“గుడ్దివానికి కుంటివాడు తోడు, అలాగే కుంటివాడికి గుడ్డివాడు తోడులా ఉంది కొన్ని చోట్ల ప్రాంతీయ రాజ కీయ పార్టీల పరిస్థితి”  ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ లో బిజెపిని ఎదుర్కోవాలంటే, రెండు స్థానిక ప్రాంతీయ పార్టీలు సమాజవాది, బహుజన సమాజవాది పార్టీలు కలసి పోటీ చెయ్యాల్సిన అగత్యముంది. అప్పుడే అది సమ ఉజ్జీ అవుతుంది.

Image result for tdp congress alliance

కాని వాటిమద్య సైద్ధాంతిక బేధం వదిలేసి పార్టీల స్వరూప స్వభావాలను త్యాగం చేయాలి.  అంటే గెలుపు ప్రధాన రాజకీయాలన్న మాట. ఎందుకంటే బలమైన బిజెపి ని ఓడించాలనేదే ప్రధాన ఉద్దేశ్యం. పరస్పర రాజకీయ ప్రయోజనలు చూసుకోవటం తప్ప, ప్రజలకు యోగ్యత ఒనగూరేది కనిపించదు. అంతేకాదు వీటి స్వరూపం మరల మారదన్న నమ్మకంగాని విశ్వాసంగాని ప్రజలకు కలిగించలేవివి. అధికారం పంచుకోగానే ఎం జరుగుతుందో ఇప్పుడు పదవుల పంపకం కోసం జరిగే కొట్లాట కళ్ళకు కనబడు తూనే ఉంది రాజకీయ కర్ణాటకం రూపంలో. ఇదంతా అధికారం కోసం వెంపర్లాట తప్ప ప్రజాశ్రేయస్సుకు ఏమాత్రం కాదు.

Image result for tdp congress alliance

అలాగే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉన్న పరిస్థితుల్లో తనకున్న వ్యక్తిగత రాజకీయ సమస్యల నుంచి గట్టెక్కాలంటే, ఆయనకు కేంద్రంలో సత్తా చాట గల ఒక బలమైన పార్టీతో పొత్తు పెట్టుకోవాలాని ఉవ్విళ్ళూరుతున్న పరిస్థితి. ఇక్కడ సంబంధం అక్రమమా? సక్రమమా? అనే ప్రశ్నే ఉండదు ఇది ఖచ్చితంగా రాజకీయ అవసరం. అదీ చంద్రబాబుదే కాబట్టి. ఈ క్రమం లో చంద్ర బాబు కు దేశవ్యాప్తంగా ఒకటి రెండు చోట్ల ఉనికి కలిగి ఉన్న కాంగ్రెస్ పార్టీ తప్ప మరో అగత్యం లేదు. తాజా పరిస్థితుల్లో కాంగ్రెస్ కూడా ఆంధ్రప్రదేశ్ లో నిరాధారంగా ఉంది. శూన్యం నుండి ఎదగాల్సిన పరిస్థితి దానిది.


ఇక చంద్రబాబు చేతిలో మోసపోవటానికి ఈ దేశంలో ఏ పార్టీ కూడా సిద్ధంగా లేని స్థితి. అయితే వారు వీరూ కూడ బలుక్కొని ఒకరికొకరు అక్రమంగా నైనా దగ్గర అవుదామ నే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ లెక్కన చంద్రబాబు కుతంత్రంలో చిక్కుకోవటానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నందుకు ఎంతో ఆనందంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే మరో శలభం మోసపోవడానికి సిద్దంగా దొరికిందన్న కామెంట్స్ సంగతి కాసేపు పక్కనపెడితె, ఆ అక్రమ బందం మరింత బలంగా ముడి వేసుకోనుందనటానికి ఒక తాజా ఉదాహరణ వెలుగులోకి వచ్చింది.

Image result for tdp congress alliance

మొన్న కర్ణాటకలో రాహుల్ గాంధి– సోనియా గాంధి తో వేదిక పంచుకున్న నారా చంద్ర బాబు నాయుడు ను మరింత దగ్గర చేసుకోవాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉండగా, జాతీయ స్థాయిలో తనకు “ఏదో గంతకు తగ్గ బొంత లాంటి కాంగ్రెస్ అండ” మాత్రమైనా లేకుంటే ఇబ్బందులు తప్పవని భావించి దగ్గరవుదామను కుంటున్న చంద్రబాబు కు, కాంగ్రెస్ నుండి ఇఫ్తార్ విందుకు ఆహ్వానం అందింది.


రేపు దేశ రాజధానిలో కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోయే ఇఫ్తార్ విందుకు, ములాయం సింగ్ యాదవ్, శరద్ పవార్, లాలు ప్రసాద్ యాదవ్ లతో పాటు చంద్రబాబు నాయుడుకు కూడా రాహుల్ గాంధీ ఆహ్వానం పంపినట్లు తెలుస్తుంది. దేశ వ్యాప్తం గా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు నిరసనగా, తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా నాడు పద్మశ్రీ నందమూరి తారక రామారావు సృష్టించిన తెలుగుదేశంపార్టీ, ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీకి పాదపద్మాల వద్ద తన ఆత్మగౌరవాన్ని (చంద్రబాబు స్వార్ధ మే పరమార్ధంగా, భావించిన తరుణాన) టీడీపీ సమర్పించే దిశగా కొనసాగుతున్న పరిస్థితులు తమ్ముళ్లకు నచ్చినా నచ్చకున్నా, జనాలు ఏమనుకున్నా సరే, చీము -రక్తం, సిగ్గూ-ఎగ్గూ వదిలేసి స్నేహం చేయాలని చంద్రబాబు బావిస్తున్నారనేది అని స్పష్టం.

Image result for chandrababu met sonia rahul in bangalore

ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదెశ్ ప్రజల అభీష్టానికి విరుద్ధంగా చీకట్లో చీల్చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజల అత్మాభిమానాన్ని మరోసారి చంపేసినా, చంద్రబాబు రాజకీయ అవసరాల కు వారికి దగ్గరవటం తెలుగు ప్రజలు హర్షిస్తారా? అనేది ప్రధాన ప్రశ్న. 


ఏది ఏమైనా, రేపు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు చంద్రబాబు ఢిల్లీకి వెళతాడా? లేదా? అన్న విషయం రాజకీయ వర్గాల్లో అమితాశక్తిని రేపుతుంది. ఈ విషయంపై రేపు తేలిపోతే,  2019లో చంద్రబాబు రాజకీయం మీద మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు! ఈ లోగా పచ్చపత్రికలు తన వార్తల తీరును “చంద్రబాబు టిడిపి- రాహుల్ కాంగ్రెస్” కలయిక ఒక చారిత్రాత్మక అవసరం అనేలా మార్చెసే దిశగా ప్రజలను సంసిద్ధులను చేయటాని కి  ఉద్యుక్తులై వార్తలను వండి వార్చేస్తుందని  సమాచారం. దాన్ని బట్టి మనం ముందుగానే పరిస్థితులను అర్ధం చేసుకోవచ్చు.

Image result for chandrababu met sonia rahul in bangalore

మరింత సమాచారం తెలుసుకోండి: