“ఇది చాలు తాను చేస్తే సంసారం పరులు చేస్తే అదేదో” అనే సామెతకు ఉదాహరణగా తెలుగుదేశం ప్రబుత్వ పాలనా కాలంలో అనేకమంది పసివాళ్ళు అత్యాచారాలకు గురయ్యారు. అవుతున్నారు కూడా! మరి అది  తెలుగుదేశం పార్టీ వైఫల్యం కాదా! అది కానప్పుడు ఇప్పుడు టిడిపి మంత్రిణి అఖిలప్రియ “మోదీ హయాంలో దేశంలో మహిళలపై అరాచకాలు పెరిగిపోయాయి” అనటం తను చూపుడు వేలుతో వేరే వాళ్ళను అదే మోదీ ప్రభుత్వాన్ని చూపిస్తుంటే - మిగిలిన నాలుగు వేళ్ళు తనవైపే తననే తన ప్రభుత్వాన్నే చూపిస్తున్నాయని గ్రహించాలి అఖిలప్రియ. ఆసలు ఇలాంటి విషయాలకు కారణం సామాజిక వైపరీత్యం, దానికి చికిత్స చేయటం వదిలేసి వాళ్ళు కారణం వీళ్ళు కారణం అనటం ఏమంత న్యాయం? రాష్ట్రం మీ సామంత రాజ్యం కాదని గమనించాలంటున్నారు జనం.  
Image result for chandrababu akhila
కాని ఆమెకు ఎన్డీయే సర్కారులో మహిళలు బయటకు రావాలంటే భయపడే పరిస్దితి వచ్చిదన్నది మాత్రమే గమనించింది. బిజెపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్న పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపు నిచ్చింది. మరి నిన్నటి వరకు మీరు బిజెపికి మద్దతిచ్చారుగా? మీరూ మీ మూడ్ చేంజ్ చేసుకుంటే ప్రజలు చెవుల్లో సన్-ఫ్లవర్లు పెట్టుకోలేదుగా-మీ మూడ్ చుట్టూ తలలు త్రిప్పటానికి. 


2014లో చంద్రబాబును గెలిపించిన దరిమిలా ఆరు కోట్ల ఏపి ప్రజల్ల చెవుల్లో సన్-ఫ్లవర్లు పెట్టారుగా! మళ్ళా 2019 లో నారా చంద్రబాబు నాయుడును గెలిపించాల్సిన ఆవశ్యకత ప్రజలకేముంది ఆమె కోరిక ప్రకారం? ఇంకోసారి తాము చంద్రబాబు నాయకత్వానికి ఓటెసే మాటే లేదంటున్నారు జనం. 


కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో చేపట్టిన నవ నిర్మాణ దీక్షలో పాల్గొన్న మంత్రి అఖిలప్రియ మోదీపై తీవ్ర ఆరోపణలు చేశారు. నవనిర్మాణ దీక్ష అంటే మోడీని తిట్టటమా? అయితే దానికి ₹13 కోట్ల ప్రజాధనం ఖర్చుపెట్టవలసిన అవసరమేముంది? మీ ఇంట్లో డబ్బుతెచ్చి ఖర్చుపెట్టుకోండి. అంతేకాదు ఆఫ్ట్రాల్ ఒక పిల్లకాకి ప్రధానిని తిట్టటమా? అంటున్నారు ప్రజలు, ప్రతిపక్షాలు ముక్తకంఠంతో. ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 


మహిళలు బయటకు రావడానికి ఇబ్బంది పడే పరిస్థితులు బీజేపీ క్రియేట్ చేసిందని ఆమె మండిపడ్డారు.  ఒకవైపు ఏపీ సీఎం చంద్రబాబు మహిళల సంరక్షణ కోసం అన్ని చర్యలు చేపడుతుంటే - ప్రధాని మోదీ మాత్రం మహిళలపై దాడులు చేయండి అని ప్రోత్సహిస్తున్నారని ఆమె ఆరోపించారు. అత్యాచారాలు చేయాల్సిందిగా మోదీనే రెచ్చగొడుతున్నారని ఆమె పేర్కొన్నారు. "యథా రాజా తథా ప్రజా! యథా అధినేత తథా ప్రతినిధి!" బీజేపీకి బుద్ధి చెప్పేముందు, టిడిపి బుద్ధి తెచ్చుకుంటే తప్ప పరిస్థితి సానుకూలం కాదు. ఆమె అభిప్రాయం తప్పని చెపుతున్నారు రాష్ట్రం మేలుకోరే వాళ్ళు.


కాగా మోదీపై అఖిలప్రియ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే బీజేపీ నేతలు ఈ వ్యాఖ్యలపై మండి పడుతున్నట్లు సమాచారం. ఆమెపై చట్టపరం గా చర్య తీసుకోవాలని రాష్ట్ర ప్రథమ పౌరుణ్ణి కోరారు.  
Image result for chandrababu akhila
గత కొంతకాలం నుంచి బీజేపీకి దూరంగా ఉంటున్నట్లు వ్యవహరిస్తున్న బాబు, కాంగ్రెస్‌తో దోస్తీకోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. గత నాలుగేళ్ల లో ఏపీలో ఎంతో మంది మైనర్లు అత్యాచారాలకు గురవుతున్నా టీడీపీ సర్కార్‌ మాత్రం చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి దీనికి భూమా అఖిలప్రియ ఏం సమాధానం చెపుతుందో? 

Image result for BJP Kanna Lakshminarayana & ap Governor

ఏపీ మంత్రి భూమా అఖిలప్రియను తక్షణమే బర్తరఫ్‌ చేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గవర్నర్‌ నరసింహన్‌ను కోరారు. ఏపీ బీజేపీ నేతలతో వెళ్లి గవర్నర్‌ను గురువారం కలుసుకున్న ఆయన, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, దుర్మార్గాలపై ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ఖర్చుతో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొని ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించడం దారుణమన్నారు. తన అసమర్థతను కప్పిపుచ్చుకోలేక ఎన్డీఏ నుంచి చంద్రబాబు వైదొలిగారని ఆయన అభిప్రాయపడ్డారు



అమ్మా! ఆఖిల ప్రియా మీరు ఈ క్రింది సర్వే విషయాలు చూడండి. 2019లో మీ తెలుగుదేశం ప్రభుత్వం జాతకం మొత్తం తెలుస్తుంది. వాళ్ళదే ఇంకో సర్వే 72శాతం మంది ప్రధానిగా మాత్రం మోదీపైనే విశ్వాసం ప్రకటించారు. జాతీయ స్థాయిలో పేరెన్నిక గల మీడియా సంస్థ చేసిన అధ్యయనంలో చంద్రబాబుకు షాకింగ్ ఫలితాలు వచ్చాయి.

Image result for survey on chandrababu government by Times of India

*ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మీరు ఎవరికి ఓటేస్తారు? అని ఆ సంస్థ అడిగిన ప్రశ్నకు 42శాతం మంది జగన్ అని సమాధానం ఇచ్చారు. చంద్రబాబుకు ఓటేస్తా మన్నది 30 శాతం మందే. పవన్ కల్యాణ్ వాటా 19గా ఉంది.

*చంద్రబాబు అనుభవం ఏపీ డెవలప్‌మెంట్‌కు ఉపయోగిపడిందా? అనే ప్రశ్నకు 59 శాతం మంది నో అని చెప్పారు. బాబు పాలన పట్ల ప్రజల భావన ఎలా ఉందో చెప్పడానికి ఈ శాతాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు. 
Image result for survey on chandrababu government by Times of India
*ప్రభుత్వ వ్యవహారాల్లో లోకేష్ జోక్యం పెరుగుతోందా? అనే ప్రశ్నకు 67 శాతం ఔను అన్నారు. ప్రత్యేక హోదా సాధనలో బాబు ఫెయిలయ్యాడా? అంటే, 76 శాతం మంది ఏకగ్రీవంగా ఔను అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు మాట మార్చటం తో ఆయనను ప్రజలు విశ్వసించడం లేదనేందుకు ఇంతకన్నా ఏం ఋజువు కావాలి?

*ఎమ్మెల్యేలు ఫిరాయిపులకు పాల్పడి అధికారపక్షంలో చేరితే వారికి మంత్రి పదవులు ఇవ్వటం సరికాదని 80 శాతం మంది చెప్పటం గమనార్హం 


*చంద్రబాబు పాలనలో అవినీతి పెరిగిందా? అనే ప్రశ్నకు 60 శాతం మంది ఔనన్నారు. బాబు పాలన ఏమాత్రం బాగోలేదని 57 శాతం మంది తేల్చి చెప్పారు.

Image result for survey on chandrababu government by Times of India

మరింత సమాచారం తెలుసుకోండి: