నేడు ఎవరు సరైన పాలకుడో? ఎవరు దేశానికి ద్రోహం చేస్తున్నాడో? ద్రోహం చేయబూనటానికి ప్రయత్నిస్తున్నాడో? తెలియని విపత్కర పరిస్థితి. విపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహనరెడ్డిపై లక్ష కోట్ల రూపాయల దోపిడీ చేశారని అధికార పక్షనేత ఆరోపణలు ఒక వైపు – ఎమెల్యే శంకరరావు చేసిన పిర్యాదుతో సిబీఐ విచారణకు సుప్రీం “ఆదాయమునకు మించిన ఆస్తులు” కేసుగా గుర్తించి సిబీఐ విచారణకు ఆదేసించగా – అది నాలుగేళ్ల నుండి సిబీఐ మరియు సిబీఐ న్యాయస్థానంలో విచారణలో ఇంకా మూలుగుతూనే ఉంది. అయితే ఇక్కడ కొంత ప్రయత్నం మొదలైంది. అంతేగాదు ఇక్కడ జగన్ ప్రస్తుతానికి ముద్ధాయి మాత్రమే. అయినా ఆయన్ని నేఱస్తుడిగా ప్రచారం చేస్తూ చంద్రబాబు నాలుగైదేళ్లుగా ప్రతిపక్షంలేని శాసనసభతో ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. జగన్ ను నేఱస్తుడుగా చెపుతూ ఆ నీడలో కాలం గడిపేస్తున్న చంద్రబాబు రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారా? అనేది ప్రజల్లో అనెకులకు నిర్ధారణ కావలసి ఉంది.


₹300 కోట్ల పెట్టుబడితో, సింగపూర్ సంస్థలకు ఏకంగా ₹6764 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి ఎవరైనా ఇస్తారా?  ఎంత అన్యాయం - పొరపాటునే కాదు, ఏమరుపాటు న కాదు ఇవ్వరు. ఎందుకంటే ఇది ఏ మాత్రం ‘అర్ధ’వంతమైన ప్రతిపాదన కాదు. ఏమాత్రం ఙ్జానం లేని విధ్యాఙ్జాన శూన్యుడు కూడా ఈవిధమైన నిర్ణయం తీసుకోడు. కాని నాలుగు దశాబ్ధాల సుధీర్ఘ అనుభవం ఉండి మూడవ సారి ముఖ్యమంత్రిగా అధికార్య బాధ్యతలు నిర్వహిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఇది ‘అద్భుతమైన అర్ధవంతమైన ప్రాజెక్టు’

Andhra Pradesh CM N Chandrababu Naidu

అర్ధ ఙ్జానంలేని తెలియని మూర్ఖులకు అది ‘అద్భుతమైన అర్ధవంతమైన ప్రాజెక్టు’ అనవచ్చు. కాని వేల కోట్ల విలువైన హెరిటేజ్ వ్యాపారాన్ని నిర్వహించే విఫణి మహారాణి భువనేశ్వరీదేవి గారి భర్తను - దేశంలోనే అత్యంత అనుభవ ఙ్జాని అయిన చంద్రబాబును  ‘ఙ్జాన శూన్యుడు’  అనలేము కదా!


ఆయనకు అద్భుతం అయింది ఎందుకంటే దానికి వెలుపల మరో ఆర్ధిక కోణం ఉండి ఉండవచ్చు. అంతే ఆయనకుగాని ఆయన బినామీలకు గాని ఈ వ్యాపారంలో వాటాగాని, లాభాల్లో పర్సంటేజ్ ఉందేమో? అంటున్నారు - ఇందులో అద్భుతంగా ఆర్ధిక రాజకీయ విఫణి వ్యాపార ప్రయోజనాలు ఒనగూరే అవకాశాలు లున్న అంశాలు ఇమిడిఉన్నాయి. అలా కాకుంటే ఇలా ఎవరైనా జాతి ప్రయోజనాలని ఊరకనే బలి చేస్తారా?

Image result for amaravati chandrababu vs singapore eswaran

అలా కాకుంటే పారదర్శకతతో ప్రజలకు బహిరంగ వివరణ ఇస్తే సరిపోతుంది. ప్రజల్లో చాలా కాలంగా ఈ ప్రోజెక్ట్ విషయంలో అనుమానాలు, సంశయాలు నెలకొని ఉన్నాయి. ఇక్కడ ప్రజలు అంటే తెలుగుదేశం వాళ్ళు మాత్రమే కాదు. తెలుగుదేశానికి చెందని చంద్రబాబును నమ్మి విశ్వసించి ఓట్లు వేసిన వాళ్ళంతా ఇప్పుడు చంద్రబాబు తీరుకు విస్తుబోతున్నారు. ఆయన చేసిన 600 వాగ్ధానాలలో 60 వాగ్ధానాలు కూడా నేరవేర్చ కుండా ఇప్పుడు ప్రతిదానికి కేంద్రం సహాయం చేయటం లేదనటం న్యాయం కాదని అంటున్నారు.   


₹300 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ₹6764 కోట్ల రూపాయల విలువైన భూమి ఇవ్వటం ఒక్కటే కాదు, ఈ సేకరించిన భూమి - 1691 ఎకరాల పరిధిని ₹5000 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు కల్పించవలసి ఉంది. ఈ భూములపై రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ వంటి రెవెన్యూ ఆదాయానికి గండిగొట్టి మినహాయింపులు కూడా అదనంగా ప్రభుత్వం నష్టపోవలసి వస్తుంది. దానికి కారణం ‘గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్’ పెరిగిపోతుందట. 

Image result for amaravati chandrababu vs singapore eswaran

లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని, ప్రభుత్వం ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తోంది.  అసలు ₹300 కోట్ల రూపాయల చిన్న పెట్టుబడికే మనం ఈ ప్రొజెక్ట్ సింగపూర్, అదీ ప్రవేట్ సంస్థలకు ఇవ్వటం అంటే “ఈష్ట్ ఇండియా కంపెనీకి (బ్రిటీష్ వాళ్ళకు) మొఘల్ ఎంపరర్ జహంగీర్ 1600 సంవత్సరం ప్రభుత్వం వ్యాపారం చేసుకోవటానికి పస్చిమ తీర నౌకాశ్రయం సూరత్ పోర్ట్ నుండి వ్యాపారానికి అనుమతి ఇచ్చినట్లు” వెరీ సింపుల్గా సింగపూరు ప్రభుత్వానికి కూడా కాదట, ఒక వ్యాపార సంస్థలకు ఇవ్వటం దానికి సింగపూరు మంత్రిగారు పౌరోహిత్యం వహించటం – ఇదంతా అయోమయం గందర గోళంగా ఉంది.


ఇందులో జగన్మోహన్ రెడ్దిని నేఱస్తుడు అని అనేదానిలో ఉన్నంతకంటే పెద్ద స్కాం ఉందని పిస్తుంది. డానిని తొలగించటానికి పత్రికా ముఖంగా పూర్తి వివరాలు ప్రకటించాలని జనం కోరుతున్నారు. అందులో ఆంధ్ర ప్రదేశ్ కి తిరిగి ఏదైనా వాటాల రూపంలో వస్తుందా? అయితే దాని శాతం ఎంత? ఈ ప్రతిపాదనలో సరైన క్లారిటీ లేకపోతే ప్రజలకి ఏ మాత్రం ప్రభుత్వ తీరు నుండి జస్టిఫికేషన్ ఉండదు.

Image result for amaravati chandrababu vs singapore eswaran

ప్రజాభిప్రాయం ఏమంటే “సింగపూర్ సంస్థల కోసం ఆంధ్ర ప్రదేశ్ చట్టాలను, సిఆర్డీఏ  చట్టాలను కూడా త్రోసివేసి ఆ సింగపూర్ ప్రయివేట్ సంస్థలకు ప్రయోజనం కల్పించటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు పనిచేస్తున్నారని అంటున్నారు.


అందుకే సింగపూర్ సంస్థలు కోరుకున్న విధంగానే ఒప్పందాలు అన్నీ జరిగిపోయాయి అంటున్నారు.  వారికి అనుకూలంగానే క్లాజులు, సబ్-క్లాజులు వచ్చేశాయని, అంతే కాకుండా, అతి స్వలప సొంత పెట్టుబది తోనే కాకుండా - ఈ దేశ ప్రజల నుండి బలవంతంగా (అంటున్నారు) సేకరించిన  భూములను తనఖా పెట్టుకుని సింగపూర్ సంస్థలు మన బ్యాంకుల నుంచి రుణం పొందే వెసులుబాట్లు కల్పించారు.


అయితే ఈ విధమైన వెసులుబాట్లు పొందుతూ ₹300 కోట్ల రూపాయల అత్యంత స్వల్ప (అల్పమైన) పెట్టుబడితో మనదేశీయ నిర్మాణ సంస్థలు చేయలేవా? దుబాయి లాంటి దేశాల్లో కూడా మన నిర్మాణ సంస్థలు అనేక నిర్మాణ కాంట్రాక్టులు నిరవహిస్తున్నాయి కదా! అందుకే ప్రజలు ఈ రాజధాని నిర్మాణమే ఒక గూడుపుఠాణిగా భావిస్తున్నారు. దాన్ని మనోఫలకాల నుండి తొలగించకపోతే “అమరావతి – ఒక అక్రమావతి” గా అపప్రధ మోయవలసి వస్తుంది. 

Image result for amaravati chandrababu vs singapore eswaran

తొలి దశలో విక్రయించనున్న 656 ఎకరాల విక్రయ కనీస ధరను ₹4 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. ఈ లెక్కను పరిగణనలోకి తీసుకుంటేనే ఈ భూమి విలువ ₹6764 కోట్ల రూపాయలు అవుతుంది. (656 ఎకరాల విక్రయ కనీస ధరను ఎకరం ₹4 కోట్ల రూపాయలుగా నిర్ణయించిన దరిమిలా 1691 ఎకరాల విలువ ₹6764 కోట్లు అవుతుంది)  సింగపూర్ సంస్థలు చెబు తున్నట్లు నిజంగా తొలి దశ పూర్తి చేస్తే మిగిలిన భూమి ధర మరింత పెరగటం ఖాయం. ఆ లెక్కన భూమి విలువ ఏకంగా పది కోట్ల రూపాయ లకు చేరినా ఆశ్చర్యం లేదు. పదిహేను సంవత్సరాల్లో ఈ మొత్తం ప్రాజెక్టును అమలు చేయాలి. అంటే సుమారు 300 కోట్ల రూపాయలు పెట్టు బడి పెట్టే సింగపూర్ సంస్థలకు పదిహేను సంవత్సరాల్లో నికరంగా వచ్చే లాభం కనీసం పది నుండి పదిహేను వేల కోట్ల రూపాయలపై మాటే.


మరి ఇందులో స్కామ్ లేదా? అందులో చంద్రబాబు వాటా లేదా? లేకపోతే ఇంత ఉదారంగా ఆ సంస్థ లకు భూములు ఎలా ఇచ్చేస్తారు? ఇక్కడ తన సత్యసందత నిరూపించుకోవాలంటే పారదర్శకత చాలా అవసరం. ఇంత పెద్ద అమరావతి ప్రోజెక్ట్ లో అవినీతి గూడుకట్టుకునే అవకాశాలు చాలా ఎక్కువ. అందువలన కేంద్ర సంస్థలు కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రజలకోసమైనా పారదర్శకత తీసుకురావాలి. 

Image result for amaravati chandrababu vs singapore eswaran

రాష్ట్ర ప్రభుత్వ సమాచార నిర్వహణలో సింహభాగం నిర్వహించే ప్రభుత్వ మద్దతు మీడియా కూడా ఇందులోని “మర్మం” లేశ మాత్రం కూడా బయటపెట్ట ట్లేదంటే మీడియా దో మాయా మోహంలో పడిందా? సంశయాలు ముప్పిరిగొంటున్నాయి. అనేది ప్రజా హృదయాల్లో పొంగిపొర్లుతుంది. మరి ఈ సంశయా స్పధమైన పరిస్థితులను ప్రజలకు బోధ పరచటం ఒక ప్రజా ప్రభుత్వ లక్షణం కాదా! బాధ్యత లేదా!


ఆపరేషన్ ద్రవిడ-గరుడ ఇలా కేంద్రంపై అనుమానాలురేపిన నటుడు శొంఠినేని శివాజి అదే స్థాయిలో చంద్రబాబును ప్రశ్నించి – ప్రజలకోసం ప్రజలకొరకు సమాధానం రాబట్టవలసిన ఇసుమంత బాధ్యత కూడా లేదా? మరి ఆపరేషన్ ద్రవిడ –ఆపరేషన్ గరుడ-ఆపరేషన్ రావణ-ఆపరేషన్ కుమార సినిమాలు సీరియల్ గా చూపిన మీడియా కూడా తమ నిజాయతీని నిరూపించు కోవాల్సిన సమయం ఆసన్నమైంది. 

Image result for amaravati chandrababu vs singapore eswaran

అమరావతిలో ఆర్ధిక అరాచకాలకు ప్రాధమిక ఉదాహరణలుగా ఈ క్రింది శాంపుల్స్ చెప్పవచ్చు:


1. అయితే విజయవాడ-గుంటూరు మెట్రోకు కేంద్రం అంగీకరించింది. ఏపీ ప్రభుత్వ అవినీతిని చూసి మెట్రో ఎండీ శ్రీధరన్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

2. సీఆర్‌డీఏలో అక్రమాలు చూసి కమిషనర్ శ్రీకాంత్ వెళ్లిపోయారు.

3. ప్రపంచ వ్యాప్తంగా ఏపి పరువు తీసి ప్రతిష్ఠ దిగజార్చిన మాకీ అసోసియేట్స్ ఉదంతం 

Image result for amaravati chandrababu vs singapore eswaran

7.80 లక్షల ఇళ్లు కేంద్రం ఏపీకి కేటాయించింది. తెలంగాణలో డబుల్ బెడ్ రూం యూనిట్ రూ.1000/- అయితే, ఏపీ లో  యూనిట్ ₹2400/- యూనిట్ ఎందుకు అవుతుంది? అన్నింటినీ మించి అమరావతి నిర్మాణంలో విదేశీపాత్రను ప్రమేయాన్ని భారత చట్టాల అతిక్రమణపై ఒక నిర్ణయాత్మక వివరణ కేంద్రం నుంచి కూడా రావటం అత్యంతా వశ్యం.  

Image result for amaravati construction singapore relation


మొత్తం మీద పై వివరణకు ముగింపుగా రాజధాని భూముల వ్యవహారం అమరావతి ప్రజల హృదయాల్లోనే కాదు భారత జన హృదయాల్లో కూడా ఆందోళన రేకెత్తిస్తోంది. చంద్రబాబు సింగపూర్ ప్రభుత్వంతో కుదుర్చుకుంటున్న ఒప్పందాలు ప్రజలకు అంతుబట్టకుండా మారాయి. ఈ విషయంపై అవగాహన ఉన్నవాళ్లు మాత్రం చంద్రబాబు తీరు పట్ల ఆశ్చర్యపోతున్నారు. సింగపూర్ తో ఒప్పందాలు అంటూ చంద్రబాబు అమరావతి ప్రాంతాన్ని ఆ దేశానికి రాసిస్తున్నాడనే అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

Image result for centre against amaravati Secret GOs

ఈ విధంగా చంద్రబాబు నూతన విధానంతో  సింగపూర్ కంపెనీలు భారీగా లాభపడనున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ ఒప్పందాల్లో చంద్రబాబుకు చీకటి ఒప్పందాలలో కనిపించని లాభాలెన్నో ఉండవచ్చనే విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. సింగపూర్ ప్రభుత్వానికి ఈ భూములు కేటాయించడమే పెద్ద స్కామ్ అని, అనే అనేమాట గట్టిగా వినిపిస్తోంది.

Image result for centre against amaravati Secret GOs

అయితే ఈ వ్యవహారాల్లో 1500 పైగా జీవోలు విడుదలైనా బయటకురావడం లేదని, రహస్య జీవోలు ఇస్తూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమరావతి ఆసాంతం సింగపూరుకు అంకితం చేసేపనిలో నిమగ్నమై ఉందని అంటున్నారు. ఎన్నికలకు ముందే అప్పగింతల పని పూర్తి చేస్తోందని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి సీమాంధ్ర ను సింగపూర్ చేయడం ఏమో కానీ? చంద్రబాబు నాయుడు సీమాంధ్రను తాకట్టు పెడుతున్న పేరును మాత్రం సంపాదించుకుంటున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: