చంద్రబాబు చేస్తున్న దీక్షలపై చాలామంది విమర్శిస్తున్నారు. నాలుగు సంవత్సరాలు బిజెపి పార్టీ తో కలిసి రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబు ప్రస్తుతం రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీపై వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో చంద్రబాబు తెలివిగా బీజేపీ పై ఉన్న వ్యతిరేకతను తనవైపు మలుచుకునేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు చేస్తున్న దీక్ష పై విపక్ష పార్టీ వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు...ప్రజల సొమ్మును ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసి దీక్షలు చేసి ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారో తెలపాలని పేర్కొన్నారు.

Related image

ఇదే క్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా చంద్రబాబు చేస్తున్న దీక్ష ల పై మండిపడ్డారు...ఇదిలావుండగా తాజాగా  మాజీ కేంద్ర మంత్రి బీజేపీ లీడ‌ర్ ప్రముఖ న‌టుడు కృష్ణంరాజు కూడా త‌న స్పంద‌న తెలియ‌చేశారు..రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేప‌ట్టిన దీక్ష వ‌ల్ల పైసా ఉప‌యోగం లేద‌ని, ఏపీకి దీనివ‌ల్ల క‌లిసి వ‌చ్చేది ఏమీ లేదు అని అంటున్నారు…

Image result for chandrababu

రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన దీక్షను కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు తప్పుబట్టారు..మోదీ దీక్షను విమర్శించిన బాబు, ఈ రోజు ఎందుకు దీక్ష చేస్తున్నారు అని విమ‌ర్శించారు. రాష్ట్రానికి బిజెపి అన్యాయం చేసింది అన్న వార్తలలో నిజం లేదని అన్యాయంగా విభజనకు గురైన ఆంధ్రరాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలని బీజేపీకి ముద్దు నుండి ఉంది అని అన్నారు.

Related image

అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి పేట మీద కూర్చుంటారని కుండబద్దలు కొట్టినట్లు అన్నారు కృష్ణంరాజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిజమైన నాయకుడు జగన్ అంటూ వైసీపీ అధినేత జగన్ పై పొగడ్తల వర్షం కురిపించారు కృష్ణంరాజు.



మరింత సమాచారం తెలుసుకోండి: