ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా మంగ‌ళ‌వారం వైసిపి అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తూర్పు గోదావ‌రి జిల్లాలోకి ప్ర‌వేశించనున్నారు. కొవ్వూరు బ్రిడ్జి దాట‌గానే గోష్పాద క్షేత్రం వ‌ద్ద ఉద‌యం జ‌గన్ ఘ‌నంగా పూజ‌లు నిర్వ‌హించారు. త‌ర్వాత గోదావ‌రి త‌ల్లికి హార‌తి ఇచ్చారు.  గోదావ‌రి తీరంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించిన జ‌గన్ ను వేద‌పండితులు ఆశీర్వ‌దించారు. ఈరోజు జ‌గ‌న్ పాద‌యాత్ర 187వ రోజుకు చేరుకుంది. జిల్లాలో జ‌గ‌న్ 26 రోజుల పాటు పాద‌యాత్ర చేయ‌నున్నారు. మొత్తం 16 నియోజ‌క‌వ‌ర్గాల్లోని 267 కిలోమీట‌ర్లు క‌వర్ చేస్తారు.

Image result for ys jagan padayatra pujas


కొవ్వూరు బైపాస్ స‌ర్కిల్ , బ్రిడ్జ్ పేట‌, శ్రీ‌నివాస‌పురం మీద‌గా పాద‌యాత్ర తూర్పు గోదావ‌రి జిల్లాలోకి ప్ర‌వేశిస్తుంది. రాజమండ్రి బ్రిడ్జి వద్ద జ‌గ‌న్ కు ఘ‌న స్వాగ‌తం  ప‌లికేందుకు జిల్లాలోని నేత‌లంద‌రూ ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు. వైసిపి వ‌ర్గాల ప్ర‌కారం జ‌గ‌న్ వెంట పాద‌యాత్ర‌లో సుమారు ల‌క్ష మంది కార్య‌క‌ర్త‌లు, జ‌నాలు న‌డ‌వ‌నున్నారు. మ‌ధ్యాహ్నం లంచ్ త‌ర్వాత రాజ‌మండ్రిలోకి జ‌గ‌న్ ప్ర‌వేశిస్తారు. సాయంత్ర రాజ‌మండ్రి న‌గ‌రంలో భారీ బ‌హిరంగ స‌భ జ‌రుగుతుంది. 
జ‌గ‌న్ పాద‌యాత్ర సంద‌ర్భంగా బ్రిడ్జీపై వాహ‌నాల రాక‌పోక‌ల విష‌యంలో అధికార యంత్రాంగం జాగ్ర‌త్త‌లు తీసుకుంది. బ్రిడ్జీ మీదుగా ఇత‌ర‌త్రా వాహ‌నాల‌ను  నిలిపేశారు. వాహ‌నాల రాక‌పోక‌ల‌కు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను సూచించారు. అదే విధంగా రాజ‌మండ్రి ప‌ట్ట‌ణంలో కూడా వాహ‌నాల రాక‌పోక‌ల‌పై ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. వాహ‌న‌దారుల‌కు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ట్రాఫిక్ డైవ‌ర్ష‌న్ చేశారు. 

People Support To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

శ్చిమగోదావరి నుండి తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం లోకి అడుగుపెట్టబోతున్న వై. యస్.రాజశేఖరరెడ్డి గారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జిల్లా నేతలు చేసిన ఏర్పాట్లు 🇱🇸 బ్రిడ్జి పొడవునా పార్టీ జెండాలు బ్రిడ్జి పొడవునా రాజశేఖరరెడ్డి, జగన్ అన్న కటౌట్లు ఏర్పాటు చేశారు. కొవ్వూరు నుండి రాజమహేంద్రవరం వరకు గోదావరి లో 600 పడవలపై పార్టీ జెండాలు ఎగుర‌వేశారు. బ్రిడ్జి కి ఒకవైపు 7 అడుగుల ఎత్తున 3.5 కిలోమీటర్ల భారీ పార్టీ జెండాను ఏర్పాటు చేశారు. పార్టీ జెండాలోని ముడురంగుల చీరలతో 150 మంది మహిళలు 150 గుమ్మడికాయలతో జ‌గ‌న్ కు ప్ర‌త్యేక హార‌తికి ఏర్పాట్లు చేశారు. 


30 మంది బాలికలు వీణలతో జగన్ కి స్వాగతం చెప్ప‌టానికి సిద్దంగా ఉన్నారు. 108 మంది తో తీన్మార్, 30 మందితో మహిళా తీన్మార్. 108 మందితో గారడీ నృత్యాలతో ఆల‌రించ‌నున్నారు. 108 మందితో గరగ నృత్యాలు, 108 మంది చీరలు, తలపాగాలు ధరించి పార్టి జెండాలు పట్టుకుని,  108 మంది మహిళలు కల‌శాలతో జగన్ కు స్వాగతం పలకనున్నారు. పాదయాత్ర పొడవునా భారీ బాణాసంచా పేల్చుతూ, పేరాచూట్ల‌ను ఆకాశంలోకి వ‌ద‌ల‌టం ద్వారా  పార్టీ జెండాల‌ను ఆకాశంలో కి ఎగిరే  ఏర్పాట్లు చేశారు.  పాదయాత్ర లో జ‌గ‌న్ వెన‌క భాగంలో 25 అడుగుల జగన్  కటౌట్ వచ్చేలా జిల్లా నేతలు జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: