నమ్మినవారిని వెన్నుపోటు పొడిచే సహజ గుణం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుదని బిజెపి ఏపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా,  ప్రధానమంత్రి మోడీని కలిశారు. ఆ తర్వాత ఆయన బుధవారం నాడు న్యూఢిల్లీలో మాట్లాడారు.

Image result for chandrababu why U-TURN PM question what is Kanna

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎందుకు యూ-టర్న్ తీసుకొన్నారని? తనను ప్రధానమంత్రి నరెంద్రమోడీ తనను అడిగారని బిజెపి రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. అయితే రాజకీయ స్వార్ధప్రయోజనాల కోసమే బాబు యూ-టర్న్ తీసుకొన్నారని ఆయన చెప్పారు.

Image result for chandrababu why U-TURN PM question what is Kanna 

నమ్మిన వారిని వారెవరైనా ఎంతటివారైనా "వెన్నుపోటు పొడిచే సహజగుణం" చంద్రబాబు నాయుడుకు ఉందన్నారు. గతంలో కూడ 2004లో కూడ బిజెపితో తెగతెంపులు చేసుకొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విభజన హమీలు అమలు చేస్తామని కేంద్రం ఇచ్చిన హమీని నిలబెట్టు కొన్నామని ప్రధాని నరెంద్ర మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తమకు చెప్పారని ఆయన చెప్పారు.

 

“కనకపు సింహసనమున

XXXX గూర్చుంద బెట్టి శుభ లగ్నమునన్

దొనరగ బట్టము గట్టిన

వెనుకటి గుణమేల మాను గదరా సుమతి!”

 

‘మీరెంత గౌరవించినా కొందరికి వెన్నుపోటు పొడవటం సహజగుణం అది చేయక పోతే చేతులు గులగుల లాడతాయి’  అందుకే ఒక వేటేస్తే పోలా? అన్నట్లు ఒక వేటెసేస్తారు. అలాగె ఒక ముఖ్యమంత్రి గతం లో పిల్ల నిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి అధికారలోకి వచ్చి ఆపై మన పార్టీకి 1999లో వెన్నుపోటు పొడిచి పదవిలో కుదురుకున్నాడు. అది గమనించక 2014 లో ఆయనకు అవకాశం ఇవ్వటం మనతప్పు. ఇక్కడ వెన్నుపోటు పొడవటం సహజ గుణం అని చెప్పకనే చెప్పారు కన్నా - మోదీకి.

Image result for chandrababu why U-TURN PM question what is Kanna ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకొని రాష్ట్రానికి కేంద్రం బాగా నిధులు ఇచ్చిందని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  చెప్పిన విషయాలను కన్నా లక్ష్మీనారాయణ గుర్తు చేశారు. అయితే విదేశీ సంస్థల నుండి 'మొబిలైజేషన్ అడ్వాన్స్' ను 30 శాతం ఇవ్వడానికి సిద్దంగా లేకపోవడంతో ఇంటర్నల్-ఏజెన్సీ నుండి డబ్బులు తీసుకొనే వెసులు బాటు కల్పించాలని కేంద్రాన్ని కోరితే కేంద్రం కూడ సానుకూలంగా స్పందించిందన్నారు.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం అన్నిరకాలుగా సహయసహాకారాలు అందచేస్తున్నా అన్ని రాజకీయపార్టీలు కూడ బిజెపిని దోషిగా చూపే ప్రయత్నం చేస్తున్నాయ ని ఆయన అభిప్రాయపడ్డారు. రైల్వేజోన్ ఏర్పాటు విషయంలో కేంద్రం వెనుకడుగు వేయలేదని ఆయన చెప్పారు. దక్షిణాదిలో ఏ రాష్ట్రానికి కూడ ఇవ్వని నిధులను ఏపీకి విడుదల చేసినట్టుగా ఆయన చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: