ఈ మద్య ఆర్ఎస్ఎస్ నిర్వహించిన కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ పాల్గొన్న విషయం తెలిసిందే.  ఆ తర్వాత ఆయన ఫోటో మార్ఫింగ్ సోషల్ మీడియాలో పెను సంచలనాలు సృష్టించింది.  దీనిపై ఆయన కూతురు కాంగ్రెస్‌ నాయకురాలు శర్మిష్ఠ ముఖర్జీ స్పందించి..ఇలాంటి ట్రిక్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేస్తారని తన తండ్రికి ముందే చెప్పానని అన్నారు.  అయితే దీనిపై ఆర్ఎస్ఎస్ కూడా తమకు ఆ మార్పింగ్ ఫోటో కి ఎలాంటి సంబంధం లేవని క్లారిటీ ఇచ్చారు.  తాజాగా కాంగ్రెస్‌ నాయకురాలు శర్మిష్ఠ ముఖర్జీ మరోసారి తన తండ్రి రాజకీయాలపై స్పందించారు. 
వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆర్‌ఎస్‌ఎస్‌ పావులు కదుపుతోందని, అందుకే ప్రణబ్‌ ముఖర్జీని తమ కార్యక్రమానికి ఆహ్వానించిందని శివసేన ఆరోపణలు చేస్తోంది.
Image result for pranab mukherjee
ప్రణబ్‌ చేసిన ప్రసంగం బీజేపీకి ఎన్నికల్లో మద్దతిచ్చేలా ఉందని ఆ పార్టీ సంజయ్‌ రౌత్‌ అన్నారు.ప్రణబ్‌ ముఖర్జీ అనూహ్యంగా ఆరెస్సెస్‌ సదస్సులో పాల్గొని.. జాతీయవాదం, దేశభక్తి, జాతి గురించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శివసేన నేత సంజయ్‌ రౌత్‌ మాట్లాడుతూ.. బీజేపీకి వచ్చే ఎన్నికల్లో పూర్తి మెజారిటీ రాకపోతే.. ప్రణబ్‌ను ప్రధాని అభ్యర్థిగా తెరపైకి తెచ్చి.. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు ఆరెస్సెస్‌ రంగాన్ని సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తున్నదని పేర్కొన్నారు.  

Image result for pranab mukherjee

భారత రాష్ట్రపతిగా పదవీ విరమణ పొందినప్పటి నుంచి తన తండ్రి రాజకీయాల్లో ఎప్పుడూ చురుగ్గా పాల్గొనలేదని, ఇకపై కూడా ఆయన రాజకీయ పునఃప్రవేశం ఉండదని స్పష్టం చేశారు. బీజేపీకి గత ఎన్నికల్లో కంటే 110 సీట్లు తక్కువ వచ్చే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన శర్మిష్ట.. ‘మిస్టర్‌ రౌత్‌.. రాష్ట్రపతిగా రిటైరైన తర్వాత మా నాన్న రాజకీయాల్లోకి మళ్లి వచ్చే అవకాశమే లేదు’ అని ట్వీట్‌ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: