త‌మ సిద్ధాంతం కాద‌నీ, సామాజిక పోరాట‌మే తాము చేస్తామ‌ని ఆయ‌న అభిప్రాయ‌డ్డారు.

జాతీయ కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు భారీ కుట్ర జరిగిందని, గతేడాది నుంచే ఆయన హత్యకు మావోయిస్టులు ప్రణాళికలు రచిస్తున్నారని పుణే పోలీసులు చేసిన ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్యక్తం చేసింది. ప్రజాదరణ తగ్గుతోందన్న ఆందోళనలో భాగంగానే నరెంద్ర మోదీ ఈ హత్య నాటకానికి తెరలేరపారని దుయ్యబట్టింది. ఇలాంటి కట్టుకథలు అల్లి ప్రజలను మోసం చేయలేరని పేర్కొంది. నరెంద్ర మోదీకి ఇలాంటి డ్రామాలు కొత్తకాదని చెప్పింది. గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా పని చేసిన కాలంలో కూడా ఇలానే ఆయన రాజకీయవ్యూహాలు వేశారని ఆరోపించింది. 
Image result for sanjay nirupam congress leader
అయితే, ఆయన ప్రాణానికి ముప్పు ఉందని వస్తున్న రిపోర్టులు పూర్తిగా అబద్దమని చెప్పలేమని కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు సంజయ్‌ నిరుపమ్‌ పేర్కొన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిగితే తప్ప అసలు నిజమేంటో బయటకు తెలీదని వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: