కడపజిల్లాలో వైఎస్ కుటుంబానికి తిరుగులేదన్న విషయం అందిరికి తెలిసిందే. అయితే ఇక్కడ బలమైన క్యాడర్ ను ఎన్నుకోవడంలో టీడీపీ అధినేత చంద్రబాబు సఫలుడయ్యాడని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం జిల్లాలో టీడీపీ ప‌రిస్థితి మాత్రం రోజురోజుకు దిగజారిపోతోంది. తెలుగు త‌మ్ముళ్లు నిత్యం గొడ‌వ‌లు ప‌డుతూనే ఉన్నారు. ఆధిప‌త్య ధోర‌ణితో పార్టీని దిగ‌జారుస్తున్నారు.


ఇవే కాకుండా జిల్లాకు సంబంధించి చాలా మంది నేతల పరస్పర వ్యక్తిగత విభేదాలు బాబు దృష్టికి రావడంతో, మొన్న కడప పర్యటనకు వచ్చిన ఆయన నేతలకు క్లాస్ పీకాడని సమాచారం. బద్వేల్‌లో ఎమ్మెల్యే జయరాములు, టీడీపీ నేత విజయజ్యోతి మధ్య వర్గపోరు, జమ్మలమడుగులో గ్రూపు విభేదాలను ఎందుకు పరిష్కరించలేకపోయారంటూ టీడీపీ ఇన్‌చార్జి మంత్రి సోమిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి లకు బాగా క్లాస్ పీకారంట.


ఆయన పర్యటించి, క్లాసు పీకి సరిగ్గా రెండువారాలు కూడా కాలేదు మళ్ళీ జిల్లాలో టీడీపీ నేతల మధ్య వివాదాలు భగ్గుమన్నాయి. ఎంపీ సీఎం రమేష్‌పై ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌ఛార్జ్‌ వరదరాజులురెడ్డి మళ్లీ విమర్శల దాడి చేసారు. సీఎం రమేష్‌ స్థాయి గ్రామ పంచాయతీకి ఎక్కువ, మండలానికి తక్కువ అని ఆరోపించారు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచే సత్తాలేకే జిల్లాలో గ్రూప్‌ రాజకీయాలు ప్రోత్సహిస్తూ పార్టీని సర్వనాశనం చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. కాగా ఈ విషయం బాబు దృష్టికి వెళ్ళలేదు. మళ్లీ ఆయనతో ఏం చీవాట్లు పడాలో అని జిల్లా నాయకులు బెదిరిపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: