గత సార్వత్రిక ఎన్నికలలో ఆరువందలకు పైగా అబద్ధపు హామీలు ఇచ్చి వాటిని ఏమీ నెరవేర్చకుండా అధికారమే పరమావధిగా చేసుకుని అన్యాయంగా విభజనకు గురైన ఆంధ్రరాష్ట్రంలో భారీ అవినీతికి తెగబడుతున్న తెలుగుదేశం నేత చంద్రబాబు కి కేంద్రమన్న కేంద్ర పెద్దలన్నా భయపడిపోతున్నారు. తాజాగా ఇటీవల ప్రధాని మోడీ ఈనెల 16న నీతి అయోగ్ సమావేశానికి రావాలని చంద్రబాబుకు ఆహ్వానం పంపిన తాను రావడానికి కుదరటం లేదు అంటూ కుంటిసాకులు చెప్తున్నారు.
Image result for chandrababu modi
ఆ రోజు రంజాన్ అని, తనను కలవడానికి అనేక మంది ముస్లింలు వస్తారని.. అందుకే ఆ రోజు సమావేశం వద్దని చంద్రబాబు పేర్కొన్నాడట. ఆ రోజు తను అమరావతిలోనే ఉండాలని అనుకుంటున్నట్టుగా బాబు పేర్కొన్నాడట. ఇదే  విషయాన్ని లేఖలో పేర్కొన్నారు. వాస్తవానికి తాను చేసిన అవినీతి పనులకు తన మీద చట్టరీత్యా చర్యలు తీసుకోకుండా ఉండేందుకుగాను కేంద్రం దగ్గర ప్రత్యేక హోదా ని తాకట్టు పెట్టి..చివరాకరికి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేదు అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించలేదు అంటూ తన అనుకూల మీడియా ద్వారా ఆ బురదను కేంద్రంపై నెట్టివేసి పబ్బం గడుపుతున్నారు.
Related image
వాస్తవానికి మోడీని కలవడానికి చంద్రబాబు ఇష్టపడటం లేదని, అందుకే రంజాన్..ముస్లింలు అంటున్నాడనే టాక్ కూడా నడుస్తోంది. ఆ సమావేశానికి వెళితే మోడీకి ఎదురుపడాల్సి ఉంటుంది.
Image result for chandrababu modi
చంద్రబాబుకు ఇప్పుడు మోడీకి ఎదురుపడటానికి మొహం లేదని సమాచారం. అయితే మరోపక్క ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు ఈసారి మోడీని చంద్రబాబు కలిస్తే అదే చివరి భేటీ అవుతుంది ఎందుకంటే ఓటుకు నోటు కేసు తిరిగి తోడు తారు అందువలనే చంద్రబాబు మోడీ ని కలవడానికి భయపడుతున్నారు అని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: