పవన్ కళ్యాణ్ తను మాట్లాడే ప్రతి మాట మేధావి లాగా మాట్లాడుతున్నట్టు ఫీల్ అవుతుంటాడు. కానీ ఆ మాటలు తన ఆపరిపక్వతకు నిదర్శనమని తెలుసుకోలేకపోతున్నాడు. పవన్ కళ్యాణ్ చంద్ర బాబు కు ఎందుకు మద్దతు ఇచ్చాడో మొన్నటి వరకు చెప్పుకుంటూ వచ్చాడు. చంద్ర బాబుకు అనుభవం ఉంది కాబట్టి మద్దతు ఇచ్చానని జగన్ కు లేదని చెప్పాడు. అయితే ఇప్పడూ తనకు ఏ అధికారం ఉందని తనను ముఖ్య మంత్రి ని చేయమని అడుగుతున్నాడు.

Image result for pawan kalyan and jagan

దేశంలో ప్రజలు చాలా మంది కొత్త వాళ్లను, ఏ మాత్రం పాలన అనుభవం లేని వాళ్లను ముఖ్యమంత్రులుగా చేసుకున్నారు. సినీ నటుడిగా తప్ప ఎన్టీఆర్ కు ఉన్న అనుభవం ఏమిటి? వెన్నుపోటుతో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకు అంతకు ముందు అనుభవం ఏమిటి? అంత వరకూ ఎందుకు 2008 లో పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావాలని వచ్చిన చిరంజీవికి ఉండిన పూర్వానుభవం ఏమిటి? ఇలా ఎవరికీ అక్కర్లేని అనుభవం లెక్కలను తనను తాను సమర్థించుకోవడానికి ఉపయోగించుకున్నాడు పవన్ కల్యాణ్.

Image result for pawan kalyan and jagan

 వచ్చే ఎన్నికలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని అంటున్నాడు జనసేన అధినేత. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని అంటే.. ముఖ్యమంత్రి అవుతాననే కదా? లేక పవన్ కల్యాణ్ మాటలకు వేరే భాష్యం ఏదైనా ఉందనుకోవాలా? అది ఆయనకే తెలియాలి. మరి పవన్ కల్యాణ్ కు ఉన్న అనుభవం ఏమిటో కూడా ఆయనకే తెలియాలి. జగన్ ముఖ్యమంత్రిని అవుతా అనకూడదు, తమ ప్రభుత్వం వస్తుందని జగన్ అనకూడదు.. అలా అంటే ఆయనకు అధికారం మీద ఆశ. ఇలాగే జగన్ ను విమర్శించాడు పీకే. ఇప్పుడు తను ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని అంటాడు, అధికారం సాధించి సమస్యలను పరిష్కారిస్తానని అంటాడు.  తను చేస్తే శృంగారం, వేరే వాళ్లు చేస్తే వ్యభిచారం. చంద్రబాబు నేర్పించాడా?


మరింత సమాచారం తెలుసుకోండి: