ఈ మద్య బీజేపీ నేతలు పదవిలో ఉన్నాం..మేం ఏం చేసినా..ఏం మాట్లాడినా చెల్లుతుందన్న గర్వంలో ఉన్నారని రుజువు చేసే సంఘటనలు జరిగాయి.  ఇప్పటికే యూపీకి చెందిన బీజేపీ నేత సురేంద్ర సింగ్ ప్రభుత్వ అధికారులపై ఘోరమైన మాటలు మాట్లాడి వార్తల్లోకి ఎక్కారు.  ప్రభుత్వ అధికారుల కంటే వేశ్యలేనయమని.. వారు డబ్బులు తీసుకొని పని చేస్తారన్నారు. స్టేజీలపై డ్యాన్స్ లు చేస్తూ ప్రజల్ని సంతోషపరుస్తారని.. కానీ ప్రభుత్వ అధికారులు మాత్రం అలా చేయరన్నారు. 

లంచం అడిగిన అధికారుల్ని అక్కడే చెప్పులతో కొట్టాలన్నారు. దాంతో ప్రభుత్వ అధికారులు అగ్గిలం మీద గుగ్గిలం అయ్యారు. తాజాగా మధ్యప్రదేశ్ లో బీజేపీ ఎమ్మెల్యే చంపాలాల్ దేవ్డా ఓ కానిస్టేబుల్ పై దాడి చేయడం సీసీ కెమెరాల్లో రికార్డయింది. కానిస్టేబుల్ ను దుర్భాషలాడుతూ, రెండు చెంపలూ వాయించిన సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన నిన్న రాత్రి జరిగింది.  దేవాస్ జిల్లాలోని ఉదయ్ నగర్ పోలీస్ స్టేషన్ కు ఎమ్మెల్యే మేనల్లుడు తొలుత వచ్చాడు.

పోలీస్ స్టేషన్ లోని నిషేధిత ప్రాంతంలోకి వెళ్లాడు. లాకప్ లో ఉన్న ఓ ఖైదీ నుంచి వాటర్ బాటిల్ తీసుకున్నాడు. దాన్ని కానిస్టేబుల్ సంతోష్ ఎమ్మెల్యే మేనల్లుడిని అడ్డుకున్నాడు.  పోలీస్ స్టేషన్ లోపలకు ఎందుకు వచ్చావంటూ ప్రశ్నించాడు. వెంటనే అక్కడ జరిగిన విషయం గురించి ఎమ్మెల్యేకు మేనల్లుడు సమాచారం అందించాడు.

ఆ తర్వాత సీసీ కెమెరా ఫుటేజీలో ఎమ్మెల్యే ఎంటరయ్యాడు. కానిస్టేబుల్ ను బూతులు తిడుతూ, రెండు చెంపలూ వాయించాడు. ఈ ఘటన అర్ధరాత్రి 12 గంటల తర్వాత జరిగిందని చెప్పారు. సెక్షన్ 353 (ప్రభుత్వ ఉద్యోగిని విధులు నిర్వహించకుండా అడ్డుకోవడం), సెక్షన్ 332 (ప్రభుత్వ ఉద్యోగిపై చేయి చేసుకోవడం) కింద కేసు నమోదయింది.



మరింత సమాచారం తెలుసుకోండి: