2019 సాధారణ ఎన్నికలకు శాసనసభ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ, రాష్ట్రంలో రాజకీయాలు ఇప్పటికే సెగలు కక్కుతున్నాయి. ఒకవైపు పాదయాత్ర పేరున జగన్ రాజకీయ వాతావరణం వేడెక్కించడం, జగన్ కు జానాధరణ రోజు రోజుకీ పెరిగిపోతుండటంతో, చంద్రబాబు కు కొత్త టెన్షన్స్ స్టార్ట్ అయ్యాయంట. జగన్ సంగతి ఇలా ఉంటే.. 

బాబు భారీ ఆపరేషన్
మరో పక్క జనసేన అధినేత జనాధరణ ఉన్న సినీ నటుడు పవన్ కల్యణ్ రూపం లో చాపకింద నీరులా ప్రభుత్వంపై అంతకంటే అధినేతపై వ్యతిరేకత పెరిగిపోతుందని మరో టెన్షన్ పట్టుకుందట. అంతేకాదు ఎన్ డి ఏ నుండి బయటకు వచ్చి తనే స్వయంగా బిజెపిపై ప్రధాని నరెంద్ర మోడీపై ప్రత్యక్షంగా టిడిపి అధినేత చేసిన ఆరోపణ లు అంతేకాకుండా దీక్షల పేరుతో చేస్తున్న వన్నీ టిడిపి అరాచాకాలు గా బిజెపి భావిస్తున్న తరుణంలో – జరగనున్న పరిణామాలకు అంతరాంతరాల్లో పెరిగిపోతున్న భయం భీతి …ఇవన్నీ త్రిశూల వ్యూహంలాగా ముప్పిరి గొలుపు తున్నాయి. ఇవి చాలవన్నట్లు పార్టీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరి మరో తలనొప్పిగా తయారైన క్రమంలో, ఇవి కూడా చాలవన్నట్లుగా బాబుకు మరో కొత్త టెన్షన్ వచ్చిపడిందట. అదే  మీటింగులకు హాజరు బాగా తగ్గింది.
Image result for Non attendance of TDP guntur dist people Representatives Chandrababu conferences
తాజాగా చంద్రబాబు ఏర్పాటు చేస్తున్న ప్రతి టెలీ కాన్-ఫరెన్స్ లకు, జిల్లా మీటింగు లకు కొంత మంది ఎమ్మెల్యేలు గైర్హాజరవుతున్నారు! వారికి కూడా వ్యక్తిగత కారణాలు ఉండొచ్చు, ఏదైనా ముఖ్యమైన పని ఉండొచ్చు అని సర్ధుకుందామనుకుంటే, మరో పక్క జగన్ పాదయాత్ర గుర్తుకు వస్తుందంట! దీంతో నిద్రలో కూడా ఉలిక్కిపడు తున్నారట చంద్రబాబు.
Related image

తన మీటింగులకు గైర్హాజరవుతున్న నేతలపై అయ్న అగ్గిమీద గుగ్గిలమే అవుతున్నారంట. అసలు ఎందుకు హాజరు కాలేకపోయారు, ఏమిటి సమస్య అని అడగడం మానే సిన అధినేత, నిప్పుల వర్షాలు కురిపిస్తున్నారట. దీనికి కారణం, వారు ఉక్కపోత భరించలేక గాలి కోసం ఫ్యాన్ కిందకి చేరిపోతున్నారేమో? అనే భయం ఆయనకు పట్టు కుందట, అని తమ్ముళ్లు కూడా అంటున్నారు!!
Image result for jagan on godavari bridge
దానికి తాజా ఉదాహరణ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశమైన సమయం లో జరిగింది. మంత్రులు, పార్టీ సీనియర్‌ నేతలు హాజరైన ఈ సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడితో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు చంద్రబాబు. ఈ సమావేశంలో, పలుజిల్లాల్లో నేతల గైర్హాజరుపై చంద్రబాబు మండిపడుతున్నారట. ఈ సమావేశంలో, గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆంజనేయులు ఏవో కొన్ని పనుల గురించి ప్రస్తావించగా, ఎంత సేపు అవి చేయండి, ఇవి చేయండని చెప్పడం తప్ప, నాయకులు కుదురుకోవడం లేదని సీఎం అసహనం వ్యక్తంచేశారట. గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎవరూ సమావేశానికి రాక పోవడం ఏమిటని తీవ్రంగా మండిపడ్డారు చంద్రబాబు.
Image result for chandrababu with dist level people representatives
అయితే, గతంలో ఎప్పుడు చంద్రబాబు సమావేశాలు ఏర్పాటు చేసినా ఒక్కరు కూడా గైర్హాజరయ్యే వారు కాదని చెబుతున్నారు తమ్ముళ్లు. అయితే ఈ మధ్యకాలంలో ప్రత్యక్ష సమావేశాల సంగతి దేవుడెరుగు, కనీసం వీడియో కాన్-ఫరెన్సులకు కూడా ఎమెల్యేలు అందుబాటులోకి రావటం  లేదని చెప్పుకుంటున్నారు. దీంతో వారిది నిర్లక్ష్యం అను కోవాలా? లేక జగన్ రూపంలో వచ్చిన మనో ధైర్యం అనుకోవాలో తెలియక బాబు తెగ టెన్షన్ పడిపోతున్నారని అంటున్నారు. దీంతో, ఇప్పటికే బాబుకి ఉన్న టెన్షన్స్ చాలవన్నట్లు, ఈ గైర్హాజరీల టెన్షన్ తోడైందని తెగ ఫీలవుతున్నారంట బాబు! అది గమనించిన తమ్ముళ్లు కూడా ఫీలవుతున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: