చంద్ర బాబు నాయుడు చేపట్టిన నవ నిర్మాణ దీక్షలు అందరికీ తెలిసిందే. అయితే ఈ దీక్షలు వల్లన ఎవరికీ ఉపయోగమో తెలియడం లేదు. ఒకటి మాత్రం క్లియర్ కట్ గా అర్ధం అవుతుంది. ఈ నవ నిర్మాణ దీక్షలను టీడీపీ ఎన్నికల ప్రచారానికి వాడుకుంటుంది. నవ నిర్మాణ దీక్ష అని చెప్పి చంద్ర బాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం మీద విరుచుకు పడుతున్నాడు. తన తప్పులను కూడా కేంద్రం మీద నెట్టేసి బీజేపీ ని ప్రజల దృష్టి లో విలన్ లాగా చిత్రీకరిస్తున్నారు. 

Image result for chandrababu naidu

దాదాపు నాలుగేళ్ళ పాటు కలసి కాపురం చేసిన టీడీపీ, బీజేపీలు నిలువునా చీలిపోయిన నేపథ్యంలో రాష్ట్రంలో సరికొత్త రాజకీయ సమీకరణలకు రంగం సిద్ధమవుతోంది. దీంతో తెలుగుదేశం పార్టీకి ఈ సమీకరణలు తీవ్ర శిరోభారాన్ని మిగిల్చే అవకాశం ఉన్నట్టు ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. ఓ విధంగా జరగనున్న పరిణామాలను వారే ప్రజలకు వివరిస్తున్నారు. బీజేపీతో వైకాపా, జనసేన పార్టీలు కలిసేందుకు ఉత్సాహం చూపుతున్నాయని ప్రచారం చేస్తున్నారు.

Image result for chandrababu naidu

రాష్ట్రానికి అన్ని విధాలుగా అన్యాయం చేసిన బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరే పనిలో టీడీపీ నేతలు బిజీబిజీగా తిరుగుతున్నారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ పరంగా జరిగిన నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయి మహానాడు కార్యక్రమాల్లోను, తాజాగా నవనిర్మాణ దీక్షల్లోనూ ఈ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు.ప్రత్యేకహోదా అంశం ప్రజల్లో సెంటిమెంట్‌గా మారిపోవడంతో ఈ విషయంలో కేంద్రం చేసిన దగాను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఓ విధంగా ప్రభుత్వ పరంగా జరుగుతున్న నవనిర్మాణ దీక్షలు పార్టీ కార్యక్రమాన్ని మరపించేలా నిర్వహిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: