మాజీ తిరుమల తిరుపతి ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఇటీవల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పటినుండో తరతరాల నుండి వారసత్వంగా వస్తున్న కలియుగ దైవం తిరుమల తిరుపతి వెంకన్న సన్నిధి ప్రధానార్చకుడు స్థానం చంద్రబాబు ప్రభుత్వం తొలగించడాన్ని తప్పుపట్టారు రమణ దీక్షితులు. అంతేకాకుండా తిరుపతిలో అక్రమంగా జరుగుతున్న కార్యక్రమాలపై అలాగే తవ్వకాలపై షాకింగ్ కామెంట్ చేశారు.

Image result for iyr krishna rao vs chandrababu

ఇటువంటి పరిస్థితులలో రమణదీక్షితులు రాష్ట్ర ప్రతిపక్ష నేత జగన్ ని ఇటీవల కలిశారు. ఈ సందర్భంగా రమణదీక్షితులు తనకు జరిగిన అన్యాయాన్ని జగన్ కి వివరించారు. అంతేకాకుండా తన వాదన వినిపించేందుకు చంద్రబాబు నాయుడు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని రమణ దీక్షితులు ఆరోపించారు. రమణ దీక్షితులుకు న్యాయం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు.

Image result for iyr krishna rao vs chandrababu

ఈ నేపథ్యంలో రమణ దీక్షితులు – జగన్ ల భేటీపై కొందరు విమర్శలు గుప్పించారు. ఆ విమర్శలపై ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ఘాటుగా స్పందించారు. జగన్ పై వస్తోన్న విమర్శలను తిప్పికొడుతూ ట్విట్టర్ లో ఘాటుగా బదులిచ్చారు. రమణదీక్షితులు గారు జగన్ గారిని బహిరంగంగా కలిశారని ఇందులో పెద్ద రహస్యమేమీ లేదని ఐవైఆర్ అన్నారు.

Image result for iyr krishna rao vs chandrababu

తనకు జరిగిన అన్యాయం గురించి ఆయన వివరించారని అందులో తప్పేమీ లేదని అన్నారు. ఆ భేటీపై కొందరు అవాకులుచవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. కావాలని చంద్రబాబు ప్రభుత్వం బ్రాహ్మణులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు కృష్ణారావు...ఇది ఏమాత్రం చంద్రబాబుకు గానీ తెలుగుదేశం పార్టీకి గానీ మంచిది కాని విషయమని పేర్కొన్నారు. అంతేకాకుండా చంద్రబాబు దీనివల్ల భవిష్యత్తులో చాలా మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని పేర్కొన్నారు ఐవీఆర్ కృష్ణారావు.



మరింత సమాచారం తెలుసుకోండి: