సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ఉండగాన్నే రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. ఈక్రమంలో రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు వివిధ వ్యూహాలతో అధికార పార్టీలను ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పెట్టే విధంగా  ప్రజలలోకి వెళ్లడానికి కార్యక్రమాలను రూపొందించుకుంటున్నారు. ఈ క్రమంలో ముందుగా వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప పాదయాత్రతో దూసుకుపోతున్నారు రాష్ట్రంలో... ముఖ్యంగా జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర  తెలుగుదేశం పార్టీ నాయకులకు అధినేత చంద్రబాబుకు నిద్ర లేకుండా చేస్తుంది.
Related image
అలాగే మరోపక్క గత ఎన్నికలలో కూటమిగా ఏర్పడి పాల్గొన్న తెలుగుదేశం బిజెపి జనసేన మూడు పార్టీలను చిల్చేసింది ప్రజా సంకల్ప పాదయాత్ర.  అంతేకాకుండా ప్రజలలో చంద్రబాబుపై మరింతగా పెంచింది ప్రజా సంకల్ప పాదయాత్ర... రాష్ట్రంలో ప్రజలందరూ వైసీపీకి బ్రహ్మరథం పడుతున్నారు... అంతేకాకుండా ప్రముఖ సంస్థల సర్వేలలో… జాతీయ సర్వేలో వైసీపీకి అధికారం  ఖాయమని ఫలితాలు రావడంతో చాలామంది రాజకీయ నాయకులు వైసీపీ పార్టీ వైపు చూస్తున్నారు.

ఇదిలా ఉండగా బాప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గం ఇప్పుడు వైసీపీ కంచుకోట‌గా మారుతోంది. దీనికి కార‌ణం వైసీపీ ఎమ్మెల్యే కోన ర‌ఘుప‌తి చేప‌ట్టిన అభివృద్ధి కార్య‌క్ర‌మాలేనిన ఆ ప్రాంత ప్ర‌జ‌లు బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెబుతున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో గెలుపు కోసం ఏ ఇత‌ర పార్టీ స్కెచ్‌లు వేసినా.. అవ‌న్నీ వృథా ప్ర‌య‌త్నాలేన‌న్న సంకేతాన్ని బాప‌ట్ల ప్ర‌జ‌లు ఇస్తున్నారు. దీంతో బాప‌ట్ల‌పై క‌న్నేసిన అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ శ్రేణులు సైతం ఖంగు తింటున్నారు.
Image result for jagan padayatra affect chandrababu
అయితే, 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కోన ర‌ఘుప‌తిపై వైసీపీ టిక్కెట్‌పై 5,813 ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఆ ఓట్లు మ‌రో 30 శాతం పెరిగాయ‌ని, దీనికి కార‌ణం చంద్ర‌బాబు స‌ర్కార్ సామాన్యుల‌పై వ్య‌వ‌హ‌రిస్తున్న దుర్మార్గ‌పు చ‌ర్య‌లేన‌ని, ఆ చ‌ర్య‌ల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లే క్ర‌మంలో వైసీపీ విజ‌యం సాధించింద‌ని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.  ప్రస్తుతం రాష్ట్రంలో కోన రఘుపతి అంటే బాపట్ల…. బాపట్ల అంటే కోన రఘుపతి అన్న విధంగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: