టీటీడీలో 65 సంవత్సరాలకు పైబడిన వయస్సున్న అర్చక స్వాములకు నిర్బంధ పదవీ విరమణ విధించింది రాష్ట్ర ప్రభుత్వం. 65 సంవత్సరాలకు పైబడ్డ అర్చకులందరూ తప్పనిసరిగా పదవీ విరమణ చేసి తీరాల్సిందేనని తీర్మానించింది. అయితే ఈ దెబ్బకు ముందు బలయింది ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు. తనపై కక్షగట్టి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. తిరుమల కట్టడాలను, స్వామివారి అభరణాలను, శాస్త్ర సంప్రదాయాలను సంరక్షించుకోవలసిన అవసరాన్ని సూచిస్తూ మీడియా ముందుకు వస్తే మాపై కక్షతో రిటైర్మెంట్ ప్రకటించారని ఆగ్రహించారు.

వారి చర్యకు నిరసనగా బాబు ప్రభుత్వంపై యుద్ధమే చేస్తున్నాడు రమణ దీక్షితులు. పదవీ విరమణ చేసిన వారికే కాకుండా, ఇప్పుడు అర్చకులుగా చేస్తున్న వారికి సైతం భవిష్యత్తులో ఈ దుస్థితి వస్తుందని వీరిని, బ్రాహ్మణ సామాజికవర్గాన్ని పురిగొల్పుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. బ్రాహ్మణ సామాజికవర్గంపై టీడీపీ ప్రభుత్వం కక్షగట్టిందంటూ ప్రచారం చేసి వారిని తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకం చేయాలన్నది ఆయన ప్రథమ కర్తవ్యం అని తెలుస్తుంది.

అంతేగాక ఆయన పలు ప్రముఖ రాజకీయ నాయకులను కలవడం ఆయనపై వస్తున్న ఈ వార్తలకు ఊతమిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే అర్చకులకు వయో పరిమితి తీసివేస్తాం అని చెప్పిన జగన్ ను రమణ దీక్షితులు కలవడం మరింత అనుమానాలను రేకెత్తిస్తోంది. తిరుపతి ప్రాముఖ్యతను కాపాడడానికే ప్రముఖులను కలుస్తున్నాని చెప్పిన ఆయన, బ్రాహ్మణ వర్గానికి ఏదయినా మేలుచేస్తానని జగన్ హామీ ఇస్తే బ్రాహ్మణ వర్గంతో ఓట్లు వేయిస్తానని చీకటి వ్యవహారం నడిపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు సామాజికవర్గాలు బాబుకు వ్యతిరేకంగా ఉన్నాయి, ఇప్పుడు రమణ దీక్షితులు వల్ల బ్రాహ్మణ వర్గం ఓట్లు కూడా గల్లంతయ్యే పరిస్థితి స్పష్టంగా కనబడుతోంది.
5/
5 -
(1 votes)
Add To Favourite