విశాఖపట్నం.. అంధ్రప్రదేశ్ లో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. ఉత్తరాంధ్రకు పెద్దదిక్కు. భవిష్యత్తులో ఐటి పరిశ్రమకు కేంద్రం కాబోతుందన్న కలలు ఉన్నాయి.  కానీ ఇంత వరకు అక్కడ పూర్తి స్థాయి ఎయిర్ పోర్ట్ లేదన్న విషయాన్ని  ప్రభుత్వాలు మర్చిపోయాయి. ఇంతకాలం నావీ వాళ్ల దయతోనే అక్కడికి విమానాలు నడుపుతున్నారు. ఆ నావీ.. శిక్షణలు.. ఇతరత్రా కార్యక్రమాల పేరుతో అంక్షలు విధిస్తే.. విమానాల రాకపోకలకు కత్తెరపడిపోతోంది. దీంతో ప్రయాణాలతకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఊరిస్తున్నా.. అది ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి.

Image result for vizag airport

విశాఖపట్నం.. ఒకరకంగా చెప్పాలంటే అంధ్రప్రదేశ్ లో ఉన్న ఏకైక అతిపెద్ద నగరం.. రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. స్టీల్ ప్లాంట్, పోర్టు.. షిపియార్డ్ లు వైజాగ్ కి ప్రధాన హంగులు. విశాఖలో ఫార్మాసిటీ అభివృద్ధి చెందుతోంది. ఇప్పుడు ఐటి హబ్ గా కూడా ఈ పోర్ట్ సిటిని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఉత్తరాంధ్రకు పెద్ద దిక్కు కూడా ఈ విశాఖపట్నమే.  అంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా విశాఖ అభివృద్ధితో ముడిపడి ఉన్న అంశమే. మరి ఇంతటి కీలక నగరానికి కనెక్టివిటీ చాలా ముఖ్యం.. దేశంలో ఎక్కడి నుంచైనా ఇక్కడికి సులభంగా రాగలగాలి.. ఎక్కడికైనా ఇక్కడి నుంచి సులభంగా వెళ్లగలగాలి. వైజాగ్ కి ఏం హైవే ఉంది, రైల్వే జంక్షన్. ఇంతకంటే ఏం కావాలి అంటారా..? మరి ఎయిర్ పోర్టు సంగతేంటి..? విశాఖపట్నానికి ఎయిర్ పోర్టు లేకపోవడం ఏమిటి..? అంత పెద్ద ఎయిర్ పోర్టు ఉంది కళ్లు కనిపించడంలేదా అంటారమో.. అయితే.. అది నావెల్ బేస్.. అంటే నావీ ఎయిర్ పోర్టు.

Image result for vizag airport

1981లో అప్పటి ప్రభుత్వం రిక్వెస్టు మేరకు నావీ ఎయిర్ పోర్టును సివిల్ అవసరాలకు వాడుకునేందుకు అనుమతిచ్చారు. అప్పటి నుంచి  ఆ నావీ ఎయిర్ పోర్టునే రెండు రకాలుగా వాడేసుకుంటున్నారు. ఓ నగరం అభివృద్ధి చెందాలంటే.. అంతర్జాతీయ స్థాయికి ఎదగాలంటే ఎయిర్ పోర్టు అంత్యం కీలకం. కానీ దాదాపు 35 ఏళ్ల నుంచి వైజాగ్ లో  ఓ సొంత విమానాశ్రయం ఏర్పాటు చేయడంలో మన ప్రభుత్వలు పూర్తిగా విఫలమయ్యాయి. నావీ ఎయిర్ పోర్టును వాడుకుంటూ నెట్టుకొచ్చేశారే తప్ప సొంత ఎయిర్ పోర్టు  ఊసే పట్టించుకోలేదు. అదే ఇప్పుడు విశాఖ అభివృద్ధికి పెద్ద చిక్కైపోయింది.  నావీ కంట్రోల్ లో ఉండటం వల్ల చాలా కాలం వరకు సాయంత్ర 6 తర్వాత విశాఖలో ఫ్లైట్ ల్యాండింగ్ కు   అవకాశమే ఉండేది కాదు.  ఆ తర్వాత ఆ ఆంక్షలను కొంత మేర సడలించారు. నావీ అంక్షల మధ్యే ఎయిర్ పోర్టు నడిపేస్తున్నారు తప్ప.. సొంత ఎయిర్ పోర్టు కోసం ఏనాడు అక్కడి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వాలు.. ప్రయత్నాలే చేయలేదు. అశోక్ గజపతి రాజు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు..  విశాఖలో అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుమతులు తీసుకొచ్చారు. కానీ నిర్మాణం పనులు భూసేకరణ దగ్గరే ఆగిపోయాయి. ప్రసుత్తం ఉన్న పరిస్థితుల్లో.. విశాఖ నుంచి హైదరాబాద్ కి వెల్లాలన్నా.. రావాలన్నా.. ఉదయం 8 గంటలకు ముందు, రాత్రి 10 తర్వాత లేదు. ఢిల్లీ వెళ్లాలంటే నాన్ స్టాప్ విమానాలు నాలుగంటే నాలుగే ఉన్నాయి.  మధాహ్నం 3 తర్వాత ఢిల్లీకి వెళ్లేందుకు ఏ విమానం లేదు. దేశ అర్థిక రాజధాని ముంబై కి వెళ్లాలంటే రెండే రెండు నాన్ స్టాప్ విమానాలు..  మిగతావన్నీ  ఇతర నగరాల్లో ఆగి వెళ్లేవే.

Image result for vizag airport

విశాఖ విమానాశ్రయం మీద తాజాగా నేవీ అధికారులు కొత్త అంక్షలు విధించారు. నేవీ పైలెట్లకు శిక్షణ నిమిత్తం.. సాధారణ విమానాల రాకపోకల్ని నిలిపేయాలంటూ నేవీ అధికారులు హుకుం జారీ చేశారు. అయితే తీవ్రమైన ఒత్తిడి రావటంతో మొదట ఐదు గంటలుగా ప్రకటించిన సమయాన్ని మూడు గంటలకు తగ్గించేందుకు అంగీకరించారు. ఇటువంటి పరిస్థితి మీద స్థానికులు తీవ్ర అందోళన వ్యక్తం చేస్తున్నారు.  విమాన ప్రయాణాలకు ఇబ్బంది కలిగితే.. అభివృద్ధి దెబ్బతింటుందంటున్నారు. గ్లోబలైజేషన్ దెబ్బతో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రయాణాలు  సర్వసాధారణమైపోయాయి.  ప్రధానంగా విశాఖపట్నం లాంటి అభివృద్ధి చెందుతున్న నగరాలకు  ఫ్లైట్ కనెక్టివిటీ సరిగ్గా లేకకపోవడం బాధాకరం. గతంలో ప్రపంచప్రఖ్యాత అంతర్జాతీయ యూనివర్శిటీలు కొన్ని విశాఖలో  తమ శాఖల్ని విస్తరించేందుకు ప్రయత్నించాయి. అయితే ఫ్లైయిట్ కనెక్టివిటీ సరిగ్గా  లేకపోవడం వల్ల ఆగిపోయాయి. విశాఖపట్నం సమీపంలోనే ప్రముఖ పర్యాటక కేందరం అరకు ఉంది. దేశవిదేశాల్లో ప్రచారం చేస్తే.. అరకును చూసేందుకు భారీగా యాత్రికులు తరలివస్తారు. విశాఖలో ఫ్లైట్ కనెక్టివిటీ చక్కగా ఉంటేనే ఇక్కడ పర్యాటకం కూడా అంతర్జాతీయ స్థాయికి విస్తరిస్తుంది. కానీ ఇక్కడ ఆ స్థాయి ఏర్పాట్లు కనిపించడం లేదు. మరోవైపు ఏపీ ప్రభుత్వం విశాఖను ఐటి హబ్ గా మారుస్తామని ప్రకటించింది. సరైన విమాన కనెక్టివిటీ లేకుండా ఐటీ కంపెనీలు కూడా ఇక్కడి  వచ్చేందుకు మొగ్గు చూపకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Image result for modi bjp

నిజానికి భోగాపురం దగ్గర అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు ప్రయత్నాలు మొదట చుర్గుగానే సాగాయి.. భూసేకరణకు వేగంగానే పావులు కదిపారు. అయితే భూసేకరణ విషయంలో కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి.  ఈ ఎయిర్ పోర్టు నిర్మాణానికి టెండర్లు కూడా పిలిచారు. ఎయిర్ పోర్ట్స్ అథార్టీ ఆఫ్ ఇండియా, జీఎంఆర్ సంస్థలు బిడ్లు కూడా వేశాయి. కానీ ఏపీ ప్రభుత్వం ఆ టెండర్లను క్యాన్సిల్ చేసింది. భోగాపురం ఎయిర్ పోర్టు మాటేమోగానీ.. ఆ చుట్టుపక్కల భారీగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వచ్చేశాయి. వేలాది ఎకరాల భూముల్లో ప్లాట్లు వేసేసి.. భారీ రేట్లకు అమ్మకానికి పెట్టారు.  ఎయిర్ పోర్టుకి ఇంత వరకు శంకుస్థాపన కూడా చేయలేదు కానీ.. కోట్లాది రూపాయల రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రం సాగిపోయింది. ప్రభుత్వం వెంటనే అక్కడ ఎయిర్ పోర్టు నిర్మించకపోతే.. ముందు ముందు ఇబ్బందులు తీవ్రమవుతాయని కొందరు హెచ్చరిస్తున్నారు. విశాఖపట్నం వేగంగా అభివృద్ధి చెందాలన్నా.. ఆ చుట్టు పక్కల పర్యాటక ప్రాంతాలకు పర్యాటకులు పెద్ద ఎత్తున్న రావాలనా.. ఉత్తరాంధ్ర పురోగమించాలన్నా.. విశాఖలో అంతర్జాతీయ ఎయిర్ పోర్టు అత్యవసరం. ఎయిర్ పోర్టును తమకిచ్చేయాలంటూ నేవీ ఇప్పుడు కోరడంపై కేంద్రం హస్తం ఉందనేది రాష్ట్ర నేతల ఆరోపణ.


మరింత సమాచారం తెలుసుకోండి: