ఈ మద్య మనీ ట్రాన్స్ జెక్షన్ చాలా సులభతరం అయ్యింది. సామాన్యులు సైతం తమ డబ్బులు బ్యాంకులో వేసుకొని అత్యవసర పరిస్థితుల్లో ఏటీఎం ను వాడుతున్నారు. పెద్ద నోట్లు రద్దయినప్పటి నుంచి ఏటీఎం లో డబ్బు కొరత బాగా ఉంటుందని..కొన్ని రోజుల వరకు ఏటీఎంలు పనిచేయనే లేదు.  అయితే ఈ మద్య ఆ పరిస్థితి కాస్త మెరుగు పడటంతో ఏటీఎంలలో డబ్బు ఉంచుతున్నారు బ్యాంకు అధికారు.

తాజాగా ఏటీఎం లో తనకు డబ్బు రాకపోవడంతో..విసుగుపుట్టి.. చిర్రెత్తుకొచ్చి ఓ వ్యక్తి ఏటీఎం ని ధ్వంసం చేసిన సంఘటన హైదరాబాద్ లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం..నల్లగండ్ల సమీపంలో పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన ఓ ఏటీఎం ఉంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి గురువారం రాత్రి డబ్బులు డ్రా చేయడానికి ఏటీఎంకు వచ్చాడు. 

ఏటీఎంలో డబ్బు లేకపోవడంతో, క్యాష్ రాలేదు. దీంతో, సదరు వ్యక్తి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. రాయితో ఏటీఎం స్క్రీన్ బద్ధలు కొట్టి వెళ్లిపోయాడు. ఏటీఎంను ధ్వంసం చేసిన వ్యక్తిని గుర్తించేందుకు సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే, ఆ వ్యక్తి హెల్మెట్ పెట్టుకుని ఉండటంతో, అతన్ని గుర్తించడం కష్టమవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: