వైఎస్ఆర్ సీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర తూర్పు గోదావరి జిల్లాలోకి అడుగుపెట్టింది. అశేష జనవాహిని మధ్య ఆయన యాత్ర రాజమండ్రి చేరుకుంది. పశ్చిమగోదావరి నుంచి తూర్పుగోదావరిలోకి ప్రవేశించే సమయంలో గోదావరి వంతెన జనసంద్రంతో ఊగిపోయింది.


తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి.. 2019లో వైసీపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ప్రతిపక్షనేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పల్లెలు, పట్టణాలు, జిల్లాలు దాటుకుని పరవళ్లు తొక్కుకుంటూ ముందుకు సాగుతున్న గోదారిలా తరలిపోతోంది. పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు నెలరోజులు పాటు సాగిన జగన్  పాదయాత్ర .. రోడ్ కం రైల్వే బ్రిడ్జిమీదుగా తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. అశేష అభిమానులు వెంటరాగా.. జగన్ అడుగులు ముందుకేశారు.  గోదావరిలో నాటుపడవాలు ,లాంచీలతో వైసీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. గోదావరిలో సుమారు 600 పడవులపై పార్టీజెండాలు రెపరెపలాడాయి.


కోటపల్లి బస్టాండ్ సెంటర్ లో అశేష జనం మధ్య ప్రసంగించిన జగన్.. తెలుగుదేశం పార్టీ నాలుగేళ్ల పాలనపై ధ్వజమెత్తారు. చంద్రబాబు విధానాలను ఎండగట్టారు. త్వరలోనే  రాజన్న పాలన వస్తుందని.. మీ కష్టాలు తొలగిపోతాయని జగన్ హామీ ఇచ్చారు. జగన్ ప్రజాసంకల్పయాత్ర వైసీపీ శ్రేణుల్లో రెట్టించిన ఉత్సాహాన్నిస్తోంది. యాత్రకు వస్తున్న అనూహ్య స్పందన.. అపూర్వస్వాగతాలే అందుకు  నిదర్శనం... మొదట్లో రాయలసీమ మినహా జగన్ కు స్పందన అంతంతమాత్రమే అనే ప్రచారం జరిగింది..అయితే తెలుగుదేశం కంచుకోటలైన గుంటూరు, కృష్ణ,పశ్చిమ గోదావరిజిల్లాల్లో వచ్చిన స్పందన..  ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాల్లో వెల్లువెత్తిన అభిమానం ప్రజా సంకల్పయాత్ర  సృష్టించిన ప్రభంజనం అని వైసీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. జగన్ ఒక్కో అడుగు...తెలుగుదేశం పాతనానికి నాంది అంటూ వైసీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


ప్రజాసంకల్పయాత్ర మొదలైన తొలిరోజుల్లో వైసీపీ పార్టీ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది..ముఖ్యంగా పార్టీ  నేతలకు అభద్రతా భావం ఎక్కువగా ఉండేది..జగన్ జైలుకెళ్తారు. పార్టీ  పుంజుకోవడం కష్టమనే ప్రచారం జరిగింది. ఆక్రమంలోనే పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు..ముగ్గురు ఎంపీలు.. కొంతమంది కీలక నేతలు.. అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే జగన్ పాదయాత్ర రాయలసీమను దాటిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది.  తెలుగుదేశం కంచుకోటల్లోనూ పాదయాత్రకు వస్తున్న స్పందన పార్టీలో మళ్లీ ఆత్మవిశ్వాసాన్ని నింపడమే కాదు. వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకుంటామనే భరోసా ఇచ్చింది అప్పటి నుంచి పార్టీలో వలసలు ఆగిపోయాయి..తెలుగుదేశం పార్టీపై విమర్శల బాణాలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా ప్రత్యేకహోదాపై వైసీపీ తీసుకున్న స్టాండ్ పార్టీ పట్ల  ప్రజల్లో పార్టీపై విశ్వాసాన్ని పెంచింది. జగన్ నాయకత్వానికి మంచి మార్కులు పడ్డాయి.  వైసీపీ ఎంపీల రాజీనామా అంశం..తెలుగుదేశం పార్టీని కూడా ఆలోచనలోకి పడేసింది. ప్రత్యేకహోదా ఉద్యమంలో అధికార పార్టీని ఓవర్ టేక్ చేసిన వైసీపీ .. అదే హోదాపై టీడీపీని నిలదీస్తోంది.


అన్నింటికీ మించి జగన్ గత ఏడునెలలుగా ప్రజల్లోనే ఉండడం పార్టీకి ప్లస్ అయింది. పాదయాత్రలో అన్ని వర్గాలను ప్రజలను ఆకట్టుకుంటున్న జగన్.. ఓవైపు టీడీపీ వైఫల్యాలను విమర్శిస్తూనే..మరోవైపు  వైసీపీ అధికారంలోకి వస్తే.. చేపట్టబోయే కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ ముందుకు సాగుతున్నారు.  స్థానిక సమస్యలకు పెద్ద పీట వేస్తూ... వారికి మామీలు ఇచ్చుకుంటూ కదులుతున్న జగన్ కు అడుగడుగునా జనం బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే తెలుగుదేశం పార్టీకి కంచుకోటల్లోనే జగన్ కు అంతలా స్పందన వస్తుందనేది రాజకీయ విశ్లేషకులు వాదన. తూర్పు గోదావరి జిల్లాలో జగన్ పాదయాత్ర రాజకీయ మార్పుకు కారణమవుతుందా.. ? అశేష అభిమానం..  ఓట్లు కురిపిస్తుందా.. లేక జగన్ క్రౌడ్ పుల్లర్ గానే మిగులుతారా అనేది ప్రజల చేతుల్లోనే ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: