Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Sep 23, 2018 | Last Updated 12:55 am IST

Menu &Sections

Search

గోదావరి జిల్లాలో చంద్ర‌బాబుకు త్వ‌ర‌లో పెద్ద షాక్

గోదావరి జిల్లాలో చంద్ర‌బాబుకు త్వ‌ర‌లో పెద్ద షాక్
గోదావరి జిల్లాలో చంద్ర‌బాబుకు త్వ‌ర‌లో పెద్ద షాక్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
గోదావరి జిల్లాలో త్వ‌ర‌లో చంద్ర‌బాబునాయుడుకు ఊహించ‌ని షాక్ త‌గ‌ల‌నుందా బిసి సామాజిక వ‌ర్గానికి చెందిన ఓ మంత్రి సైకిల్ దిగేసి ఫ్యాన్ క్రింద సేద‌తీరాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.  నాలుగేళ్ళ‌పాటు సైకిల్ తొక్కి తొక్కి అల‌సిపోయార‌ట‌. అందుక‌నే చ‌ల్ల‌టి గాలి కోసం ఫ్యాన్ కావాల‌ని అనుకుంటున్న‌ట్లు స‌మాచారం. అదే విష‌యంపై మంత్రి మ‌ద్ద‌తుదారుల‌కు జ‌గ‌న్ స‌న్నిహుత‌ల‌కు మ‌ధ్య జ‌రిగిన చ‌ర్చ‌లు ఫ‌ల‌ప్ర‌ద‌మైన‌ట్లు స‌మాచారం. కాబ‌ట్టి త్వ‌ర‌లోనే స‌ద‌రు మంత్రి వైసిపిలో చేర‌టం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. 

వైసిపిలో చేర‌నున్న పితాని

chandra-babu-tdp-ysrcp-ysr-congress-party-election

ఇంత‌కీ విష‌యం ఏమిటంటే ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని ఆచంట నియోజ‌క‌వ‌ర్గం ఎంఎల్ఏమంత్రి పితాని స‌త్య‌నారాయ‌ణ త్వ‌ర‌లో టిడిపికి రాజీనామా చేయ‌నున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెప్పాయి. టిడిపిలో మంత్రి పరిస్ధితి బాగానే ఉన్న‌ప్ప‌టికీ భ‌విష్య‌త్తుపై బెంగ మొద‌లైంద‌ట‌. రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌భుత్వంపై జ‌నాల్లో వ్య‌తిరేక‌త పెరుగుతోంద‌న్న ప్ర‌చారం అంద‌రికీ తెలిసిందే. అయితే ఆ ప్ర‌చారం జిల్లాలో మరింత ఎక్కువ‌గా ఉంద‌ట‌. 

ఇటు కాపులు వ్య‌తిరేకం..అటు బిసిలూ వ్య‌తిరేక‌మే

chandra-babu-tdp-ysrcp-ysr-congress-party-election

పోయిన ఎన్నిక‌ల్లో ఈ జిల్లాలోని  నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక్క‌టంటే ఒక్క నియోజ‌క‌వ‌ర్గంలో కూడా వైసిపి గెల‌వ‌లేదు. కార‌ణాలేవైనా కానీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ ప‌రిస్ధితి తిర‌గ‌బ‌డినా ఆశ్చ‌ర్యం లేద‌నే ప్ర‌చారం జిల్లాలో బాగా ఎక్కువ‌గా జ‌రుగుతోంది. ఎందుకంటే పోయిన ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క‌టీ సంపూర్ణంగా అమ‌లు చేయ‌క‌పోవ‌ట‌మే. ప్ర‌ధానంగా కాపుల‌ను బిసిల్లో చేరుస్తాన‌న్న హామీ అమ‌ల్లోకి రాలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తాన‌ని లేక‌పోతే నిరుద్యోగ  భృతి ఇస్తాన‌న్న‌ హామీ గాలికిపోయింది. ఇక  రైతు రుణ‌మాఫీ సంగ‌తి చెప్ప‌నే అక్క‌ర్లేదు. అలాగే డ్వ‌క్రా సంఘాల రుణాలు కూడా మాఫీ కాలేదు. విచిత్ర‌మేమిటంటే కాపుల‌ను బిసిల్లో చేర్చాల‌న్న చంద్ర‌బాబు హామీ అమ‌లు కాక‌పోవ‌టంతో కాపులు మండిపోతున్నారు. అదే విధంగా కాపుల‌ను బిసిల్లో చేర్చాల‌న్న చంద్ర‌బాబు నిర్ణ‌యాన్ని బిసిలు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు.


ముద్ర‌గ‌డ కార‌ణంగా ఎక్కువైన వ్య‌తిరేక‌త

chandra-babu-tdp-ysrcp-ysr-congress-party-election

అమ‌లుకాని హామీల్లో కాపుల‌ను బిసిల్లో చేరుస్తాన‌న్న హామీ ప్ర‌ధానమైన‌ది. అంత‌టి  హామీ అమలుకు నోచుకోక‌పోవ‌టంతో జిల్లాలోని జ‌నాల్లో చంద్ర‌బాబుపై వ్య‌తిరేక‌త పెరిగిపోయింది. ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో కాపు సామాజిక వ‌ర్గం జ‌నాభా చాలా ఎక్కువ‌. పైగా రెండు జిల్లాల్లోనూ ముద్ర‌గ‌డ ప్ర‌భావం బాగానే ఉంటుంది. అటువంటి ముద్ర‌గ‌డ‌పై ప్ర‌భుత్వం  అనేక కేసులు పెట్టింది. తునిలో రైలు ద‌హ‌నం ఘ‌ట‌న‌లో కాపు నేత‌ల్లో ప‌లువురిపై ప్ర‌భుత్వం కేసులు పెట్టి ఇబ్బంది పెడుతోంది. 

న‌ర‌సాపురం ఎంపిగా పోటీ చేస్తారా 
ఇవ‌న్నీ దృష్టిలో పెట్టుకునే పితాని మ‌ద్ద‌తుదారుల్లో అత్య‌ధికులు మంత్రిని టిడిపికి రాజీనామ చేసి వైసిపిలో చేర‌మ‌ని ఒత్తిడి పెడుతున్నార‌ట‌. ఒక‌వేళ మంత్రి గానీ వైసిపిలో చేరితో న‌ర‌సాపురం ఎంపిగా పోటీ చేస్తార‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎందుకంటే పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని మంత్రి సామాజిక‌వ‌ర్గ‌మైన  బిసిల జ‌నాభా దాదాపు  శాతం ఉంద‌ట‌. అదే విధంగా ఎస్సీల జ‌నాభా కూడా  శాత‌మ‌ట‌. కాబ‌ట్టి వైసిపి త‌ర‌పున పోటీ చేస్తే అటు కాపులతో పాటు ఇటు బిసి ఎస్సీ వైసిపి మ‌ద్ద‌తుదారుల ఓట్ల‌తో గెల‌వ‌టం సుల‌భ‌మ‌న్న అంచ‌నా ఉంది. ఇదే అంచ‌నాతో వైసిపి అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా పితాని విష‌యంలో సానుకూలంగా ఉన్న‌ట్లు స‌మాచారం. జిల్లాలో జ‌గ‌న్  పాద‌యాత్ర‌ విష‌యంలో జ‌న స్పంద‌న చూసిన త‌ర్వాత పితానిలో వైసిపిలో చేర‌టం ఖాయ‌మ‌ని వైసిపి వ‌ర్గాలు చెబుతున్నాయి.


chandra-babu-tdp-ysrcp-ysr-congress-party-election
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చంద్ర‌బాబు : ఐక్య‌రాజ్య‌స‌మితి స‌మావేశం ఓ బూట‌క‌మేనా ?
చేతులెత్తేసిన హోం మంత్రి
నెల్లూరు జిల్లాలో వైసిపికి షాక్
జేసీ సోద‌రుల‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు
ఎడిటోరియ‌ల్ : జ‌గ‌న్ ను  బ్లాక్ మెయిల్ చేస్తున్నారా ?
షోకాజ్ నోటీసు ఇచ్చే స్ధాయి కాంగ్రెస్ లో ఎవ‌రికుంది ?
చింత‌మ‌నేనిపై అట్రాసిటీ కేసు
చ‌ద‌ల‌వాడ జంప్...చంద్ర‌బాబుకు షాక్
వెంక‌టగిరి నియోజ‌క‌వ‌ర్గం ఆనంకేనా ?
చంద్ర‌బాబుకు ధర్మాబాద్ కోర్టు షాక్
ఎడిటోరియ‌ల్ : చంద్ర‌బాబు-మోడి మ‌ధ్య లోపాయికారీ ఒప్పంద‌ముందా ?
ఎడిటోరియ‌ల్ : ఊస‌ర‌వెల్లి కూడా సిగ్గుప‌డాల్సిందే
రేవంత్ రెడ్డికి ప్ర‌మోష‌న్...అడిగిందొక‌టి..ఇచ్చిందొక‌టి
జ‌గ‌న్ @ 3000 కిలోమీట‌ర్లు
ఎడిటోరియ‌ల్ :  టిడిపి ఓటు బ్యాంకులో చీలిక‌లు..ప్ర‌త్యామ్నాయ‌మేంటి ?
కాంగ్రెస్ లో కెసియార్ కోవ‌ర్టులా ?
చంద్ర‌బాబుకే షాకిచ్చిన ఎంఎల్ఏలు
ఎడిటోరియ‌ల్ :  జ‌గ‌న్ ది అదిరిపోయే స్ట్రాట‌జీ..వ‌ర్క‌వుట‌వుతుందా ?
 ఎడిటోరియ‌ల్ : గోదావ‌రి పుష్క‌రాల ప్ర‌మాదంలో చంద్ర‌బాబు త‌ప్పేలేద‌ట‌...నివేదిక‌లో సంచ‌ల‌న విష‌యాలు
తోక‌ముడిచిన చంద్ర‌బాబు
దేవినేని క‌నుస‌న్న‌ల్లోనే ఇసుక అక్ర‌మ ర‌వాణా ?
అమ‌రావ‌తిలో ఫుల్లుగా దోచేశారు...క‌డిగేసిన కాగ్
ఎడిటోరియ‌ల్ :  ఇండియా టుడే స‌ర్వేతో జ‌గ‌న్ కు వార్నింగ్ బెల్సేనా ?
సెంట్ర‌ల్ టిక్కెట్టు రాధాకు లేన‌ట్లే
టిడిపి ఎంఎల్ఏకి చిక్కులు
20 వేల పోస్టుల భ‌ర్తీ..ఎందుకో తెలుసా ?
ఉద్యోగ జేఏసి ఆందోళ‌న‌...అమ‌రావ‌తిలో ఉద్రిక్త‌త
వైజాగ్ లోక్ స‌భ‌కు నేదురుమ‌ల్లి ?
ఎడిటోరియ‌ల్ : గుంటూరు స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ను ఎందుకు మార్చేశారు ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.