పవన్ కళ్యాణ్ మొన్నటివరకు సీఎం అనే పదమే తన నోటి నుంచి రాలేదు. ఇప్పుడేమో 2019 లో జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అంటున్నాడు. ఇది జనాలు కూడా నవ్వుతున్నారు. పవన్ కళ్యాణ్ కు క్షేత్ర స్థాయిలో క్యాడర్ లేదు. నాయకుల లేరు నిజముగా చెప్పాలంటే కార్య కర్తలు కూడా లేరు. కానీ ఎందుకంత ధీమాగా చెబుతున్నాడో... జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందనే విషయంలో తనకు అనుమానం లేదని, ప్రజలకూ లేదని ఆయన అభిప్రాయం.

Image result for pawan kalyan janasena

మొన్నీమధ్యనే జనంలోకి వచ్చిన పవన్‌ ఇంత గట్టిగా చెప్పడమేమిటి? చంద్రబాబు నాయుడు, జగన్‌ తమ ప్రభుత్వాలు ఏర్పడతాయని చెప్పుకుంటున్నారంటే దానికో అర్థముంది. చంద్రబాబు చాలా సీనియర్‌. ముఖ్యమంత్రిగా చేయడం ఇది మూడోసారి. జగన్‌ అంత సీనియర్‌ కాకపోయినా, రాజకీయాలకు కొత్త కాదు. తండ్రి ఉండగానే రాజకీయాల్లోకి ప్రవేశించాడు. పవన్‌ ఇప్పటివరకు పార్టీ నిర్మాణం చేయలేదు. నాయకులు లేరు.

Image result for pawan kalyan janasena

అభిమానులే కార్యకర్తలు. పక్కాగా వ్యవస్థ లేదు. అయినప్పటికీ అధికారం తనదేనంటున్నాడు. వచ్చే ఎన్నికల్లో ఎవ్వరికీ మెజారిటీ రాని పరిస్థితి ఏర్పడితే కర్నాటక తరహా రాజకీయాలు జరిగి తాను సీఎంను అవుతానని అంచనా వేసుకుంటున్నాడేమో..!  విధంగా చూస్తే.. పవన్‌కు పాజిటివ్‌ థింకింగ్‌ ఎక్కువగా ఉందేమో. పాజిటివ్‌ ఆలోచనలుంటే అనుకున్నది అవుతుందని వ్యక్తిత్వవికాస నిపుణులు చెబుతుంటారు కదా. దాన్ని ఫాలో అవుతున్నాడేమో. 

మరింత సమాచారం తెలుసుకోండి: