పవన్ కళ్యాణ్ ఒక పక్క చంద్ర బాబుకు మద్దతు ఇచ్చి మోసపోయానని, అందుకే ఇప్పుడు భాద పడుతున్నాని ప్రజల దగ్గర చెబుతున్నాడు. మరీ నాలుగేళ్లు కలిసి ఉన్నప్పుడు తెలియదా... తీరా ఎన్నికలు దగ్గర పడేసరికి స్వరం మార్చి, మాట మార్చి ప్రజల దగ్గరికి వస్తున్నారు. అంటే ప్రజలు అంత అమాయకులా... లేకుంటే వీరు పెద్ద మేధావుల్లాగా ఫీల్ అవుతున్నారా..! ఇక చంద్ర బాబేమో నన్ను మించిన మేధావి లేదంటాడు..!

Image result for pavan and chandra babu

దేశంలో అత్యంత సీనియర్ రాజకీయ నేతను తనే అని చెప్పుకుంటాడు. తనకు మించినోడు ఈ దేశంలోనే లేడని అంటాడు. ఇలా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో చంద్రబాబు నాయుడుకు మించినోడు లేడు. అలాంటి చంద్రబాబు నాయుడు.. తను మోసపోయానని చెప్పుకోవడం ప్రహసనం. అది కూడా నాలుగేళ్ల తర్వాత ఇలా ప్రజల ముందుకు వచ్చి మోసపోయాను అని సానుభూతి ఆశిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇంతకీ బీజేపీ ఏ విషయంలో మోసం చేసిందో చంద్రబాబు నాయుడు చెప్పడం లేదు.

Image result for pavan and chandra babu

ఒకసారి మోసపోయాను కాబట్టి.. మరోసారి తనకు ఛాన్స్ ఇవ్వాలని చంద్రబాబు అడుగుతున్నాడు. అసలైన మోసం అంటే ఇది. ఇక చంద్రబాబును నమ్మి మోసపోయా అని పవన్ వాపోతున్నాడు. పవన్ కు కూడా ఈ విషయం చాలా లేటుగా అర్థమైంది. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పవన్ కల్యాణ్ చంద్రబాబును తీవ్రంగా విమర్శించాడు. మరి గత ఎన్నికల ముందు బాబును నమ్మేటప్పుడు పవన్ కు తెలియదా.. ఈయన మోసం చేస్తాడని...! 


మరింత సమాచారం తెలుసుకోండి: