చిన్న పిల్లల్ని చూస్తే..ఎంతటి కఠినాత్ముడికైనా ముద్దు అనిపిస్తుంది. కానీ ఈ మద్య బేబీ కేర్ సెంటర్లలో జరిగిన దారుణాలు చూస్తుంటే..తల్లిదండ్రుల వెన్నుల్లో వణుకు పుడుతుంది.  ఈ కాలంలో బిజీ లైఫ్..భార్యా భర్తలు సంపాదించే పనిలో ఉన్నారు..అయితే వారి పిల్లలను ఇంట్లో పెద్దల వద్ద ఉంచడమో..లేదా బేబీ కేర్ సెంటర్లో అప్పజెప్పడం జరుగుతుంది.  దాంతో ఎక్కడబడితే అక్కడ బేబీ కేర్ సెంటర్లు వెలిశాయి.  కానీ తల్లిదండ్రులు ఎంతో నమ్మకంగా తమ చిన్న పిల్లలను అప్పజెప్పిపోతే..కొంత మంది టేక్ కేరర్ లు పిల్లల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు..కొట్టడం తిట్టడం చేస్తున్నారు.

ఇలాంటి సంఘటనలు సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ అయ్యాయి. తాజాగా  చైనాలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..వివరాల్లోకి వెళితే వ్యక్తిగత పనుల రీత్యా  ఓ మహిళ  బయటికి వెళ్లడంకోసం తన ఎనిమిది నెలల బాబును బేబీ సిట్టర్ కు అప్పగించింది.  కానీ ఆ చిన్నారి తల్లిని వదిలి ఉండలేక గుక్కపట్టి ఏడుస్తున్నాడు..ఇంతలో లిఫ్ట్ లో ఉన్న బేబీ సిట్టర్ బాబును తీసుకుంది.. లిఫ్ట్ డోర్స్ క్లోజ్ చెయ్యగానే తనలోని క్రూరత్వాన్ని బయటకు తీసింది.

ఏడుస్తున్న బాబుపై ఒక్కసారిగా పిడిగుద్దులతో దాడి చేస్తూ.. చేతిలో ఉన్న సెల్ ఫోన్ తో బాబు తలపై కొట్టడమే కాకుండా కింద పడేసింది. మొత్తానికి ఏడుస్తున్న పసిప్రాణి ప్రాణం తీసేలా ప్రవర్తించింది ఓ మహిళ.  గుక్కపట్టి ఏడుస్తున్న  బాబుపై దారుణానికి పాల్పడింది. లిఫ్ట్ లో సీసీ కెమెరాలు ఉండటంతో ఆ మహిళ బాగోతం బయటపడింది.  ఇలాంటి సంఘటనలు చూసి తల్లిదండ్రులు భయాందోళనకు గురి అవుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: