ప్రపంచంలో ఎవరూ ఊహించని పరిణామాం..మొన్నటి వరకు సోషల్ మీడియాలో కొనసాగిన ఉత్కంఠకు మొన్న తెరపడింది. ఇప్పటి వరకు రెండవ ప్రపంచ యుద్దంతో ఎంతో నష్టపోయాం..ఇప్పుడు మూడో ప్రపంచ యుద్దం వస్తే మరెంత ప్రమాదం ఉంటుందో ఊహించుకోవొచ్చు.  అయితే మూడో ప్రపంచానికి మూల కర్త ఎవరూ అంటే వెంటనే చెబుతారు..ఉత్తర కొరియా అధ్యక్షుడు కీమ్.  ఆయనకు ఢీ అంటే ఢీ అంటూ వస్తున్న మరో వ్యక్తి ట్రంప్.  అనుయుద్దానికి సిద్దం అంటూ వీరిద్దరి హడావిడితో ప్రపంచ దేశాల్లో భయం నెలకొంది.  కానీ అన్ని రోజులూ ఒకేలా ఉండవు..ప్రపంచంలో ఏదైనా సాద్యమే అన్న విధంగా ట్రంప్, కీమ్ ఒకేచోట కలిశారు..ఆలింగనం చేసుకున్నారు..ఒకరి విషయాలు భాష రాకున్న చెప్పుకున్నారు. 

వాస్తవానికి యూఎస్ అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ భేటీ కావడమే ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ పర్యటనలో మరిన్ని ఆశ్చర్యకర విషయాలు చోటుచేసుకున్నాయి. కిమ్ తన ఆరోగ్య సమస్యలను పశ్చిమదేశాలు తెలుసుకోకుండా ఉండే నిమిత్తం అత్యాధునిక మొబైల్ టాయిలెట్ ను వెంట తీసుకెళ్లిన విషయం తెలిసిందే.
Image result for president trump and kim jong un shown car
దక్షిణ కొరియా పత్రికలో వెలువడ్డ ఈ కథనం ఆశ్చర్యం కలిగించింది.  ఇదిలా ఉంటే..  కిమ్- ట్రంప్ భేటీ అనంతరం లంచ్ చేసిన తర్వాత  మరో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది.  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాడే కారు ది బీస్ట్ (కాడిలాక్ వన్) ప్రపంచంలోనే అత్యాధునిక కారు అని అంటారు. సైనిక, రసాయనిక దాడినైనా తట్టుకొనే విధంగా బీస్ట్ ను డిజైన్ చేశారు.ఈ వాహనం దరిదాపుల్లోకి కూడా ఎవరినీ రానీయరు. అటువంటిది, ఉత్తర కొరియా అధ్యక్షుడిని ట్రంప్ స్వయంగా తీసుకెళ్లి బీస్ట్ లోపల ఎలా వుంటుందో చూపించారు.
Image result for president trump and kim jong un shown car
ట్రంప్-కిమ్ లంచ్ అనంతరం అక్కడి పోర్టికోలో ఉన్న బీస్ట్ వద్దకు వెళ్లారు. ట్రంప్ వెంటే ఉండే ఓ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ బీస్ట్ కారు డోర్ తెరచి లోపలి భాగాలను కిమ్ కు చూపించడం గమనార్హం.  సాధారణంగా ఎవరినీ ఆ కారు దరిదాపుల్లోకి కూడా తీసుకు వెళ్లరు..ఎందుకంటే కారు రహస్యాలు తెలుస్తాయని..కానీ ట్రంప్ మాత్రం కీమ్ కి చూపించడం చర్చనీయాంశం అయ్యింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: