అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి విశాఖ జిల్లాలో పలువురు టీడీపీ నేతలకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. తన రాజకీయ పయనం  ఏంటో చెప్పకుండా సస్పెన్స్ లో పెడుతూ ఓ  ఆట ఆడుకుంటున్నారు. విశాఖ నగరానికి మేయర్ గా పనిచేసిన హరిని టీడీపీ అధినాయకత్వం పార్టీలోకి ఆహ్వానించిందని చాలాకాలంగా ప్రచారంలో ఉంది. విశాఖ పార్లమెంట్ సీటు తో పాటు విశాఖ ఉత్తరం, జిల్లాలోని అనకాపల్లి, మాడుగుల అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఏది ఎంచుకున్నా  టిక్కెట్ ఇవ్వడానికి రేడీ అని చంద్ర‌బాబునాయుడు చెప్పారంటూ ప్ర‌చారంలో ఉంది. హరి కూడా టీడీపీలో చేరుతున్న‌ట్లు తన పుట్టిన రోజు వేడుకల సందర్భంగా సంకేతాలు ఇచ్చారు. అయితే ఎప్పుడు చేరుతారన్న విష‌యాన్ని తేల్చక పోవడంతో అటు టీడీపీ హై కమాండ్ తో పాటు టీడీపీ నేత‌ల్లో టెన్షన్ పెరిగిపోతోంది.  

హరి కధ ఇలా.. !

Image result for sabbam hari & chandrababu

జిల్లా వ్యాప్తంగా సబ్బం హరి తన కంటూ సొంత బలం కలిగిన నాయకుడు. టీడీపీ అధినేత చంద్రబాబుతో నేరుగానే మాట్లాడే సాన్నిహిత్యం కలిగిన హరి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానంటున్నారు. లోక్ సభ కు వెళ్ళేది లేదని అసెంబ్లీకే పోటీ చేసి మంత్రి కావడమే తమ నాయకుని లక్ష్యమని అనుచరుల టాక్. తమ నాయకుడు తొందరగా పసుపు కండువా కప్పేసుకుని టీడీపీలో చేరిపోతే తాము కూడా అధికార పార్టీలో చ‌క్రం తిప్ప‌వ‌చ్చ‌ని అనుచరుల అలోచన. హరి మాత్రం తాపీగా రాజకీయం చేద్దామన్న వైఖరితో ఉన్నారు. రాజకీయ లాభాలను బేరీజు వేసుకుంటూ అచీ తూచీ అడుగులు వేయాలనుకుంటున్నారు. ఇక్కడే హరితో అటు అనుచరులకే కాదు, టీడీపీ నాయకులకూ పేచీ వస్తోంది. 

ఉత్తరంపై పలువురి చూపు
విశాఖ ఉత్తర నియోజక వర్గంపై టీడీపీలో పలువురు ఆశావహులు అప్పుడే కర్చీఫ్ వేసేశారు. వారిలో మొదటిగా ఎలమంచిలి సిట్టింగ్ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వున్నారు. ఆయన 2019 ఎన్నికలలో ఇక్కడే పోటీకి దిగాలని గట్టిగా డిసైడ్ అయ్యారు. తన సామాజిక వర్గమైన కాపులు ఇక్కడ అధికంగా ఉండడంతో పాటు, తాను కూడా అదే నియోజక వర్గంలో నివాసం ఉండడం తో అన్ని విధాలుగా బాగుంటుందని రమేష్ బాబు యోచిస్తున్నారు. ఇక స్థానికంగా అనేకమంది టీడీపీ నేతలు ఆ సీటుని ఆశిస్తున్నారు. వీరందరికీ హరి రాజకీయమే అంతు చిక్క
కుండా ఉంది.

అయనతో కిరి కిరే !

Image result for sabbam hari & chandrababu

సబ్బం హరి తో కిరి కిరే నని టీడీపీ నేతలు వాపోతున్నారు. పార్టీలో చేరకుండానే రాజకీయం చేస్తున్నారని, తీరా టిడిపిలోకి వ‌చ్చిన త‌ర్వాత ఇంకెన్ని చిత్రాలు చూపిస్తారోనని ప‌లువురు కంగారు పడుతున్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి వైసీపీలోకిదూకిన హరి అక్కడ జగన్ తో చెడి బీజేపీకి మద్దతు పలికిన విష‌యం అందరికీ తెలిసిందే. త‌ర్వాత తాజాగా టీడీపీ అంటున్నారు. రేపటి రోజున మళ్ళీ జగన్ పిలిస్తే వైసీపీ  వైపు కూడా  వెళ్తారేమోనన్న అనుమానలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా స‌బ్బం హ‌రి టిడిపిలో చేరే విష‌యం మాత్రం త‌మ్ముళ్ళ‌ల్లో కంగారు పుట్టిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: