విశాఖ‌ప‌ట్నం విమానాశ్ర‌యానికి సంబంధించి బిజెపిటిడిపిల మ‌ధ్య కొత్త పంచాయితీ మొద‌లైంది. పౌర విమానాల టేకాఫ్, లాండింగ్ టైమింగ్ షెడ్యూల్ ను నేవీ కుదించడం ఇపుడు పెద్ద దుమారాన్నే రేపుతోంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో కేంద్రానిదే తప్పంటూ అపుడే తెలుగు తమ్ముళ్ళు గుస్సా అవుతున్నారు. నిజానికి రక్షణ నిబంధనల మేరకు ఇండియన్ నేవీ తన పక్కనే వున్న విమానాశ్రయం పని వేళలలో కొన్ని  సవరణలు కోరింది.  సవరించిన మేరకు  ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి కొత్త షెడ్యూల్ అమలులోకి వస్తుందని, అది కూడా నేవీ ఉన్నతాధికారులు ఆమోదం తెలిపితేనే అంటూ వివరణ కూడా ఇచ్చింది. విషయం ఇలా ఉంటే విశాఖ విమానాశ్రయం అభివ్రుధ్ధి చెందడం కేంద్రంలోని బీజేపీ సర్కార్ కి ఇష్టం లేదని, అందువల్లనే విమానాలు  తిరక్కుండా అడ్డుకుంటున్నారని  తెలుగుదేశం నేతలు ఓ రేంజిలో రెచ్చిపోతున్నారు. 


బాబుకు ఫిర్యాదు 

Image result for chandrababu

కేంద్రంతో కటీఫ్ చెప్పిన తరువాత ఇలా  ఏపీపై కక్ష సాధిస్తున్నారని ప్రభుత్వ విప్, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే  గణబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ పారిశ్రామికంగా ప్రగతి సాధించడం బీజేపీకి అసలు ఇష్టం లేదని ఆయన విమర్శించారు. దీనిని ఇంతటితో వదిలేది లేదని, తమ నాయకుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళి కేంద్రంతోనే తేల్చుకుంటామని హెచ్చరించారు.


అన్నీ మా నెత్తి మీదేనా !

Image result for పీవీఎన్ మాధవ్

ఈ వివాదంపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్  రాష్ట్రంలో ఏం జరిగినా   త‌మ‌నెత్తినే వేస్తారా అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. అది పూర్తిగా నేవీకి సంబంధించిన వ్యవహారమైతే దాంట్లో కేంద్రం తప్పేం ఉందంటూ తమ్ముళ్ళను నిలదీశారు. ఏపీలో పాలన ఎలాగో గాలికి వదిలేసారు. ఇపుడు దాన్నంతా తీసుకువచ్చి బిజెపిపై బురద జల్లుతున్నరంటూ ఫైర్ అయ్యారు. బోడి గుండుకు మోకాలికి ముడి పెట్టడం టీడీపీ నాయకులకే సాధ్యమని సెటైర్లు వేశారు.


రైల్వే జొన్ ఖాయం
రైల్వే  జోన్ అంటూ దీక్షల పేరిట టీడీపీ ఎంపీలు నాటకాలు ఆడుతున్నారని మాధవ్ అటాక్ చేశారు. వారు ఎన్ని చేసినా రైల్వే జోన్ ఇచ్చేది బీజేపీ మాత్రమేనని,  అతి తొందరలోనే విశాఖ జోన్ ప్రకటన వెలువడుతుందని క్లారిటీ ఇచ్చేశారు.  టీడీపీకి రాజకీయాలే కావాలని, బీజేపీకి ఏపీ ప్రగతి కావాలని అంటూ ఎవరేంటన్నది జనం త్వరలోనే తెలుసుకుంటారంటూ తమ్ముళ్ళపై  పవర్ ఫుల్ పంచులే వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: