చంద్ర బాబు నాయుడు తన గురించి తానూ గొప్పలు చెప్పుకోవడం కొత్త కాదు. ఏమి చేయకపోయిన రాష్ట్రం లో 80 % మంది సంతృప్తి కరంగా ఉన్నారని బాబు అంటున్నాడు. కానీ తెలుగు దేశం మీద మరియు చంద్ర బాబు పాలన మీద క్షేత్ర స్థాయిలో చాలా వ్యతిరేకత ఉందన్న సంగతి ఇప్పటికే చాలా సర్వేలు నిగ్గు తేల్చాయి.  అయితే బాబు మాత్రం పాత పాట మళ్లీ పాడుతున్నడు. అతని మాటల్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎంగా పనిచేసినప్పుడు, ఇప్పుడు అవశేష ఏపీకి పనిచేస్తున్నప్పుడు పరిపాలనను ఛాలెంజింగ్‌గా తీసుకున్నాను.

Image result for chandrababu naidu

ఉమ్మడి ఆంధ్రాకు సీఎం అయినప్పుడు మౌలిక వసతులు లేవు. అభివృద్ధి లేదు. ఆర్థిక సమస్యలున్నాయి. అప్పుడు ఆర్థిక సంస్కరణలను, టెక్నాలజీని అందిపుచ్చుకొని అభివృద్ధి పథంలో నడిపించాను. ఇప్పటి ఏపీలో సున్నా నుంచి ప్రారంభించాం. భారీ రెవన్యూ లోటు ఉండేది. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులు చేపట్టాం. టెక్నాలజీ ఉపయోగించి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం.

Image result for chandrababu naidu

గత నాలుగేళ్ల పరిపాలన నాకు పూర్తి సంతృప్తి కలిగించింది. నా నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో చాలా స్ఫూర్తిమంతమైన, సంతృప్తికరమైన కాలం ఇదే. సంక్షేమం నుంచి అభివృద్ధి వరకు ప్రజలు కోరుకున్నది ఇచ్చే సామర్థ్యం నాకుంది. కియా మోటార్స్‌, అశోక్‌ లేలాండ్‌, హెచ్‌సీఎల్‌వంటి భారీ పరిశ్రమలు తెచ్చాను. అమరావతికి, పోలవరం ప్రాజెక్టుకు చాలినన్ని నిధులు కేంద్రం ఇవ్వకపోవడం నా వైఫల్యం కాదు. దీని ప్రభావం ఎట్టిపరిస్థితుల్లోనూ ఎన్నికలపై ఉండదు. నిధుల కోసం కేంద్రంతో పోరాడుతున్నాను. కేంద్రం ఎన్ని ఇబ్బందులు పెడుతున్నదో ప్రజలకు తెలుసు. 2019 చివరినాటికి పోలవరం పూర్తి చేస్తాం.

మరింత సమాచారం తెలుసుకోండి: