ఈ మద్య టీఆర్ఎస్ నేతలకు హైకోర్టు షాక్ ల మీద షాక్ లు ఇస్తుంది.  అసెంబ్లీ సమావేశాల సమయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ పై వచ్చిన ఆరోపణలు కొట్టేసింది..తాజాగా టీఆర్ఎస్ నేత, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు వివేక్ వెంకటస్వామికి షాక్ ఇచ్చింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది.
Image result for hca PRESIDENT VIVEK
వివేక్ విషయంలో అంబుడ్స్ మెన్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని స్పష్టం చేసింది. అంతే కాదు ఈ విషయంలో పూర్తి విచారణను చేపట్టాలని డివిజన్ బెంచ్ ఆదేశించింది. అప్పటి వరకు ప్రెసిడెంట్ పదవిలో వివేక్ కొనసాగరాదని ఆదేశించింది.గతంలో హెచ్సీఏ ప్రెసిడెంట్ గా ఉన్న వివేక్ అవినీతికి పాల్పడుతున్నారంటూ కార్యదర్శి శేషునారాయణ, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్ తదితరులు పిటిషన్ వేశారు. 
Image result for HIGH COURT AP
అంతే కాదు హెచ్సీఏ ప్రెసిడెంట్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడిగా రెండు పదవులను అనుభవిస్తున్నారంటూ పిటిషన్ లో పేర్కొన్నారు.  మొదట విచారణ చేసిన సింగిల్ బెంచ్ వివేక్ కి అనుకూలమైన తీర్పు ఇచ్చింది..కానీ ఇప్పుడు హైకోర్టు వివేక్ ను అనర్హుడిగా ప్రకటించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: