సినీ ప్ర‌ముఖుడు, వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అభిమాని పోసాని కృష్ణ‌ముర‌ళి తండ్రి, కొడుకుల‌ను దుమ్ము దులిపేశారు. తండ్రి చంద్ర‌బాబునాయుడును కొడుకు నారా లోకేష్ ను విడివిడిగా క‌డిగిపారేశారు. వైసిపికి ఓట్లేస్తే బిజెపికి ఓట్లేసిన‌ట్లే అన్న లోకేష్ ఆరోప‌ణ‌ల‌పై పోసాని రెచ్చిపోయారు. వైసిపికి ఓట్లేస్తే బిజెపికి ఓట్లేసిన‌ట్లు ఎలా అవుతుంద‌ని నిల‌దీశారు. లోకేష్ చెప్పిందే నిజ‌మైతే టిడిపికి ఓట్లేస్తే క‌మ్మ కులానికి ఓట్లేసిన‌ట్లు కాదా ? అంటూ ప్ర‌శ్నించారు. టిడిపికి ఓట్లేస్తే అవినీతికి ఓట్లేసిన‌ట్లు కాదా అంటూ మండిప‌డ్డారు. రాష్ట్రాన్ని ఒక్క క‌మ్మ కులం మాత్ర‌మే ఏలాలా అంటూ ధ్వ‌జ‌మెత్తారు. నాలుగేళ్ళ‌పాటు బిజెపితో అంట‌కాగింది వైసిపినా లేకపోతే టిడిపినా అంటూ సూటిగా ప్ర‌శ్నించారు. అవ‌స‌ర‌మైనంత కాలం బిజెపితో అంట‌కాగిన టిడిపి వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు లాక్కోవ‌టం సాధ్యం కాద‌ని అర్ద‌మైపోయి ఎన్డీఏలో నుండి బ‌య‌ట‌కు వ‌చ్చేసిన విష‌యం అంద‌రికీ తెలిసిందే క‌దా అంటూ ప్ర‌శ్నించారు.

రాష్ట్రాన్ని అవినీతిమ‌యం చేశారు

Related image

అదే సంద‌ర్భంగా చంద్ర‌బాబు గురించి మాట్లాడుతూ, బిజెపితో చంద్ర‌బాబు ఎప్పుడెప్పుడు పొత్తులు పెట్టుకుంది, అవ‌స‌రం తీరిపోయిన త‌ర్వాత ఎలా వ‌దిలేసింది వివ‌రించారు. రాష్ట్రంలో అవినీతి పాల‌న చేస్తున్న‌దెవ‌రూ అంటూ మండిప‌డ్డారు. అస‌లు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కున్న‌దెవ‌రూ అంటూ నిల‌దీశారు.  ప్ర‌త్యేక‌హోదాపై పిల్లిమొగ్గ‌లు వేసింది చంద్ర‌బాబు కాదా అంటూ ప్ర‌శ్నించారు. 23 వైసిపి ఎంఎల్ఏల‌ను ప్ర‌లోభాల‌కు గురిచేసి లాక్కున్న‌దెవ‌రో ప్ర‌జాల‌కు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. చంద్ర‌బాబు మీదున్న కేసులపై విచార‌ణ జరిగితే ఈపాటికే ఆయ‌న జైల్లో ఉండాలంటూ స్ప‌ష్టం చేశారు.

చంద్ర‌బాబు స్టేల‌తోనే కంటిన్యూ అవుతున్నారు

Image result for posani on chandrababu

జ‌గన్ మీదున్న కేసుల‌న్నీ రాజ‌కీయ‌ప‌ర‌మైన కేసులే అన్న విష‌యం అంద‌రికీ తెలుస‌న్నారు. జ‌గ‌న్ కాంగ్రెస్ లో నుండి బ‌య‌ట‌కు రాగానే శంక‌ర్ రావు, టిడిపి నేత య‌ర్న‌న్నాయుడు ఇద్ద‌రూ క‌లిసే క‌దా కోర్టులో కేసులు వేసిందంటూ చెప్పారు. ప‌ద‌వి కోసం చంద్ర‌బాబు ఎవ‌రితోననైనా క‌లుస్తారంటూ మండిప‌డ్డారు. ప్ర‌త్యేక‌హోదా కోసం ఉద్య‌మాలు చేసిన వాళ్ళ‌పై చంద్ర‌బాబు కేసులు పెట్ట‌లేదా అంటూ నిల‌దీశారు. త‌న‌పై కోర్టుల్లో కేసుల‌పై విచార‌ణ జ‌ర‌గ‌కుండా స్టేలు తీసుకుని చంద్ర‌బాబు కంటిన్యూ అవ‌తున్న విష‌యం అంద‌రికీ తెలిసిందేన‌న్నారు. చంద్ర‌బాబుపై కోర్టుల్లో 16 స్టేలున్న‌ట్లు దేశంలో ఇంకో సిఎం ఎవ‌రిపైనా లేద‌ని ఎద్దేవా చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: