ఈ మద్య మనుషులు చేస్తున్న దారుణమైన పనుల వల్ల పశు పక్ష్యాదులే కాదు..ప్రకృతి కూడా పూర్తిగా నాశనం అవుతుంది. తాజాగా  రోడ్డు పనుల్లో దారుణమైన నిర్లక్ష్యం చేసి ఓ శునకం మృతికి కారణం అయ్యారు. అయితే శునకం చనిపోవడం అంత పెద్ద విషయమా అని ప్రశ్నలు తలెత్తవొచ్చు..కానీ ఇది సాధారణమైన మరణం కాదు..దారుణమైన మరణం.  కేవలం మనుషుల నిర్లక్ష్యం ఇంత దారుణంగా ఉంటుందా అన్న విషయాన్ని బయట పెట్టే విషయం.  


వివరాల్లోకి వెళితే..యూపీలోని థానా పోలీసు స్టేషన్ పరిధిలోని ఫూల్ సయ్యద్ చౌరస్తా వద్ద రోడ్డు పక్కన నిద్రిస్తున్న కుక్కపై రోడ్డు వేశారు. దీంతో ఆ శునకం బాధతో విలవిలలాడుతూ చనిపోయింది. విషయం తెలుసుకున్న ‘పీపుల్స్ ఫర్ యానిమల్స్’ సభ్యులు ఆ శునకాన్ని బయటకు తీసి, ఖననం చేశారు. 


కాగా, ఫుట్‌పాత్ పక్కన నిద్రిస్తున్న ఒక శునకంపై మరుగుతున్న తారు పోయడంతో దాని ప్రాణాలు తీయడం అనే విషయాన్ని కూగా గమనించకుండా పనులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పీపుల్స్ ఫర్ యానిమల్స్ వారు కోరుతున్నారు. 


ఈ ఉదంతంపై ‘పీపుల్స్ ఫర్ యానిమల్స్’ సంస్థ సంబంధిత రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్న కంపెనీ, పీడబ్ల్యూడీ శాఖలపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ సమాచారాన్నివారు కేంద్రం దృష్టికి కూడా తీసుకువెళ్లారు. ఈ ఘటనకు కారకులైనవారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: