సాధారణంగా కొన్ని పనులు మూడో కంటికి తెలియకుండా నాలుగు గోడల మధ్య జరుపుకోవాలి. ఈ పాటికే అదేదో మీకు అర్ధమయ్యే ఉంటుంది. హా..మీరు అనుకుంటున్నది సరైనదే, అదే శృంగారం. కానీ ముంబైలోని ఒక జంట మాత్రం వందల మంది చూస్తుండగానే బరితెగించి అందరిముందు శృంగారం జరిపి ప్రజలను తీవ్ర అసౌకర్యానికి గురిచేశారు. దీంతో పోలీసుల రాకతో అతడు పరారవ్వగా, ఆమె మాత్రం దొరికిపోయింది.


వివరాల్లోకెళితే అది ముంబైలోని మెరైన్ డ్రైవ్ రోడ్డు. నిత్యం వేలాది మంది ఉద్యోగులు, స్కూల్, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు అటు వైపు నుండి వెళుతూ ఉంటారు. కానీ అక్కడి డివైడర్ పై కూర్చొని ఒక జంట మాత్రం వికృత చర్యలకు పాల్పడింది. పరస్పర అంగీకార శృంగారానికి పాల్పడి అందరూ తమనే చూస్తున్నారనే ఇంకిత జ్ఞానం లేకుండా తాము చేయాలనుకున్నది చేసేసారు.


ఇంతలో పోలీసు వ్యాన్ అక్కడికి రావటంతో అతడు పరారవ్వగా, ఆమెను మాత్రం పోలీసులు పట్టుకున్నారు. అక్కడ కొందరు తీసిన వీడియోల ప్రకారం ఆమె భారతీయురాలు, అతడు విదేశీయుడని స్పష్టంగా తెలుస్తోంది. దీనితో ఆమెను విచారించిన పోలీసులు తాము గోవా నుండి వచ్చినట్లు, కేవలం ముద్దు మాత్రమే పెట్టుకున్నట్లు తెలిపింది. ఆమెను డ్రగ్స్ అడిక్ట్ గా అనుమానించిన పోలీసులు మహిళా సురక్ష కేంద్రానికి తరలించారు. కాగా ప్రస్తుతం ఆ విదేశీయుడిని పట్టుకొనే వేటలో ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: