ఒక సర్వేలో బిజెపికి వాతావరణం పూర్తిగా అననుకూలంగా మారే సూచనలున్నట్లు, ఒక జాతీయ హింది దినపత్రిక రాయగానే,  అది చూసి బిజెపి వ్యతిరెఖ పవనాలపై ఇంకొంచెం మసాలా ధట్టించి చెలరేగిపోయింది  తెలుగుదేశం పార్టీకి మద్దతు నిచ్చే ప్రధాన మీడియా.   


ఇప్పుడే కనుక, ఈ పరిస్థితుల్లో వెనువెంటనే, దేశంలో లోక్-సభ ఎన్నికలు జరిగితే తమ విజయావకాశాలు ఎలా ఉన్నాయి? అనే అంశం పై బిజెపి సర్వే చేయించుకున్న దని, దరిమిలా సర్వేలో వారికి దేశ వ్యాప్తంగా పూర్తి ఎదురుగాలి వీస్తోందని తేలిందనేది దినపత్రిక సమాచారం. ఇప్పటి పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే తమకు 130 సీట్లకు మించి రావని బీజేపీ అంతర్గత సర్వే తేల్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికలలో బీజేపీ సొంతంగా గెలిచిన సీట్లతో పోలిస్తే ఈ సర్వే ప్రకారం వచ్చే సీట్లు సగం కూడా లేవు.
Image result for dainik bhaskar
ఈ సమాచారం దైనిక్ భాస్కర్ - జాతీయ హింది దినపత్రికలో ప్రచురితమయింది.  

ప్రధాని నరెంద్ర మోడీపై తీవ్ర వ్యతిరేకత ఉందని, కమలం మళ్లీ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కష్టమే అని ఈ సర్వే చెబుతోందని, అయితే ఇది బిజెపికి ఆశని పాతమేనని అంటున్నారు. ఈ సర్వే నిజంగానే బీజేపీ చేయించుకుందా? ఇంత దారుణమైన ఫలితాలు ఉంటాయా? అనేవి అందరికి సహజంగా వచ్చే సందేహాలే.

అయితే బిజెపి అధికార ప్రతినిధి పార్లమెంట్ సభ్యుడు జివిఎల్ నరసింహారావు, ఈ వార్తలపై స్పందిస్తూ,  "ఆ పత్రిక దైనిక్ భాస్కర్ ప్రచురణ పూర్తిగా అబద్ధమని, 152 స్థానాల్లో బిజెపి ఎంపిలు ప్రజాభిమానం కోల్పోయారని, ఆయా స్థానాల్లో అభ్యర్ధులను బిజెపి మార్చే ప్రయత్నం చేస్తున్నారని తప్ప, అంతకు మించి రాయలేదు" అని చెప్పారు. 
Image result for dainik bhaskar BJP news 152 seats
అయితే అది చూసి తెలుగుదేశం మద్దతు మీడియా కోతికి కొబ్బరికాయ దొరికితే ఏంచేస్తుందో అదేచేసింది. తమ పత్రికల్లో చానళ్లలో బిజెపి 130సీట్లకి పరిమితమౌతుందని వ్యతిరెఖ వార్తలు రాస్తూ నిన్న ఆదివారం తాము వండి వార్చిన వార్తలను ప్రసారం చేశాయని అన్నారు. ఎలాంటి ఆధారం లేకుండా రాసిన ఆ పత్రిక  'దైనిక్ భాస్కర్' పై ప్రెస్-కౌన్సిల్ కు పిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అసలు తాము చేయించిన సర్వే ప్రకారం తమ పార్టీ నరెంద్ర మోదీ నాయకత్వంలో భారీ మెజారిటీతో అధికారంలోకి రానున్నదని తెలిపారు. 

అదలా ఉంటే బీజేపీ చేయించుకుందన్న ఈ సర్వే ప్రకారం, తెలుగు పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం జరిగితే,  ఆ ఉపద్రవం తెలుగుదేశం పార్టీకి కూడా ప్రమాదమే.  బీజేపీ కేంద్రంలో ఓడిపోతుందంటే ముందుగా ఆనందించేది తెలుగుదేశం పార్టీనే. అయితే, ఇది మరో విధంగా తెలుగుదేశం పార్టీలో ఆందోళన రేపటానికి కారణం కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఈ స్థాయిలో ప్రజావ్యతిరేకత రుచి చూస్తుంటే, ఏపీలో వారితో మిత్రత్వం నెరపిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొ నున్నట్లే అంటున్నారు విశ్లేషకులు. 
Image result for gvl narasimha rao
కారణం గత ఎన్నికల్లో ఈ రెండు పార్టీలూ కలిసి పోటీ చేశాయి. నాలుగేళ్ల పాటు కలిసి సాగాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అవకాశవాదం కొద్దీ బీజేపీకి విడాకులిచ్చి  వ్యతిరేకిస్తున్నాడు. అయితే ఇన్నాళ్లూ అంటకాగిన ప్రభావం ప్రజలపై ఖచ్చితంగా చూపే అవకాశం ఉంది. ఒకవేళ బీజేపీకి గనుక ఓటమి ఖాయమైతే, తెలుగుదేశం పార్టీ కూడా ఆ అపజయాన్ని తప్పించుకోలేని, ప్రజావ్యతిరేకత విషయంలో రెండు పార్టీలు ఒకటే కావటం తో టిడిపి చిత్తు కావడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు.
Image result for chandrababu modi
ప్రభుత్వ వ్యతిరేకత అనేది కేవలం నరెంద్ర మోడీ పైనే కాదు, చంద్రబాబు పైన కూడా అదే స్థాయిలో ఉందని ఆయన తీరు నాలుగేళ్ళు ఒక లాగా,  ఆ తరవాత యు-టర్న్ తీసుకోవటంతో,  అపనమ్మకం ప్రజల్లో చంద్రబాబు పట్ల ఉదృతంగా పెరిగిందని వీరు స్పష్టం చేస్తున్నారు. అసలు ఇప్పటి వరకు చంద్రబాబు ఆయన వంది మాగధులు, పంచ మాంగ దళాలు మాత్రమే మాట్లాడారు. ఇంకా నరెంద్ర మోడీ ఇంకా స్పందించలెదని ఆయన స్పందన తరువాత తెలుగుదేశంతో పాటు ఆయనకు వంతపాడే మీడియా మరింత ఇబ్బందుల్లో పడవచ్చని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: