తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత అనేక సంచలనాలు చోటు చేసుకున్నాయి.  జయలలితకు సన్నిహితులైన శశికళ,పన్నీరు సెల్వం మద్య రాజకీయ యుద్దం కొనసాగింది.  శశికళ అక్రమాస్తుల కేసులో నాలుగేళ్లు జైలుకు వెళ్లింది..అయితే ఆమె స్థానంలో పళని స్వామిని సీఎం చేశారు.  తర్వాత మరోసారి రాజకీయాల్లో మార్పులు వచ్చాయి..పళని స్వామి, పన్నీరు సెల్వం స్నేహితులయ్యారు..శశికళను అన్నాడీఎంకే నుంచి బహిష్కరించారు.
Image result for panneerselvam sasikala
ప్రస్తుతం తమిళనాడులో రాజకీయాల్లో కొత్త వరవడి వస్తుంది.  స్టార్ హీరోలు రజినీకాంత్, కమల్ హాసన్ లు కొత్త పార్టీ పెట్టిన విషయం తెలిసిందే.  తాజాగా, మరో కొత్త రాజకీయ పార్టీ వెలిసింది. శశికళ సోదరుడు దివాకరన్ ‘అమ్మ అని’ పార్టీని స్థాపించారు. ‘అమ్మ జట్టు’ అని దీని అర్థం. తెలుపు, నలుపు, ఎరుపు, మధ్యలో ఆకుపచ్చ రంగులతో ఉన్న పార్టీ జెండాను ఈరోజు ఆవిష్కరించారు.
Image result for jayalalitha
దివాకరన్ స్వస్థలమైన తంజావూరులో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఏఐఏడీఎంకే పార్టీ అసలు ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ పార్టీని తాను స్థాపించినట్టు ఆయన చెప్పారు.ఈ పార్టీ నుంచి విభేదించి బయటకొచ్చిన దివాకరన్ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: