భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అంటే ప్రపంచ వ్యాప్తంగా గుర్తించిన నేత అని అంటారు.  ఎక్కడికి వెళ్లినా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది..ఏదేశానికి వెళ్లినా ఆయా సాంప్రదాయల  ప్రకారం నడుచుకుంటూ అందరినీ ఆకర్షిస్తారు ప్రధాని నరేంద్ర మోదీ.  అంతే కాదు ప్రపంచంలో  అత్యంత శక్తివంతమైన నేతల జాబితాలో కూడా ఆయన ఉంటారు. సామాన్య స్థాయి నుంచి భారత ప్రధానిగా ఎదిగిన నరేంద్ర మోదీ అంటే ఎంతో ప్రత్యేక ఉంది ప్రపంచ దేశాల్లో.

అలాంటి నరేంద్ర మోదీ అంటే ఎవరో తెలియదట ఆదేశంలో..అవును మీరు వింటుంది నిజమే..75 శాతం మందికి మన భారత ప్రధాని మోదీ అంటే ఎవరో తెలియదట. మెజారిటీ భారతీయులకు ఈ వార్త మింగుడుపడన్పటికీ ఇది వాస్తవం. కెనడాకు చెందిన యాంగస్ రీడ్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన ఓ సర్వలో ఇది తేలింది. ప్రపంచం వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన టైమ్ మేగజీన్ నిర్వహించిన 2016 ఆన్ లైన్ రీడర్స్ పోల్ లో టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా మోదీ ఎంపికయ్యారు.

ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకెర్ బర్గ్ లాంటి వారిని కూడా ఆయన వెనక్కు నెట్టేశారు. ఒక శక్తివంతమైన నేతగా, వ్యూహకర్తగా, ప్రజలను ప్రభావితం చేయగలిగిన వ్యక్తిగా రెస్పాండెంట్లు ఆయనను పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ వారం క్యూబెక్ లో జీ7 దేశాల సమావేశం జరగనుంది.

ఈ సమావేశానికి ముందు ఈ సర్వేను నిర్వహించారు. జీ7 గ్రూపులో అమెరికా, కెనడా, జర్మనీ, ఇటలీ, జపాన్, ఫ్రాన్స్, యూకేలు ఉన్నాయి. ఈ సర్వేలో మోదీతో పాటు జపాన్ ప్రధాని షింజో అబే కూడా నిలిచారు. 64శాతం మంది కెనెడియన్లకు జపాన్ ప్రధాని ఎవరో తెలియదట. బ్రెజిల్ అధ్యక్షుడు మిచెల్ టెమెర్ 90 శాతం మందికి తెలియదని సర్వేలు తెల్చాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: