సాధారణంగా ఏనుగులకు కోపం వస్తే ఉగ్రరూపం దాలుస్తాయి..ఎదురుగా ఏవున్నా..విధ్వంసం చేస్తాయి. ఇక మనుషుల విషయానికి వస్తే..పిసు పీసు చేస్తాయి.  ఇలా ఎన్నో సంఘటనలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. తాజాగా మేఘాలయలోని గరోహిల్స్‌లో ఇప్పుడీ లాడెన్ పేరు వింటే ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అదేంటీ లాడెన్ చనిపోయారు కదా..ఇప్పడు లాడెన్ పేరు ఎందుకు వచ్చిందని అనుమానం వస్తుంది కాదా..అసలు విషయానికి వస్తే..లాడెన్ అంటే మనిషి కాదు..ఎనుగు. 
Rogue elephant has killed 37 people in Assam:Forest official
అవును మనుషుల ప్రాణాలు అతి సులువుగా తీస్తున్న ఈ ఏనుగుకు ఉగ్రవాది లాడెన్ పేరు పెట్టారు.  ఇప్పటికీ 37 మంది ప్రాణాలు దారుణంగా తీసింది. అయితే దీన్ని పట్టుకోవడానికి అధికారులు కూడా బెంబేలెత్తిపోతున్నారు. గ్రామాలు, జనావాసాలపై పడి దాడులు చేసి జనాలను చంపేస్తోంది. అతి భారీ కాయంతో ఉండే దీనిని చూస్తేనే చెమటలు పడుతుంటాయి.‘లాడెన్’ ఆగడాలు మరీ పెచ్చుమీరడంతో కాల్చి చంపేలా ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా ఉన్నతాధికారులను కోరినట్టు అధికారులు తెలిపారు.

తాజాగా ఈనెల 2న తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో అసోంలోని పట్‌పారా పహర్టోలీ గ్రామంలో ఓ గిరిజనుడి ఇంటిపై  ఏనుగు దాడి చేసింది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఇంటి యజమాని హజోంగ్‌ను తొక్కి చంపేసింది. గ్రామాలపై దాడులు చేస్తూ అడ్డం వచ్చిన వారిని చంపేస్తున్న ఈ ఎనుగుని కాల్చి చంపడం తప్ప మరో మార్గం లేదని అధికారులు చెబుతున్నారు. అందుకే ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: