వైసీపీ అధినేత జగన్ చేస్తున్న పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో ముగించుకొని తూర్పుగోదావరి జిల్లాలో అడుగుపెట్టబోతుంది. ఈ సందర్భంగా జగన్ గోష్పాద క్షేత్రం వద్ద గోదారమ్మకు పుణ్య హారతి ఇచ్చి పాదయాత్ర మొదలు పెట్టారు. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజల అండదండలతో ఆదరాభిమానాలను అందుకున్న జగన్ తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో అడుగుపెట్టబోతుండడంతో అక్కడ ఉన్న నాయకులు వైసిపి కార్యకర్తలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ క్రమంలో తమ నాయకుడు జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర గురించి వైసిపి సీనియర్ నేత ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తూర్పుగోదావరి జిల్లా ప్రజా సంకల్ప పాదయాత్ర విశేషాలు తెలియజేశారు.

Image may contain: 11 people, people smiling, people standing and outdoor

మొత్తం 280 కిలోమీటర్లు 16 నియోజకవర్గాలలో పాద‌యాత్ర జ‌రుగుతుంద‌ని తెలియ‌చేశారు. జ‌గ‌న్ కు జిల్లాలో ఫిరాయింపుల‌పోటు త‌గిలింది, ఆయా సెగ్మెంట్ల గుండా పాద‌యాత్ర జ‌రుగ‌నుంది.రాజమండ్రి, అమలాపురం, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా టూర్ ను ప్లాన్ చేశారు వైసిపి శ్రేణులు. రోజుకు 13 నుంచి 15 కిలోమీటర్ల దూరం జగన్ నడుస్తారని, పాద‌యాత్ర‌లో  అన్ని వర్గాల ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలు వింటారని వైసిపి వర్గాలు తెలియచేశాయి.

Image may contain: 11 people, people smiling, people standing

ఇక ఇప్ప‌టికే రోడ్ కం రైల్వేబ్రిడ్జ్ పై పాద‌యాత్ర‌కు అనుమ‌తులు ఇచ్చారు.. అలాగే తెలుగుదేశం పార్టీ నాయ‌కులు జ‌గ‌న్ కు జిల్లాలో ఎటువంటి మ‌ద్ద‌తు వ‌స్తుందా అని నేత‌లు ఆలోచ‌న‌లో ప‌డ్డారు...ముఖ్యంగా వైసీపీ పార్టీ గుర్తుపై గెలిచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిన ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో జగన్ ఎటువంటి స్పీచ్ ఇస్తాడో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Image may contain: 4 people, people smiling, people sitting

ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉండటంతో జగన్ కాపులకు కీలక హామీ ఇస్తున్నట్లు పార్టీ అంతర్గత నాయకులు నుండి సమాచారం. గత ఎన్నికల్లో చంద్రబాబును నమ్మి మోసపోయిన కాపులు జగన్ వైపు…. ఆయన ఇచ్చే హామీల వైపు ఎదురు చూస్తున్నారు. మరి జగన్ కాపులకు ఎటువంటి హామీ ఇస్తారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: