తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కి రోజుకో ట్విస్టులు ఎదురవుతున్నాయి...ఇప్పటికే ఓటుకు నోటు కేసులో బుక్ అయ్యి నానా తంటాలు పడుతున్న బాబు గారికి కేంద్రం రోజుకో షాకులిస్తోంది. మరో పక్క ప్రతిపక్షనేత జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర తో రాష్ట్రంలో దూసుకుపోతున్నారు. మరియు అదే విధంగా గత ఎన్నికలలో చంద్రబాబు ఇచ్చిన అబద్ధపు హామీలతో మోసపోయిన ప్రజలు చంద్రబాబు పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

Image result for chandrababu

ఈ పరిస్థితుల మధ్య చంద్రబాబు ఏం చేయాలో అర్థం కాక నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ప్రజలలో అభాసుపాలవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల  జరిగిన పార్టీ నాయకుల సమన్వయ భేటీలో చంద్రబాబు టిడిపి నాయకుల పై ఫైర్ అయ్యారు. ప్రతి రోజూ ఎవరేం చేస్తున్నారో అన్ని రిపోర్ట్స్ తన దగ్గర ఉన్నాయన్న బాబు… ఇకపై తాను తీసుకునే చర్యలకు నేతలే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Related image

2019 జనరల్ ఎలక్షన్లకి ఏడాది సమయమే ఉన్నందున ఇకపై ఎవరి నిర్లక్ష్యాన్ని ఎంత మాత్రం ఉపేక్షించబోనని తేల్చిచెప్పారు. కొందరు నేతలు తానేమీ పట్టించుకోవటం లేదనుకుని ఏదైనా చేయొచ్చు అనే భావనలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Image result for chandrababu

దీంతో వ్యాఖ్యలపై సమావేశంలో పాల్గొన్న కొంతమంది తెలుగుదేశం నేతలు అబద్ధాలు అతను చెప్పి అధికారంలోకి వచ్చి ఆ వ్యతిరేకతను మనం ఎదుర్కొంటుంటే మనపైనే నిందలు వేస్తార అంటూ తమలో తాము ప్రశ్నించుకుంటున్నారు. మరోపక్క కొంతమంది టిడిపి నేతలు వచ్చే ఎన్నికలలో కచ్చితంగా ఓటమిపాలు అవుతాడని చంద్రబాబు ఇటువంటి సమావేశాలు నిర్వహించి ఆ ఓటమిని తెలుగుదేశం నేతలపై వెయ్యాలని చూస్తున్నారంటూ పేర్కొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: