ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ  రాష్ట్రంలో రాజకీయ నాయకులలో  ఉత్కంఠత పెరుగుతోంది. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తాను పాల్గొంటున్న ప్రభుత్వ కార్యక్రమాలనే ఎన్నికల ప్రచారపర్వానికి ఉపయోగించుకుంటూ తన అభివృద్ధి పనులే విజయమంత్రంగా భావిస్తూ జనాలకు దగ్గరవుతున్నాడు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించలేదు. అయితే ఆయన ప్రస్తుతం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని అనుకున్నట్లు తెలుస్తుంది.


ఇందు విషయమయే రాష్ట్రంలోని పదమూడు జిల్లాలో 75 బహిరంగ సభలను నిర్వహించి ప్రజలకు మరింత చేరువకావడానికి నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ మేరకు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ సభల్లో ముఖ్యంగా రైతులే తమ టార్గెట్లుగా పెట్టుకోవాలని చంద్రబబు నేతలకు పలు సూచనలు చేసినట్లు సమాచారం. ఎందుకంటే గతంలోనూ రైతురుణాల మాఫీ పేరిట వారు టీడీపీని గెలిపించారు. చేసిన కొద్ది రుణమాఫీలు ఈ సభలలో బాగా హైలైట్ చేయాలని బాబు చెప్పినట్లు సమాచారం. అంతేగాక టీడీపీ హయాంలో పూర్తయిన ప్రాజెక్టులను, వాటి లాభాలను ఒకొక్కటి వారి వారి ప్రాంతాలలో వివరించాలని ఆదేశించారట.


కాగా ఈ సభలను నిర్వహించడానికి నియోజకవర్గ ఇన్ ఛార్జీలను నియమించారట. ఇంతటితో ఆగకుండా వారిపై నిఘాను కూడా ఉంచుతున్నారు. నలభై ఐదు రోజులకోసారి ఇన్ ఛార్జీల పనితీరు, వ్యవహారశైలిపై కార్యకర్తల అభిప్రాయం తీసుకుంటారు. వాటిని ఆధారంగా చేసుకొని ఇన్ ఛార్జీలను మందలించడమా లేక వారి స్థానాల్లో వేరే వాళ్ళను నియమించడమా అనునది జరగాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. జగన్ చేస్తున్న పాదయాత్రకు ధీటుగా, ప్రజలు చిరకాలం గుర్తుంచుకునేలా ఈ సభలను నిర్వహించాలని బాబు కార్యకర్తలకు దిశానిర్దేశం చేసాడంట.


మరింత సమాచారం తెలుసుకోండి: