భారత దేశంలో ప్రముఖ చెస్ క్రీడాకారిణి, ఏపీ గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది.ఏడు సంవత్సరముల వయసులోనే చదరంగం నేర్చి ఆసియా ఖండపు పది సంవత్సరాలలోపు వయస్సు (U-10) మరియు పన్నెండు సంవత్సరాలలోపు వయస్సు (U-12) పోటీలలో మొదటి స్థానము సంపాదించింది.

ముంబై లో 2003లో జరిగిన కామన్ వెల్త్ చదరంగపు క్రీడలలో మహిళా విభాగములో రెండవ స్థానము పొందింది.   తాజాగా సివిల్ ఇంజినీర్ కార్తీక్ చంద్రను ఆగస్టు 19న వివాహమాడనుంది. హారిక విషయానికి వస్తే 1991 జనవరి 12న గుంటూరులో జన్మించింది. చిన్నప్పటి నుంచే చెస్‌పై ఇష్టం పెంచుకున్న హారిక అండర్‌-9 నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించింది. ఆ తర్వాత పలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఎన్నో పతకాలు సాధించింది. కోనేరు హంపి తర్వాత గ్రాండ్‌ మాస్టర్‌ హోదాను పొందిన రెండో మహిళా క్రీడాకారిణి.

ఈ నెల 18 న హైదరాబాద్‌లో హారిక వివాహ నిశ్చితార్థ కార్యక్రమం జరగనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.2011లో గ్రాండ్ మాస్టర్ హోదాను సొంతం చేసుకుంది. 2012, 2015, 2017 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో కాంస్య పతకాలు సాధించింది. ప్రపంచ నంబర్ వన్‌గా ఎదగాలన్నదే తన లక్ష్యమని హారిక పలుమార్లు పేర్కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: