విశాఖ జిల్లా మంత్రి గంటా శ్రినివాసరావుకు షాకులు తగులుతున్నాయి. నిన్నటివరకు వెన్నంటి నడచిన మిత్రులే సరైన టైం  చూసుకుని మరీ షాక్ ఇచ్చేస్తున్నారు. నాలుగేళ్ళుగా గంటాతో అంటకాగిన వాళ్ళే ముఖాలు చాటేస్తున్నారు. అనుచరులనుకున్న వారే ఎవరి కుంపటి వారు పెట్టుకుంటూ డైరెక్ట్ గా  హై కమాండ్ తోనే రిలేషన్స్ మెయింటయిన్ చేస్తూంటే మంత్రి గారికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తోంది. ఎంత సేపూ తన చుట్టూ ఉన్న వారిని ఉపయోగించుకోవడమే తప్ప ఏ హెల్పూ చేయని కారణంగానే గంటాతో రాం రాం  అనేస్తున్నారు. విశాఖ జిల్లాలో రాజకీయ గురువుగా బిల్డప్ ఇచ్చుకునే గంటా శిష్యుల నుంచి ఇలా తగులుతున్న ఝలక్ తో కంగారెత్తిపోతున్నారు.
Image result for Against on ganta srinivasa rao a
అప్పట్లో అలా...
2014 ఎన్నికల వరకూ విశాఖ జిల్లాలో గంటా హవా బాగానే నడిచింది. ప్రజారాజ్యం నుంచి కాంగెస్, ఆ మీదట తెలుగుదేశం పార్టీ లో ప్రవేశించినపుడు తనకంటూ ఓ బలగాన్ని తయారుచేసుకుని అధినాయకత్వం ముందు భారీగా ఫోకస్ ఇచ్చిన గంటా కాలక్రమంలో అందరినీ దూరం చేసుకున్నారు. ఓ వైపు తెలుగుదేశం పార్టీలో ప్రత్యర్ధిగా మరో మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎక్కడికక్కడ బ్రేకులు వేస్తున్నా గంటా తన మందీ మార్భలాన్ని చూపించి హై కమాండ్ వద్ద పలుకుబడి పెంచుకున్నారు. ఆ విధంగా 2014 సార్వత్రిక ఎన్నికలలో గంటా తనతో పాటు తన వారికీ దండీగా  టిక్కెట్లు  ఇప్పించుకున్నారు. అనకాపల్లి ఎంపీగా ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎలమంచిలి నుంచి పంచకర్ల రమేష్ బాబు, గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు వంటి వారు అప్పట్లో తీడీపీలో చేరిపోయారు. ఇక, గంటాను అనుసరించి ఎలమంచిలి మాజీ ఎమ్మెల్యే కన్నబాబు, విశాఖ మాజీ ఎమ్మెల్యే ఎస్ ఎ రహమాన్ తదితరులంతా సైకిలెక్కేసారు. దశాబ్దాలుగా గంటాను అంటిపెట్టుకుని డీఫాక్టో మంత్రిగా రాజ్యమేలిన సమీప బంధువు పరుచూరి భాస్కరరావు వంటి వారు సైతం టీడేపీలో చురుకైన పాత్రే పోషించారు. 

Image result for vizag tdp cadre

రివర్స్  గేర్ లో గ్యాంగ్
అయితే ఇదంతా గతం. వీరిలో ఇపుడెవరూ కూడా గంటాతో కలసి నడిచేందుకు సిద్ధంగా లేరు. ప్రజ్యారాజ్యం ద్వారా రాజకీయ అరంగేట్రం చేసి గంటాతోనే అంతా అనుకున్న ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రస్తుతం తన దారి తాను చూసుకుంటునారు. వచ్చే ఎన్నికలలో ఆయన భీమిలి నుంచి పోటీ చేయాలనుకుంటే గంటా తానూ తిరిగి అక్కడే పోటీ అంటూ ప్రకటించుకోవడంతో వీరి మధ్య విభేదాలు బయటపడ్డాయి. రైల్వే జోన్ సాధన కోసం గంటా అఖిల పక్షమంటూ హడావుడి చేస్తే అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి ఏకంగా రైల్వే స్టేషన్  వద్దనే దీక్ష పేరుతో హల్ చల్
 చేశారు. దీంతో ఈ ఇద్దరి దారీ వేరైపోయింది. ఎలమంచిలి ఎమ్మెల్యేగా ఉన్న పంచకర్ల రమేష్ బాబు కూడా విశాఖ రూరల్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ తన సొంత రాజకీయ పంధాను  రూపుదిద్దుకుంటున్నారు. వచ్చే ఎన్నికలలో ఆయన విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రెడీ అయిపోతున్నారు. గంటా ఈ విషయంలో చేతులెత్తేశారని టాక్. . ఇక, , గాజువాక ఎమ్మెల్యే పల్లా  శ్రీనివాసరావు సైతం భవిష్యత్తు రాజకీయాలపై నా దారి నాదే అంటున్నారు.

Image result for Against on ganta srinivasa rao a

హై కమాండ్ తోనే డైరెక్ట్ లింక్
మాజీ ఎమ్మెల్యే రహమాన్ వచ్చే ఎన్నికలలో విశాఖ దక్షిణం నుంచి పోటీ చేసేందుకు మైనారిటీ కార్డ్ తో ఏకంగా హై కమాండ్ తోనే టచ్ లో ఉంటున్నారు. గంటా సమీప బంధువు పరుచూరి భాస్కరరావు అనకాపల్లి నుంచి పోటీ చేసేందుకు తయార్ అంటూ గంటా వర్గం నుంచి వేరు పడి సొంత కుంపటి పెట్టేసుకున్నారు. వచ్చే ఎన్నికలలో టీడీపీ అధినాయకత్వం గంటా చెప్పే వారందరికీ టిక్కెట్లు ఇచ్చే వాతావరణం కనిపించకపోవడం ఓ కారణమైతే, నమ్మి చేరిన వారికి గంటా తగిన న్యాయం చేయకపోయారన్న ఆవేదనతోనే ఆయన గ్యాంగ్ మెల్లగా తప్పుకుందని జిల్లాలో టాక్ నడుస్తోంది. మొత్తం మీద చూసుకుంటే మంత్రి గారికి బాడ్ టైం స్టార్ట్ అయినట్లేనంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: